Telugu singer jikki special

telugu singer jikki, jikki tamil movie songs, jikki songs, songs of jikki, best of jikki, all songs of jikki, jikki hit songs, jikki music, jikki songs mp3

telugu singer jikki special

విన్నూత్న సాహసానికి ప్రజలు పట్టిన బ్రంహరధం

Posted: 05/09/2013 05:28 PM IST
Telugu singer jikki special

గోల్డెన్ ఎరా లో తెలుగు సినీ సంగీతం లో వికసించిన గాత్రాలు ఎందరివో ... అయితే , ఒకే స్వరం తో ఇటు మధురానుభూతిని , అటు కవ్వింపునీ పలికించగల గాయని మాత్రం , నిస్సందేహంగా జిక్కి గారే . తన అసలు పేరు జీ . కృష్ణవేణి అయినా , తండ్రి పెట్టిన ముద్దు పేరు 'జిక్కి' నే తన ఉనికిగా చేసుకుని , స్వరంతో మ్యాజిక్ ఎలా సృష్టించాలో చెప్పకనే చెప్పిన గాయనీమణి , జిక్కి ...

జిక్కి పాట వింటే , 'పులకించని మది' పులకిస్తుంది , 'హాయి హాయిగా ఆమని సాగుతుంది' , ఎన్ని సార్లు విన్నా ఈమె గాత్రం పై 'మోజు తీరదు' ... అన్ని దక్షినాధి భాషల్లో దాదాపు 10 వేలకు పైగా పాటలు పాడిన ఘనత జిక్కి గారిది ...

జిక్కి గారి కుటుంబం సంగీతం లో ప్రవేశం ఉన్న వారు ... ఈమె పెదనాన్న , కన్నడ చిత్ర సీమలో గుర్తింపు ఉన్న సంగీత దర్శకులు , దీనితో సినీ సంగీత ప్రవేశం చెయ్యడం జిక్కి గారికి పెద్ద కష్టం ఏమి అనిపించలేదు ... కాని సుశీల , జానకి వంటి తోటి గాయనీమణుల పోటీ ని తట్టుకుంటూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకోవడం మాత్రం జిక్కిగారికి అంత సులభమైన పని గా తోచలేదు ... అయినా , పట్టు విడవ కుండా, తన వద్ద వచ్చిన అవకాశాలని చిన్నతనంగా చూడకుండా , నవరసాలనీ ప్రతిబింబించే భావాలతో కూడుకున్న పాటలు పాడి , 6 ఏళ్ళ వయస్సు పిల్లవాడి నుండి 60 ఏళ్ళ వృద్ధుడిని కూడా తన పాటతో కట్టిపడేశారు జిక్కి.

గాయని గా తనకు అవకాశాలు ఇచ్చి , తన ప్రతిభను నమ్మి, ప్రోత్సహించిన నాగి రెడ్డి , యన్ . టీ . ఆర్. వంటి వారికి తాను స్టార్ గాయనిగా ఎదిగినా కూడా క్రుతగ్న్యతగా, తాను మొదట్లో యెంత పారితోషకం అయితే తీసుకునే వారో , అంతే పారితోషకం తీసుకుని పాటలు ఆలపించారు జిక్కి ...

సంగీత దర్శకులు ఏ . యం . రాజా - జిక్కి గారిది హిట్ పెయిర్ ... వీరిరువురూ కలసి ఆలపించిన ఎన్నో గీతాలు సూపర్ హిట్ గా నిలిచాయి ... నిజ జీవితం లో కూడా వీరిది 'ఒకరికి - ఒకరు' అన్న చందంగా కొనసాగిన మూడు ముళ్ళ బంధం ... పెళ్ళయిన 6 సంవత్సరాలకే ట్రెయిన్ ప్రమాదం లో రాజా గారు స్వర్గస్తులయిన తరువాత , జిక్కి గారి స్వరం కొన్ని సంవత్సరాల పాటు మూగబోయింది అంటే , వీరి బంధం ప్రేమతో ఎంతగా పెనవేసుకుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు ...

ఒక పాటకీ ఇంకో పాటకీ ఏ మాత్రం పొంతన లేకుండా , సందర్భానికి తగ్గట్టుగా స్వరాన్ని మార్చి పాడటంలో జిక్కి గారిది అందెవేసిన చెయ్యి ..

ఘంటసాల మాస్టర్ తో కలిసి జిక్కి గారు ఆలపించిన 'హాయి హాయి గా ఆమని సాగే ' అనే ఆల్ టయిం హిట్ పాట , వినడానికి ఎంతో శ్రావ్యంగా , సులువుగా సాగిపోతున్నట్లుగా అనిపిస్తుంది . అయితే, ఈ పాటను , రాగాలని ఆలపించే ప్రయత్నం చేస్తే తెలుస్తుంది ఈ పాట పాడటం యెంత కష్టతరమో ...

ఇదే సినిమా హిందీ వెర్షన్ లో ఈ పాటను ఆలపించిన మొహమ్మద్ రఫీ , లతా మంగేష్కర్ , 'జిక్కి - ఘంటసాల వారి లా ఈ పాటకు న్యాయం చెయ్యడం మా వల్ల కాలేదు ' అని తేల్చి చెప్పారు అంటే , ఈ పాట పాడిన వారి గొప్పతనం ఎంతటిది ...

ఇన్ని అసాధ్యమైన స్వరాలని సుసాధ్యం గా ఆలపించిన జిక్కిగారు , శాస్త్రీయ సంగీతం లో ప్రావీణ్యం పొందలేదు అంటే , నమ్మడం కాస్త కష్టంగా అనిపించచ్చు . కాని, సంగీతం , స్వరం జన్మతః కుటుంబం నుండి అబ్బిన కళలు అవ్వడం వల్ల స్వరాన్ని మేరుగుపరచుకోవడమే తప్ప ఎప్పుడూ ప్రత్యేకించి సంగీత సాధన చేసే అవసరం రాలేదు జిక్కి గారికి ...

తాను గాయని గా కొనసాగిన సమయం లో ఇతర ఏ గాయనీమణులు సాహసించని విధంగా 'మత్తు ' ఒలికించే పాటలు సైతం అవలీలగా ఆలపించి , వ్రుత్తి పట్ల గౌరవం మాత్రమె ప్రధానం అని నిరూపించిన మహిళ జిక్కి గారు ...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh