Mahaa nati savithri jayanthi special

Mahaa nati Savithri Jayanthi Special, Great Actress Savithri, Mahaa nati Savithri Jayanthi, Mahanati Savitri Jayanthi life story, Savitri Jayanthi Today 6th December 2013

Mahaa nati Savithri Jayanthi Special, Mahanati Savitri Jayanthi life story

కనులతో నటించిన ఏకైక నటశిరోమణి సావిత్రి

Posted: 12/06/2013 04:09 PM IST
Mahaa nati savithri jayanthi special

మనిషి మరువలేని మహానటి సావిత్రి . ఆమే నటనాకౌశలం ఒక అపూర్వ గ్రంధాలయం. ఎన్ని తరాలు మారినా ఆమె "జీవించిన" చిత్ర రాజాలు ఆంధ్రుల మదిలో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. అమెని తెలుగు చిత్ర రంగంలో తిరుగులేని నటీమణిగా నిలబెట్టాయి. సావిత్రి పుట్టిననెల గిట్టిన నెల డిసెంబరు మాసం కావటం కాకతాళీయం. జననం డిసెంబరు 6,1937 - మరణం డిసెంబరు 26, 1981 (శనివారం). ఆమె జీవిత కాలం కేవలం 44సంవత్సరాలు మాత్రమే.

 

సావిత్ర బాల్యం జీవితం

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో డిసెంబరు 6న నిస్సాంకురమ్ గురవయ్య, సుభద్రమ్మలకు జన్నించారు. నాట్యంలోనూ, సంగీతంలోనూ ప్రవీణ్యురాలై, ఎన్నో ప్రదర్శనలిచ్చారు. నందమూరి తారకరామారావు, జగ్గయ్య వంటి మహా నటులు ఆరోజుల్లో నడిపిన నాటక ప్రదర్శనలలోనూ స్టేజీమీద ప్రదర్శనలిచ్చారు. తరువాత కాలంలో "నవభారత నాట్యమండలి" అనే నాటక కంపెనీ స్ధాపించారు. బుజ్జిబాబు రచించిన "ఆత్మ వంచన" నాటకం ప్రదర్శన ప్రసిద్ధి చెందింది.

12 సంవత్సరాల వయస్సులో మద్రాసు చేరిన ఆమె సినిమాలలో ప్రయత్నం చేశారు. తెలుగులో తొలి అవకాశం యల్.వి.ప్రసాద్ గారి "సంసారం" సినిమాలో లభించింది. 1949లో "అగ్ని పరీక్ష"లో అవకాశం వచ్చినా అప్పటికి ఆమె చిన్న పిల్లని, మెచ్యూరిటీ లేక ఆపాత్రకి సరిపోదని ఆ సినిమాలో ఆమెను ఎంపిక చేయలేదు. అనంతరం "పాతాళభైరవి" చిత్రంలో నృత్యపాత్రలో కనిపించారు. అలా చిన్న చిన్న పాత్రలతో ప్రారంభమైన ఆమె నట జీవితం "పెళ్ళిచేసి చూడు", "అర్ధాంగి", "మిస్సమ్మ" ఇలా ఎన్నో సినిమాలతో ఎదిగి, మంచి నటిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. మహానటిగా నిలబెట్టింది. ఆమె తెలుగుతో పాటు తమిళ సినిమాలలోనూ తిరుగులేని నటీమణి. ఆమె తొలుత ప్రముఖ తమిళ హీరో జెమినీగణేష్ తోనూ, శివాజీ గణేశన్ తోనూ అనేక చిత్రాలలో నటించారు.

 

సావిత్రి వివాహ జీవితం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించారు. హీరో జెమినీ గణేష్. ఆ సమయంలోనే ప్రేమ మత్తులో పడి 1953లోనే ఆమె జెమినీ గణేష్ ని వివాహం చేసుకున్నారు. కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ లను చాలా స్ట్రిక్ట్‌గా డిసిప్లిన్‌తో పెంచారు. టి.వి.లు లేని ఆరోజుల్లో 16ఎం.ఎం. ప్రొజెక్టర్ పెట్టి ఇంట్లోనే సినిమాలు చూసేవారు. అడిగినవారికి లేదనకుండా దానమిచ్చే దానశీలి సావిత్రి. లాల్ బహుదూర్ శాస్తిగారి సమక్షంలో తన వంటిమీదున్న నగలని ప్రధాన మంత్రి సహాయ నిధికి దానమిచ్చారు. ఆమె సంపాదనలో అధిక భాగం దానాలకే ఖర్చయ్యేది. అందరినీ నమ్మేవారు.

సావిత్రి అభిరుచులు..

ఆమెకి క్రికెట్ అన్నా, ఛెస్ అటలంటే ప్రీతి. ఆమెకి ఎడమచేతి వాటం ఎక్కువ. పిల్లలని ప్రేమతో చూసుకునేవారు. తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్ని అలరించిన సావిత్రి తెలుగు సినీ సామ్రాజ్ఞి. సినీ జీవితంలో అత్యున్నత స్ధానాన్ని అధిరోహించినా,నిజ జీవితంలో అతిఘోరంగా విఫలమైయ్యరు. చిన్నవయసులోనే మృత్యువుతో పోరాడిన ఆమె జీవిత చరమాంకం అందరికీ ఒక పాఠం. ఆమె నటజీవితం ఎందరో నటీమణులకి మార్గదర్శ

 

సినీ సామ్రాజ్ఞి....సావిత్రి

తెరపైన, తెర వెనుక కూడా అనేక పాత్రలతో అశేష ప్రజానీకాన్నిఅలరించారు మహానటి సావిత్రి. తెలుగు వారు మరచిపోలేని పాత్ర "దేవదాసు"లోని పారు. ఇఫ్పటికీ వన్నె తరగని చిత్రమది. అలాగే "మాయాబజార్"లోని శశిరేఖ పాత్ర. ఇప్పటికీ "అహనా పెళ్ళంట...." పాటని ఆ సన్నివేశాన్ని ఎవరూ మరువలేరు . చూపులతో, పెదవి కదలికలతో, తన నటనతో ఎందరినో మంత్రముగ్ధులను చేశారు ఆమె. "నర్తనశాల", "శ్రీకృష్ణపాండవీయం", "సుమంగళి", "నాదీ ఆడజన్మే", "నవరాత్రి" ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చిత్రాలు ఆమె నటనాకౌశలానికి దీపికలు. "దొంగరాముడు", "తోడికోడళ్ళు", "అభిమానం", "మురిపించేమువ్వలు(1960)", "మంచిమనసులు(1961)", "డా. చక్రవర్తి (1964)", "దేవత(1965)", "మనసే మందిరం (1971)"... వంటి చిత్రాలు ఆమె నటనకి మైలు రాళ్ళు. తెలుగు తమిళ, హిందీ చిత్రాలన్నిటిలో కలిపి 318 సినిమాలలో నటించారు. హిందీలో "బహుత్ దిన్ హుమై", "ఘర్ బసాకే దేఖో", "బలరామ్ శ్రీకృష్ణ", "గంగాకి లహరే" మొదలైన చిత్రాలు చేశారు. సావిత్రిని దక్షిణాది మీనాకుమారిగా అభివర్ణించేవారు.

 

సావిత్రి తెరవెనుక పాత్రల్లో

దర్శకురాలిగా : మాతృదేవత, వింత సంసారం, చిన్నారి పాపలు, చిరంజీవి మొదలైన చిత్రాలు.

నిర్మాతగా: చిన్నారి పాపలు, ఏక్ చిట్టీ ప్యార్ భరీ చిత్రం బాగుందన్నా... ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నది.

గాయనిగా: నవరాత్రి సినిమాలో ఒక పాట పాడారు.

సావిత్రి బిరుదులు, అవార్డులు

తమిళ్ రాష్ర్ర ప్రభుత్వంచే కలైమామణి...

నడిగర్ తిలగమ్...

నటశిరోమణి...

మహానటి....

ఉత్తమ నటీమణి...

ఇంకా ఎన్నో అవార్డులు అందుకున్నారు....

ఎవ్వరూ ఇవ్వలేని, సావిత్రి స్వయంగా సంపాదించుకున్న అవార్డు/రివార్డు "ప్రజల హృదయాలలో చిరంజీవి"గా నిలిచిపోవడమే ఆమెకు అసలైన అవార్డు.

 

సావిత్రి జీవితం - చరమాంకం

"మనంపోల మాంగల్యమ్(1953)" తమిళ సినిమాలో ఆమె నటించే సమయంలోనే.హీరో జెమినీ గణేష్ ప్రేమ మత్తులో పడి ఆమె ఆయనను వివాహం చేసుకున్నారు. ఎంతో ఇష్టపడి, ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె వైవాహిక జీవితం మాత్రం ముళ్ళబాటలోనే నడిచింది. వివాహ సంబంధాలు ఇరువురి మధ్య తెగిపోయాయి. నమ్మిన వ్యక్తులే మోసపుచ్చి ఆమెను నట్టేట ముంచారు . ఎంతో సంపన్నురాలైన ఆమె వ్యాపారాలపేరిట, దానాలపేరిట, మోసాలపాలై, ఇలా సంపాదించినదంతా పోగొట్టుకున్నారు. జీవితంలో తట్టుకోలేని సమస్యలు, మెంటల్ టెన్షన్ లు ఎక్కువయ్యాయి. చివరికి వ్యసనాలకు బానిస అయ్యారు. తాగుడు, నిద్రమాత్రలు, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడ్డారు. అనేక మార్లు ఆస్పత్రిలో చేరి చికిత్సనూ పొందారు. డాక్టర్లు మత్తు పదార్ధాలు వలదని వారించినా ఫలితం లేకపోయేది.

చివరిసారిగా ఆమె బెంగుళూరు సమీపంలో తెలుగు చిత్రానికి షూటింగ్‌లో పాల్గొనటానికి వెళ్లి (మత్తులో) పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయారు. డయాబెటిక్ వ్యాధిగ్రస్ధురాలు కూడా అయిన ఆమె అంతిమ దశలోకి (టర్మినల్ కోమా) చేరుకున్నారు. ఆమె మరణించడానికి ముందు సినీ పరిశ్రమ నుంచి (సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛేంబర్ గోల్డెన్ కమిటీ) ఆమెకి 10,000 రూపాయలు విరాళం అంధింది. అవి ఆమె వైద్యానికి ఎంత మాత్రం సహాయ పడ్డాయో తెలియదు. ఇద్దరు పిల్లలు, నర్సు సంరక్షణలో, అద్దె భవనంలో అతి భయంకరమైన పరిస్ధితిలో.... దాదాపు 18 నెలల సుదీర్ఘ పోరాటం అనంతరం డిసెంబరు 26, 1981, శనివారు రాత్రి 11గం.లకు తుది శ్వాస విడిచారు. అయితే సావిత్రి నటిగా కాక దర్శకురాలిగా కూడా అందరి మన్ననలు అందుకున్న ఆ మహానటి భౌతికంగా మన మధ్య లేకపోయినా... ఆమె జ్ఞాపకాలు మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంటాయి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles