Interview with veteran actress geetanjali

veteran, geetanjali, actress, interview, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs, telugu babes, heroine

veteran, geetanjali, actress, interview, telugu, telugu movies, telugu songs, telugu masala songs, telugu sexy songs, telugu hot songs, telugu babes, heroine

actress Geetanjali.gif

Posted: 07/13/2012 02:04 PM IST
Interview with veteran actress geetanjali

actress_Geetanjali

geetanjaliయాభై ఏళ్లనాటి 'సీతారామ కల్యాణం'లో ముగ్ధమోహన స్నిగ్ధ సుందరిలా మెరిసిన సీత ఆమె. డాక్టర్ చక్రవర్తి, మురళీకృష్ణ వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా మెప్పించి, 'ఇల్లాలు' చిత్రంతో హీరోయిన్‌గా విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. పొట్టిప్లీడర్, శ్రీరామకథ, నిండు హృదయాలు, లోగుట్టు పెరుమాళ్లకెరుక, పంతాలు పట్టింపులు వంటి చిత్రాల్లో హీరోయిన్‌కి సమానమైన పాత్రలు పోషించారు. కథానాయిక పాత్రలకే పరిమితం కాకుండా పలు భాషల్లో, విభిన్న వేషాలతో వందలాది చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అందమైన హాస్యనటిగా, పద్మనాభం జోడీగా సుస్థిరస్థానం ఏర్పరచుకున్న నటి గీతాంజలి. తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎదురైన తీపి చేదులను కలబోసి పంచుకున్న కొన్ని జ్ఞాపకాలు మీకోసం.

మాది చాలా పెద్ద కుటుంబం. శ్యామలాంబ, శ్రీరామమూర్తిగార్లు మా తల్లిదండ్రులు. నలుగురు అక్కచెల్లెళ్ళం. ఒక తమ్ముడు. ఆ నలుగురిలో నేను రెండో దాన్ని. నా అసలు పేరు మణి. అక్క స్వర్ణలక్ష్మితో కలిసి కాకినాడ సెయింట్ జోసెఫ్ కాన్వెంటులో చదువుకునేదాన్ని. తొమ్మిదవ తరగతి వరకే చదువుకున్నాను.మమ్మల్ని

'ఆంధ్రా సిస్టర్స్'గా పిలిచేవారు

నాన్నగారికి చదువు చెప్పించడం మీద కన్నా మాకు భరతనాట్యం నేర్పించడం మీదే ఎక్కువ ఆసక్తి. మొదట లక్ష్మణరెడ్డిగారి దగ్గర, ఆ తర్వాత తంజావూరు శ్రీనివాసన్‌గారి దగ్గర నేర్చుకున్నాము. ఆయన తంజావూరు నుంచి రాజమండ్రి వచ్చి అక్కడ 'గంధర్వ నాట్యమండలి' పేరుతో నృత్య పాఠశాలను ఆరంభించారు. అక్కడ నాలుగేళ్లు నేర్చుకున్నాక నృత్య ప్రదర్శనలివ్వడం ప్రారంభించాం. మేము స్టేజి ఎక్కితే దూరాన కూచున్నవాళ్ళకు కనబడే వాళ్ళం కాదు. అంత చిన్నపిల్లలం. 'సోల్జర్స్ సైలర్స్ బోట్స్‌ మన్‌షిప్' అన్న సంస్థలో ఒకసారి మేము నాట్యప్రదర్శన ఇచ్చాం. ఆ సంస్థ చైర్మన్ ఉద్దండ రామన్‌గారు మమ్మల్ని 'ఆంధ్రా సిస్టర్స్'గా ప్రశంసించారు. అప్పట్నుంచీ ఆ పేరుతోనే 'పేరు' తెచ్చుకున్నాం. సుమారు యాభై ప్రదర్శనలు ఇచ్చి ఉంటాము.

చిత్ర అరంగేట్రం

ఓసారి మేమంతా కలిసి తిరుపతి యాత్రకు బయల్దేరాం. ఎటూ తిరుపతి వచ్చాం కదా, చెన్నై కూడా చూసిపోదామనుకున్నాం. అప్పుడే సినిమాల్లో మా అక్క చెల్లెళ్లిద్దరినీ ప్రవేశపెట్టాలని నాన్నగారికి కోరిక కలిగింది. అయితే మేము సినిమాల్లో నటించడం అమ్మగారికి ఇష్టం లేదు. "ఏదో చిన్నపిల్లలు. సరదాగా డాన్సు నేర్పించాం. కాస్తో కూస్తో చదివించాం. ఇక పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపించేయాలి'' అని నాన్నతో అనేది. కానీ నాన్నగారు చేతిలో విద్య ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవాలి అనేవారు. అప్పటికే ఫీల్డులో భానుమతి, జమున వంటివారున్నారు. అందులో తప్పేమీ లేదని వాదించేవారు. చివరకు మా నాన్న పంతమే నెగ్గింది.

సినిమాల్లో వేషాలకని 1957లో చెన్నై వచ్చి మాకు ఆప్తులైన విజయకుమార్ ('దాంపత్యం' హీరో) ఇంట్లో దిగాము. మొట్టమొదట ముఖానికి రంగు పూసుకున్నది "ఇరుమనం కలందాల్ తిరుమణం'' (1959) అనే తమిళ చిత్రానికి.

సీతతో మొదలు పెట్టా

తర్వాత బి.ఎ. సుబ్బారావుగారు 'రాణీ రత్నప్రభ' (1960) చిత్రంలో నాకు ఓ నృత్యం చేసే అవకాశమిచ్చారు. వాహినీలో ఆ చిత్రం రషెస్geetanjali_1 చూస్తున్న ఎన్.టి. రామారావు గారికి నా డాన్స్ బిట్ బాగా నచ్చిందట. వెంటనే ఆ డాన్సును మళ్ళీ రివైండ్ చేసుకుని చూసి "అమ్మాయి బాగుంది. మొహంలో అమాయకత్వం ఉంది. సీత పాత్రకు నప్పుతుంది. ఓసారి మన ఆఫీసుకు రమ్మనండి'' అన్నారట. అంతే 'సీతారామకల్యాణం' (1961)లో హీరోయిన్‌ను అయిపోయాను. నా పాత్రకు కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ ఎన్.టి.ఆర్‌గారే దగ్గరుండి చూసుకునేవారు. నా నుదుట తిలకం దిద్ది "మా సీత ఎలా ఉండాలనుకున్నానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. ప్రప్రథమంగా సీతమ్మవారి పాత్ర ధరిస్తున్నావు. ఇక నీ జీవితంలో ఎటువంటి లోటూ ఉండదు'' అని మనసారా ఆశీర్వదించారు. ఆయన మాట వృధా కాలేదు. ఇప్పటికీ ఆంధ్రదేశంలో శ్రీరామనవమి పండుగ రోజున ఆ సినిమాలోని 'శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ!' పాట తప్పకుండా వినబడాల్సిందే.

సూర్యకాంతం నా స్వీట్ మమ్మీ

మా అమ్మగారు చాలా చక్కగా వంట చేసేవారు. సెట్లో ఉన్నప్పుడు మా అమ్మగారు గానీ, నాన్నగారు గానీ కారియర్ తీసుకొస్తే అందరం కలిసి భోంచేసేవాళ్ళం. ముఖ్యంగా ఎన్.టి. రామారావు గారికి మా అమ్మగారి చేతి వంటంటే మహా ఇష్టం. మా 'సీత' ఇంటి నుంచి కారియర్ వచ్చిందంటే అందులో ఏదో స్పెషల్ ఉండే ఉంటుంది అనేవారు. కోడికూర, చేపలకూర మా అమ్మగారు చేశారంటే ఆయన వదిలేవారు కాదు. అదే విధంగా సూర్యకాంతం గారు కూడా షూటింగుకు రకరకాల వంటలు చేసి తెచ్చేవారు. ఆమెకు నేను చాలా సినిమాల్లో కూతురుగా నటించాను. ఆవిడంత స్వీట్ మమ్మీ మరొకరుండరు. ఆమెది పసిమనసు. ఆమె లాంటి గొప్పనటి మరొకరు పుట్టనే పుట్టరు.మణి నుంచి

గీతాంజలిగా...

1963-64 నా జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. బాబూభాయి మిస్త్రీగారి హిందీ చిత్రం 'పారస్ మణి' (1963)లో మహిపాల్ సరసన నాయికగా నటించాను. ఆ సమయంలోనే మిస్త్రీగారు "నీ పేరు 'మణి'... ఏం బాగోలేదు. అంచేత 'గీతాంజలి' అని నీకు పునః నామకరణం చేస్తున్నాను'' అని పేరు మార్చేశారు. ఆ తరువాత అదే పేరు తెలుగులోనూ స్థిరపడిపోయింది. అప్పుడు వరసగా 'సంగ్రాం' (1965), 'షంషీర్' (1967), 'బలరాం శ్రీకృష్ణ' (1968), 'దో కలియా' (1968), 'శంకర్ పార్వతి' (1970) చేశాను. 'దో కలియా' ఎ.వి.ఎం వారి 'లేతమనసులు'కు రీమేక్.

ఆడిన మాట తప్పని జమునక్కయ్య

geetanjali_2నాకు తెలుగులో మంచి పేరు తెచ్చిన చిత్రం 'మురళీకృష్ణ' (1964). అందులో పిచ్చిదానిగా నటించాను. వాస్తవికతకు దగ్గరగా ఉందని అప్పటి సినీ విమర్శకులు ప్రశంసించారు కూడా. కానీ ఆ ఘనత అంతా పి.పిల్లయ్యగారిదే. ఈ చిత్రంలోనే జమునగారు నాకు మోరల్ సపోర్టు ఇచ్చే కథానాయికగా నటించారు. ఇక్కడ జమునక్కయ్య గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలి. నేనీరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఆమే. ఒకానొక సమయంలో చెన్నయ్‌లో జమునగారు తన స్థలాన్ని అమ్మేయాలనుకున్నారు.ఈ విషయం తెలిసిన నా భర్త రామకృష్ణగారు వెళ్ళి దాన్ని మాకిమ్మని అక్కయ్యను అడిగారు. ఆమె సంతోషంగా 'తీసుకో! రామకృష్ణా' అన్నారు. మేము అప్పటికి అడ్వాన్స్ కూడా ఇవ్వలేదావిడకు. జమునగారు స్థలాన్ని అమ్ముతున్నారని తెలిసి ఆ తర్వాత ఎంతోమంది అగ్రనటులు ఆ స్థలం కోసం ఎగబడ్డారు. మా ధర కంటే రెట్టింపు ధర పలికారు. కానీ అక్కయ్య ఇచ్చిన మాట ప్రకారం మాకే ఇచ్చారు. అందుకే రామకృష్ణగారు "గీతా! మనం ఇప్పుడు ప్రశాంతంగా అన్నం తింటున్నామంటే జమునగారి చలవే'' అని ఎంతో కృతజ్ఞతగా చెప్పేవారు.

ఏదిఏమైనా నా జీవితంలో అదృష్టం ఎన్.టి. రామారావుగారి రూపంలో వస్తే, ఐశ్వర్యం జమునగారి రూపంలో వచ్చింది. అంచేత వారిని నేను నిత్యమూ స్మరించుకోకపోతే నేను జీవచ్ఛవంతో సమానం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Interview with indian american astronaut sunita williams
Interview with vimalakka  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles