Meera sanyal banks on politics

meera sanyal, business network, helping professionals like meera sanyal,

meera sanyal banks on politics

స్ఫూర్తిగా నిలుస్తున్న మీరా సన్యాల్‌

Posted: 06/04/2013 02:38 PM IST
Meera sanyal banks on politics

984 నుంచి బ్యాంకింగ్‌ ప్రొఫిషన్‌లో పనిచేస్తున్నారు. అంతేకాకుండా రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాంట్‌లాండ్‌ గ్రూప్‌(ఆర్‌బిఎస్‌)కి అధ్యక్షురాలిగా, మన దేశం తరఫున ఎగ్జిక్యూటీవ్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికంటే ముందుగా ఆర్‌బిసి గ్రూప్‌ నుంచి ఏసియా పసిపిక్‌ ప్రాంతానికి చీఫ్‌ ఆపరేషన్‌ అధికారిణిగా పనిచేశారు. ఆమె 2001లో ఎసెస్‌ బ్యాంక్‌ గ్లోబల్‌ సర్వీస్‌ కంపెనీని ఏర్పాటు చేశారు.

అంతేకాకుండా ఆర్‌బిఎస్‌లో 1992లోనే లజార్డ్‌ ప్రాంతం నుంచి పెట్టుబడి బ్యాంకింగ్‌లో హెడ్‌గా చేరారు. మీరా ఆర్‌బిసి కొనసాగుతున్నప్పుడు అనేక ప్రాజెక్టులను ఆమె ఆధీనంలోనే నిర్వహించారు. అంతేకాకుండా పేదరికం తొలగించడానికి ఎక్కువగా పులుల సంచరించే ప్రాంతాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లోనూ తిరుగుతూ జీవ వైవిద్యం గురించి వారికి తెలియజేసేవారు. వారికి సహాయం కూడా అందుబాటులో ఉండేవిధంగా చేసేవారు.

మీరా చేస్తున్న కార్యక్రమాలకు గుర్తించి, ఆమెను ఎఫ్‌ఐసిసిఐ సంస్థ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా టెరి(టిఈఅర్‌ఐ)కు బిజినెస్‌ కౌన్సిల్‌గా కూడా ఉన్నారు. కార్పొరేట్‌ ప్రపంచం ఇప్పుడు మగమహారాజులేక పరిమితం కాదు.. బోర్డు రూముల్లో తమ చాకచక్యాన్ని ప్రదర్శిస్తూ.. వేల కోట్ల సామ్రాజ్యాలను ఎంతో ధీరోదాత్తంగా నిర్వహిస్తున్న మహిళామణుల సంఖ్య రానురాను పెరుగుతోంది. ఇలాంటి మహిళల్లో మీరా సన్యాల్‌ ఒకరు. ఆర్థిక ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు కూడా ఆమె తెలివితో కంపెనీని లాబాల బాట నడిపించారు. ప్రజాప్రతినిధిగా ఎంతో మందికి వీలైనంత సాయం చేశారు.

మీరా సన్యాల్‌ విద్యాభివృద్ధి పట్ల ఎక్కువగా మక్కువ ఉండటం వల్ల, నేషనల్‌ అడెవైజరి బోర్డ్‌ ఆఫ్‌ ఎఐఈఎస్‌ఈసికు సలహాదారుగా వ్యవహరించారు. వాటితో పాటు ముంబాయిలోని జైహింద్‌ కళాశాలకు బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. 2011లో సెక్రెటరీ ఆఫ్‌ స్టేట్‌ హిల్లరి క్లింటన్‌ ఆధ్వర్యంలో సాగే ఇంటర్‌ నేషనల్‌ కౌన్సిల్‌ ఉమెన్‌ బిజినెస్‌ లీడర్స్‌లో చేరాల్సిందిగా మీరా సన్యాల్‌ ఆహ్వానం అందుకున్నారు. మీరా సన్యాల్‌ ముంబాయిలోని ఫోర్ట్‌ కన్వర్ట్‌ స్కూల్‌, ఢిల్లీలోని లోరెటో కన్వర్ట్‌ పాఠశాల, ముంబాయిలోని క్యాథడ్రాల్‌ జాన్‌ కానాన్‌ పాఠశాలలో విద్యను అభ్యసించారు. సిండెన్హామ్‌ కళాశాలలో డిగ్రీలో బికాం పూర్తి చేశారు. ముంబాయిలో ఎంబిఎ కూడా చేశారు. ఆమె చార్టెడ్‌ ఇన్‌స్ట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకర్స్‌, హార్వాడ్‌ బిజినెస్‌ స్కూల్‌లో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ను పూర్తి చేశారు. ఎఎన్‌జడ్‌ గ్రిండ్లేస్‌ బ్యాంకులో తన కెరీర్‌ను ప్రారంభించిన మీరా 2002లో ఎబిఎన్‌ ఆమ్రోలో చేరారు.

అతి తక్కువ సమయంలోనే ఆ బ్యాంకు భారతదేశ శాఖకు సారథిగా ఎదిగిన మీరా ఆర్థిక సంక్షోభం సమయంలోనూ ఏ మాత్రం చెక్కు చెదరకుండా తన బ్యాంకును అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర వహించారు. ఇందుకు ఆమె చేసిన కృషి ఎంతో ఉంది. అవసరమైన కీలక సమయంలో ఆమె తన బాధ్యతలను నిర్వర్తించడం కోసం 24 గంటల సమయాన్ని కూడా బ్యాంకులోనే గడిపేవారంటే ఆమె నిబద్దత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఎంతో కీలక రంగమైన ఆర్థిక రంగంలో గతంలో కేవలం మగ వారు మాత్రమే ఉన్నత పదవులలో కొనసాగేవారు. అయినప్పటికీ ఆ రంగం అకస్మాత్తుగా కుదలేయినప్పుడు వారు వెనుకకు తగ్గారు. కానీ ఈమె మాత్రం అవకాశాన్ని అందిపుచ్చుకుని సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న సంస్థలను లాభాల బాట పట్టించారు. మనోధైర్యంతో తానేంటో నిరూపించుకున్నారు.

భారతదేశంలో శక్తివంతమైన మహిళల్లో మీరా సన్యాల్‌ ఒకరు. 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ముంబాయి దక్షిణ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఇండియన్‌ లిబరల్‌ గ్రూప్‌ కు ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2009లో దక్షిణ ముంబాయి నియోజకవర్గం నుంచ ఇ ఇండిపెండెంట్‌గా ఎన్నికల్లో పోటిచేసి జాతీయ, అంతర్జాతీయ మీడియాను ఆకర్శించారు. హేమాహేమీలైన మిలింద్‌ దేవరా, మోహన్‌ రవాలే లాంటి వారితో పోటీ పడ్డారు. ఈమె గుర్తు న్యూ క్లీన్‌గా ఎంచుకున్నారు. ప్రజా జీవితాల్లో చైత్యనం, మార్పు తీసుకురావడం కోసం ఇంకా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు.

మీరా ఇండియన్‌ నావీ వైస్‌ అడ్మిరల్‌ గులాబ్‌ మొహన్‌లాల్‌ హిరానందిని కుమార్తె. ఈయన పలు పత్రికల్లో ఇండియన్‌ నావల్‌ చరిత్ర గురించి రాసినందుకు గ్యాలంట్రీ అవార్డు అందుకున్నారు. మంచి కథనాలు రాసి రచయితగా పేరు తెచ్చుకున్నారు హిరానందిని. అంతేకాకుండా యునియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యుపిఎస్సి)లో కూడా పనిచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles