Famous Indian actress devika rani biography | dada saheb phalke award

Devika rani biography famous telugu actress dada saheb phalke award

devika rani news, devika rani biography, devika rani famous actress, devika rani telugu actress, devika rani history, devika rani life story, devika rani filmography, devika rani marriage life, devika rani death news, indian famous actress, indian heroines

devika rani biography famous telugu actress dada saheb phalke award : The Biography of famous indian actress devika rani who won the first dada saheb phalke award in indian film history. she was also gained padma sri award from indian government.

తొలి ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత దేవికారాణి

Posted: 04/01/2015 12:47 PM IST
Devika rani biography famous telugu actress dada saheb phalke award

చిత్రపరిశ్రమలో తొలితరం హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన సుప్రసిద్ధ భారతీయ నటి దేవికారాణి.. ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు నెలకొల్పిన తొలిసారే గెలుచుకుని రికార్డు సృష్టించారు. అప్పట్లో ఎందరో కథానాయికలు వున్నప్పటికీ.. వారందరినీ వెనక్కు నెడుతూ తన అందం, నటనా ప్రతిభతో ఈమె ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అప్పటి సినీ ప్రముఖులు ఈమె టాలెంట్ ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు కూడా! ఈమె నటించిన ప్రతిసినిమాలోని పాత్రలో పూర్తిగా లీనమైపోయి జీవించింది. ఇలా ఈమె గురించి చెప్పుకుంటూ పోతే.. పొగిడేందుకు మాటలు సరిపోవేమో! అంతటి స్థాయిని గడించిన నటి ఈమె!

జీవిత చరిత్ర :

1908 మార్చి 30వ తేదీన విశాఖపట్టణంలో దేవికారాణి జన్మించారు. ఈమె తండ్రి పేరు ఎం.ఎన్.చౌదరి. ఈయన భారతదేశపు తొలి సర్జన్ జనరల్ కల్నల్! దేవికారాణి శాంతి నికేతన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం ఉపకారవేతనం మీద లండన్ వెళ్ళి అక్కడ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమటిక్ ఆర్ట్స్ లో జాయిన్ అయి మ్యూజిక్, యాక్టింగ్ లో శిక్షణ పొందారు.
కొన్నాళ్ల తర్వాత ఈమెకు జర్మనీలో ప్రసిద్ధ సినీ నిర్మాతగా పేరుపొందిన హిమాంశు రాయ్ తో పరిచయం ఏర్పడింది. కాలక్రమంలో వారిమధ్య ఆ పరిచయం ప్రేమగా మారి 1929లో పెళ్ళి చేసుకున్నారు. వివాహానంతరం రాయ్ తన భార్య దేవికను బెర్లిన్ లోని యు.ఎఫ్.ఎ. స్టూడియోలో చేర్పించి.. అక్కడ మేకప్, కాస్ట్యూమ్ డిజైనింగ్ విభాగాల్లో శిక్షణ ఇప్పించారు.

ఇక ఇద్దరూ స్వదేశానికి తిరిగివచ్చి తర్వాత సొంతంగా ‘కర్మ’ (1933) అనే చిత్రాన్ని నిర్మించారు. దేవికారాణి నాయికగా, హిమాంశురాయ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాని హిందీలోకి అనువదించి విడుదల చేయగా అక్కడ ఘనవిజయం సాధించింది. ఈమె 1934లో ‘బాంబే టాకీస్’ అనే సంస్థను స్థాపించారు. ఎందరో ఔత్సాహిక కళాకారుల్ని చేర్చుకొని వివిధ రంగాల్లో శిక్షణనిచ్చారు. ఈ సంస్థ తీసిన చిత్రాలలో దేవికారాణి, అశోక్ కుమార్ ల జంట హిట్ పెయిర్ గా పేరుపొందారు.

దేవికారాణి నటించిన 16 చిత్రాలలోని చాలా పాత్రలు సంఘర్షణాత్మకమైనవి. సమాచ వివక్షతకు గురయ్యే హరిజన యువతిగా ‘అచూత్ కన్య’ (1936) లో, తల్లికాలేని గృహిణిగా ‘నిర్మల’ (1939)లో, అనాధగా ‘దుర్గ’ (1939), తిరగబడిన మహిళగా ‘సావిత్రి’ (1937)లో విధివంచితురాలైన బ్రాహ్మణ యువతిగా ‘జీవన్ ప్రభాత్’ (1937)లో వంటి సినిమాల్లో ఆమె గొప్పగా నటించింది.

వ్యక్తిగత జీవితం :

1940 మే 19న దేవికారాణి భర్త హిమాంశు రాయ్ హఠాన్మరణం పొందారు. దీంతో ‘బాంబే టాకీస్’ నిర్వహణ బాధ్యత మొత్తం ఆమె చేతిలో పడింది. కొన్నాళ్ల తర్వాత ‘బాంబే టాకీస్’ స్టుడియోను దర్శించడానికి సుప్రసిద్ధ రష్యన్ చిత్రకారుడు ‘స్వెతస్లోవ్ రోరిక్’ (Svetoslav Roerich) వచ్చాడు. ఆ సమయంలో దేవికారాణికి అతనితో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి 1945లో వివాహానికి దారితీసింది. తర్వాత ఆమె సినీరంగానికి దూరమయ్యారు.

సినీరంగానికి దేవికారాణి అందించిన సేవలకు గుర్తింపుగా ఆనాటి భారత ప్రభుత్వం 1958లో ఆమెకు ‘పద్మశ్రీ’ పురస్కారం ఇచ్చింది. ఇక ఆ సందర్భంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు నెలకొల్పిన తొలిసారి ఆమెకు 1969లో ప్రకటించారు. ఈమె బెంగుళూరులో గడుపుతూ 1994 మార్చి 9 తేదీన తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : devika rani biography  indian famous actress  dada saheb phalke award  

Other Articles