Profile for zia mody

Zia Mody, Harvard Law School, HLS, Profile,

Profile for Zia Mody - AZB & Partners.

Profile for Zia Mody.png

Posted: 10/20/2012 01:24 PM IST
Profile for zia mody

Zia_Modyవృత్తి, ప్రవృత్తి అందరిలోనూ వైవిద్య భరితంగానే ఉంటుంది. వృత్తిరంగాల్లో కూడా మహిళలు తమ శక్తిసామర్ధ్యాల్ని కనబరుస్తూ అందనంత ఎత్తుకి ఎదిగిపోతున్నారు. అందులో న్యాయ వృత్తి, వైద్య వృత్తి సమాజానికి ఎంతో అవసరమైనవి. వాటిలో కూడా ఊహించని శిఖరాలు అధిరోమస్తు న్నారు మహిళలు. ఏ శాస్ర్ర్తాన్ని అభ్యసించినా అందులో నిష్ణాతులై తమ కంటూ ఒక ప్రత్యేకతని, ప్రాధాన్య తని కనబరుస్తున్నారు. మగవారిని తోసిరాజని అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభని చాటుకుంటున్నారు. వృత్తి పరంగా దేశవిదేశాల్లో కీర్తి శిఖరాలనందుకున్న జియా మోడీయే అందుకు ఉదాహరణ.

జియా స్థాపించిన న్యాయ సంస్థ

పేరు : ఎజెడ్‌బి అండ్‌ పార్ట్‌నర్స్‌
అడ్రస్‌      : ఎక్స్‌ప్రెస్‌ టవర్స్‌, 23వ ఫ్లోర్‌
               నారిమన్‌ పాయింట్‌, ముంబాయ్‌-21
ఫోన్‌       : 91 22 6639 6880
ఫ్యాక్స్‌       : 91 22 6639 6888

1956లో పుట్టిన జియా మోడీ, ముంబాయిలోని ఎలిఫేస్టోన్‌ కాలేజీలో చదువు పూర్తిచేసింది. ఆ తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ‘లా ’లో పట్టభద్రురాలయ్యింది. అక్కడే 1979లో హార్వర్డ్‌ లా స్కూల్‌లో మాస్ట్‌ర్స్‌ డిగ్రీ కూడా పూర్తిచేసింది. అలాగే న్యూయార్క్‌ స్టేట్‌ బార్‌ పరిక్షలో కూడా ఉత్తీర్ణురాలై న్యూయార్క్‌ న్యాయ సలహాదారుగా నియమితురాలయ్యింది. అదేవిధంగా బాకర్‌ అండ్‌ మెక్‌కిన్‌జీకి కూడా 5 సంవత్సరాలు పనిచేసింది. ఆ తరువాత ఈమె భర్త సలహా ప్రకారం భారతదేశానికి తిరిగి వచ్చింది. ఇండియాకి తిరిగి వచ్చిన తర్వాత 1984లో సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించి, అతి స్వల్ప వ్యవధిలోనే మంచి గుర్తింపుని పొందింది. అదే కోవలో ఇతర ముఖ్య సంస్థలకు న్యాయ సలహాదారుగా పనిచేసింది.ఇండియా అతిపెద్ద న్యాయ సలహా సంస్థగా పేరుపొందిన ఏజెడ్‌బి అండ్‌ పార్టనర్స్‌ సంస్థకి మేనేజింగ్‌ పార్ట నర్‌గా విధులు ప్రారంభించింది. ఈ సంస్థలో సుమారుగా 40% అంతా న్యాయ శాస్తవ్రేత్తలే. 400 మంది సిబ్బంది, 225 మంది న్యాయ శాస్తక్రోవిదులతో కూడిన ఈ సంస్థ శాఖలు ముంబాయి, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నైలో కూడా ఎంతో సమర్ధవంతంగా పనిచేస్తున్నాయి. జియా మోడీ ఇండియా మ్యూచ్యుయల్‌ ఫండ్స్‌కి సంబంధించిన ‘సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్చేంజ్‌ బోర్డ్‌’ మెంబర్‌గాను, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ మెంబర్‌గాను కూడా తన సేవలనందించింది.

Zia_Mody__అకుంఠిత దీక్షతో తను చేపట్టిన వృత్తికి న్యాయం చేకూరుస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన జియామోడీని బిజినెస్‌ టుడే 2004 సెప్టెంబర్‌లో 25 శక్తి వంతమైన మహిళల్లో ఒకరుగా ఆ సర్వే జాబితాలో 2011 వరకూ ఎన్నో సార్లు పేర్కొంది. ఈమె ఆర్ధిక విషయాల్లో వేగవంతమైన పరిజ్ఞానం కలదిగా కూడా అవార్డ్‌ అందుకుంది.2004, 2006లో ది ఎకనామిక్‌ టైమ్స్‌ సర్వేలో అత్యంత శక్తి వంతమైన మహిళలు 100 మందిలో జియా మోడీ ఒకరుగా నమోదుచేసింది. ఆ సందర్భంలో 2010లో ఆ సంవత్సరం నిరుపమాన వాణిజ్య వనితగా ది ఎకనామిక్‌ టైమ్స్‌ అవార్డ్‌ని పొందింది. 2006 జనవరి 12 నుండీ జియా హాంకాంగ్‌ షంగాయ్‌ బాంకింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కి అనధికారిక కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తోంది. ఎంత బిజీ కార్యక్రమా లున్నా మోడీ సమాజ సేవని మాత్రం విస్మరించటం లేదు. బార్లి సంస్థకి ట్రస్టీగా ఉంటూ, గ్రామీణ మహిళల సమస్యల్ని పరిష్కరించే దిశగా కూడా ఇండోర్‌ తన కార్యక్రమాలు రూపొందించింది. దీనికి బహ ఐ ఫెయిత్‌ సంస్థ సహాయసహకారాలు అందిస్తోంది. ఈ కార్యక్రమాల్లో గ్రామీణ మహిళలకి విద్య నేర్పడం, దానిమీద అవగాహన కలిగించడం ప్రధానంగా తీసుకున్న అంశం.అందుకు ఎందరో గ్రామీణ మహిళల్ని ఈ కేంద్రానికి తీసుకువచ్చి, తగిన వసతులు కల్పిస్తూ వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నారు.

ఈ విధంగా విద్యాదానం చేయడం వల్ల వాళ్ళ జీవితాల్లో ఉన్నతమైన మార్పులు కలిగి సమాజంలో సమానంగా జీవించడానికి అవకాశం ఉందని జియా నమ్ముతుంది. ఆ సిద్దాంతాన్నే ఆలంబనగా చేసుకుని విజయకేతనం ఎగురవేస్తోంది. ఈ విధమైన కార్యక్రమాలు చేపట్టకపోతే వీరి పిల్లలు కూడా విద్యాహీనులై వీరిలాగే కష్టాలతో జీవితం గడపవలసి వస్తుందని జియా అంటుంది. ఇవి వారికెంతో ఊపయుక్తంగా ఉంటాయని, విద్యావంతతులు కొందరైనా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములుగా పాల్గొని ఇతర వెనుకబడిన ప్రాంతాల్లో కూడా తమ వంతు సేవలందిస్తూవుంటే, దేశంలో చాలామంది మహిళలు విద్యావంతులయ్యి దేశానికి మరింత మేలు చేకూరుతుందన్నది జియా సంపూర్ణ విశ్వాసం.ఒక న్యాయవాద వృత్తిలో ఒక మహిళ దేశవిదేశాల్లో విజయ కేతనం ఎగరేసి, తన ఆశయ సాధనకోసం దేశంలో సేవాకార్యక్రమాలు కూడా చేపట్టి అందరి ఉన్నతికోసం పాటుపడటం సామాన్య విషయం కాదు. అందరూ సంఘటితంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే దేశం చాలా తొందర్లోనే మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని జియా మోడీ ఉద్ఘాటిస్తోంది. ఎన్నో టీవీ ఇంటర్వూల్లో పాల్గొని ఈమె మనోభావాలు, కార్యాచరణలు తెలియచేసింది. నేటి తరానికి ఈమె ఎంతో ఆదర్శంగా నిలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Former paturi kranti
Malayalam actress gopikapng  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles