Telugu actress jayasudha special article

jayasudha, jayasudha special article, actress jayasudha, telugu heroine jayasudha, congress mla jayasudha, actress vijaya nirmla director balachandar, ntr,

actress jayasudha special article

మంచి మనసే జయసుధ

Posted: 05/15/2013 05:35 PM IST
Telugu actress jayasudha special article

విజయ నిర్మల నటిగా గుర్తింపు పొందుతున్న సమయం అది ... ఇటు వంటి సమయం లో ఈమెకు సంబంధించిన ఎవ్వరైనా , కనీసం బీర పీచు చుట్టరికం ఉన్నా సరే , ఈమె పలుకుబడి ఉపయోగించుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాలి అనుకుంటారు . కాని విజయనిర్మలకు వరుసకు కూతురు అయ్యే (విజయనిర్మల ఈమెకు పిన్ని ) జయసుధ మాత్రం , ఈమె శిఫార్సుతో పండంటి కాపురం లో నటించినా , ఇక వెయ్యబోయే అడుగులకు పునాదులు మాత్రం , నిస్సందేహంగా తాను నిర్దెసించుకున్నవే అవ్వాలని ఆసపడ్డారు ... అనుకున్నదే తడవుగా , దర్శకుల్లో ప్రత్యెక గుర్తింపు ఉన్న బాల చందర్ వద్దకు , తనకు అవకాసం ఇప్పించమని అడగటానికి వెళ్ళారు . జయసుధ కుటుంబం చెన్నై లో స్థిరపడటం వల్ల , తెలుగమ్మాయి అయినా , తమిళం అనర్గళంగా మాట్లాడే వారు ఈమె . ఇదే విషయం బాల చందర్ గారికి వివరించి , తనకు ఏ హీరోయిన్ పాత్ర కాక , తాను సరిపోతాను అనుకునే మంచి పాత్ర ఇప్పించమని అడిగారు . జయసుధగారి ఈ నిరాడంబరాటే , ఈమె 'అపూర్వ రాగంగళ్' రజనీ కాంత్ వంటి నటులతో సహా హీరోయిన్ గా తనకంటూ ప్రత్యెక గుర్తింపు ని సంపాదించుకునేలా చేసింది . ముందు తమిళం లో విజయం సాధించిన తరువాత , తెలుగులో ఎన్నో హీరోయిన్ ఒరిఎంటేడ్ చిత్రాలు , కమర్షియల్ చిత్రాలలో హీరోయిన్ గా నటించి , 'సహజ నటి' గా పేరు పొందారు జయసుధ .

తెలుగులో , అప్పట్లో సావిత్రి గారి వంటి హీరోయిన్లు కాక , తరువాతి తరం హీరోయిన్లు యన్ . టీ . ఆర్. సరసన నటించాలి అంటే కాస్త భయపదేవారనే చెప్పాలి . ఈయన అంత సీనియర్ నటులు మరి . అటువంటి ఈయన తో 'అడవి రాముడు' లో జయప్రద హీరోయిన్ కాగా , ఒక ముఖ్య పాత్ర పోషించే అవకాసం జయసుధకు ఒచ్చింది . అయితే , జయప్రదకు , జయసుధకు యన్ . టీ . ఆర్. సరసన నటించడం తొలిసారి . జయప్రద ఎంతో టెన్షన్ పడుతున్నారు . ఈ సమయం లో రాఘవేంద్రరావు గారు , షాట్ తీయడానికి యాక్షన్ చెప్పారు , యన్ . టీ . ఆర్. గురించి చెప్పేదేముంది , గుక్క తిప్పుకోకుండా తన డైలాగ్ ని చెప్పారు , తరువాత జయసుధ ఆ తరువాత జయప్రద డైలాగ్ చెప్పాలి . కాని జయసుధగారు డైలాగ్ మరచిపోవడం వల్ల 3 టెక్ ల తరువాత గాని షాట్ ఒకే కాలేదు .

షాట్ ఒకే అయిన తరువాత , గ్యాప్ లో యన్ . టీ . ఆర్. జయసుధగారిని 'డైలాగ్ ఎందుకు కావాలని మరచిపోయావ్?' అని అడిగితె , ఈ విషయం ఈయనకి ఎలా తెలిసిపోయిందబ్బా అని ముందు ఖంగు తిన్న జయసుధ , తరువాత తేరుకుని 'ఏం లేదు సార్ . మీ పక్కన నటించాలంటే జయప్రద టెన్షన్ పడుతోంది . ఈ లోపు ఒక రెండు సార్లు నా వల్ల షాట్ రీటేక్ అయితే , జయప్రద సద్దుకుంటుంది కదా అని' , అని తన ఆంతర్యం చెప్పారు జయసుధ . ఎదుటి వాళ్ళను అణగదొక్కి పైకి రావాలనుకునే పోటీ ప్రపంచం లో తోటి ఆర్టిస్ట్ కోసం ఇంతగా ఆలోచించిన మంచి మనసే జయసుధ ఈ చిత్రం తరువాత యన్ . టీ . ఆర తో వరుసగా నాలుగు సినిమాలు , రామకృష్ణులు, లాయర్ విశ్వనాథ్, కేడి నం.1, డ్రైవర్‌రాముడు, లో హీరోయిన్ గా నటించేలా చేసాయి .

'జ్యోతి' గా జయసుధ ఎంతటి అదుతమైన నటనని కనబరిచారో మనందరికీ తెలిసిందే . రాఘవేంద్రరావు గారు దర్శకుని గా నెలదొక్కుకోడానికి కూడా ఈ చిత్రం ఎంతగానో దోహద పడింది . స్టార్ హీరోయిన్ గా కంటే , ఆర్టిస్ట్ గా గుర్తింపు సంపాదించుకోవాలి అని ఈ చిత్రం చెయ్యడానికి ఒప్పుకున్న జయసుధ నటన , చిత్ర కధ , పాటలు , ఈ చిత్ర విజయానికి పునాది .

విభిన్నంగా అడుగులు వెయ్యడం , వచ్చిన ప్రతీ అవకాసం లో తన నటనని ఎలివేట్ చేసే పాత్రలు ఎంచుకుని ముందుకు సాగడం లో 'సహజ నటి' జయసుధ సరిఅయిన విజయం కోసం తపించే ఎందరో మహిళలకు స్పూర్తి .

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles