రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి, విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజీనామాను గవర్నర్ నరసింహం ఆమోదించడంతో వారం రోజుల ఉత్కంఠకు తెరపడింది. వాన్‌పిక్‌కు భూముల కేటాయింపులో ధర్మానను సిబిఐ నిందితునిగా పేర్కొంది. దీంతో, ఆయన రెండు దఫాలు రాజీనామా చేశారు. తొలుత చేసిన రాజీనామా హైడ్రామాగా మారింది. రాజీనామా చేసిన మొదట్లో కొన్ని నెలలపాటు మంత్రి విధులకు దూరంగా ఉన్నారు.
ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు పాల్గొనడం తప్ప, మిగిలిన సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వామ్యం కాలేదు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా నిర్వహించాల్సిన విధులు మాత్రం నిర్వహించలేదు. అవినీతి ఆరోపణలున్న మంత్రుల ప్రాసిక్యూషన్‌ను రాష్ట్ర మంత్రివర్గం తిరస్కరించడంతో విధులను ధర్మాన యథావిధిగా హాజరయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇన్‌ఛార్జి మంతిగా జిల్లాపై మాత్రం దృష్టి సారించలేదు. కళంకిత మంత్రులపట్ల కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ పార్టీ అధినేతలు నిర్ణయం తీసుకోవడంతో అనివార్య పరిస్థితుల్లో ధర్మాన మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చింది.
రాజీనామా ఆమోదంలో వారం రోజులపాటు తర్జనభర్జనలు జరిగాయి. కళంకిత మంత్రులపట్ల కఠినంగా వ్యహరించకపోతే పార్టీ ప్రతిష్ట, పరువు పోతుందనే భయంతో రాజీనామా ఆమోదానికే అధిష్టానం మొగ్గుచూపింది. ఈ నేపథ్యంలో ధర్మాన రాజీనామాను రాష్ట్ర గవర్నర్ ఆమోదించడంతో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వేరొకరని నియమించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులుగా కన్నా లక్ష్మీనారాయణ, వట్టి వంసతకుమార్ కొంతకాలంపాటు వ్యవహరించారు. వారి పనితీరుపై సంతృప్తి లేకపోవడం, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా కొనసాగడానికి వారు అయిష్టత చూపకపోవడంతో ధర్మానను గతేడాది ఆగస్టులో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ప్రభుత్వం నియమించింది.
ఆ తర్వాత వారం రోజుల్లోనే జగన్ అక్రమ ఆస్తుల కేసు, వాన్‌పిక్‌కు భూముల కేటాయింపు కేసులో నిందితునిగా ధర్మానను సిబిఐ పేర్కొంది. అప్పటినుంచీ జిల్లా అభివృద్ధిపైగానీ, అధికార కార్యక్రమాల్లోగానీ, నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగంలోగానీ ఆయన పెద్దగా దృష్టి సారించలేదు. ఎమ్మెల్యే కోటా కింద ఖర్చు చేయాల్సిన 50 శాతం నిధులతోపాటు, ఇన్‌ఛార్జి మంత్రి కోటా కింద ఖర్చుచేయాల్సిన 50 శాతం ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more