Popuri lalitha kumari biography famous literature feminist writer

popuri lalitha kumari news, popuri lalitha kumari life story, popuri lalitha kumari wikipedia, popuri lalitha kumari life history, popuri lalitha kumari story, popuri lalitha kumari biography, popuri lalitha kumari special story, popuri lalitha kumari writings, popuri lalitha kumari olga, olga writings, telugu lieratures, famous telugu literatures, feminist writers, feminist writers

popuri lalitha kumari biography famous literature Feminist writer

సాహిత్యరంగ చర్చల్లో స్త్రీవాద దృక్పధాన్ని ప్రవేశపెట్టిన రచయిత!

Posted: 11/12/2014 04:21 PM IST
Popuri lalitha kumari biography famous literature feminist writer

స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా ఎంతోమంది మహిళా రచయితలు తమ కలానికి, గళానికి పనిచెబుతూ.. మహిళలకు అండగా నిలిచినవారు వున్నారు. అటువంటివారిలో పోపూరి లలితకుమారి ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాహిత్యరంగాల చర్చల్లో స్త్రీవాద దృక్పధాన్ని ప్రవేశపెట్టిన ఈమె.. ‘‘ఓల్గా’’గా పేరొందిన ఒక గొప్ప రచయిత్రి! మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, దురాచారాలు, అన్యాయాలను అరికట్టే దిశగా పావులు కదిపిన ఈమె.. ఎందరో మహిళలకు నిదర్శనంగా నిలిచింది.

జీవిత విశేషాలు :

1950 నవంబర్ 27వ తేదీన గుంటూరులో పోపూరి లలితకుమారి జన్మించారు. ప్రాథమిక, హైస్కూల్ విద్యనభ్యసించిన అనంతరం ఈమె ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగుసాహిత్యం ఎం.ఏ. చేశారు. తదనంతరం తెనాలిలోని వి.ఎస్.ఆర్. కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా కొన్నాళ్లపాటు పనిచేశారు. అయితే స్త్రీ చైతన్యం అంశంగా చలం, కొడవటిగంటి కుటుంబరావు రాసిన నవలలకు ప్రభావితమైన ఈమె.. ఆ కోవలోనే రచనలు రాయడంలో దృష్టి సారించింది. పత్రికలలో, సాహిత్యములో, అనువాదములలో మహిళా హక్కులపై వివాదాస్పద చర్చలు చేసింది. స్త్రీచైతన్యానికి ప్రతీకగా ఎన్నో నవలలు, పద్యాలు రాసి సాహిత్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను సంపాదించుకుంది. ఈమె రాసిన ‘‘స్వేచ్ఛ’’ నవల ప్రతిఒక్కరిని ఎంతగా ప్రభావితం చేసిందంటే... ఆ నవలను వివిధ భారతీయ భాషల్లోకి అనువదించడానికి నేషనల్ బుక్ ట్రస్టు స్వీకరించింది.

చలన చిత్ర రంగములోనూ ఈమె ‘‘ఉషా కిరణ్’’ సంస్థకు కథా రచయిత్రిగా పని చేసింది. ఆ సమయంలోనే మూడు మంచి చిత్రాలను నిర్మించి.. వాటికి పురస్కారాలను పొందింది. 1986 నుండి 1995 వరకు ఆమె ఉషా కిరణ్ మూవీస్ లో సీనియర్ కార్యవర్గ సబ్యురాలిగా పనిచేసారు. 1991 నుండి 1997 వరకు అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కు అధ్యక్షురాలిగా పనిచేసారు. ఇదిలావుండగా... లలితకుమారి (ఓల్గా) రాసిన 12 రచనలను, కథలను ఆంగ్లానువాదాలను అమెరికన్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వారు తమ సంగ్రహములో చేర్చారు. సాహిత్యంరంగంలో ఈమె అందించిన సేవలకుగానూ 1990లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2014 లోక్ నాయక్ ఫౌండేషన్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ‘‘అస్మిత’’లో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.

ఓల్గా రాసిన రచనలు :

1. రాజకీయ కథలు -1993
2. స్వేచ్ఛ - 1994
3. సహజ - 1995
4. ప్రయోగం - 1995
5. మానవి - 1998
6. కన్నీటి కెరటాల వెన్నెల - 1999
7. గులాబీలు - 2000
8. అకాశంలో సగం (ఉత్తమ నవల పురస్కారం)
9. పలికించకు మౌనమృదంగాలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : popuri lalitha kumari  telugu literatures  feminist writers  telugu news  

Other Articles