Ysr park development in vizag

ysr-vuda central park, old central jail premises, vizag development plan, visakhapatnam, landmark of vizag

ysr park development in vizag

వైఎస్‌ఆర్‌ పార్కు పై ద్రుష్టి?

Posted: 05/27/2013 07:02 PM IST
Ysr park development in vizag

నగరం నడిబొడ్డున ఉన్న వైఎస్‌ఆర్‌ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు వుడా ప్రణాళిక సిద్ధం చేసింది. పాత జైలు స్థలం 30 ఎకరాలుకాగా రోడ్లకోసం ఐదెకరాలు పోయింది. ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలకు 3 ఎకరాలు ఇచ్చారు. మిగతా 22 ఎకరాల్లో పార్కును సిద్ధం చేస్తున్నారు. పార్కు చుట్టూ సర్వీసు రోడ్డును ఇప్పటికే అభివృద్ధి చేశారు. పార్కులోపల నాలుగు మూలలా వాహనాల పార్కింగ్‌ కోసం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అయితే లోపల పార్కింగ్‌లో 200 వరకూ కార్లు మాత్రమే పట్టే అవకాశముంది. దీంతో సర్వీసు రోడ్డును కూడా పార్కింగ్‌ కోసం ఉపయోగించొచ్చని వుడా భావిస్తోంది. పార్కులో పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.

 

కైలాసగిరి జాగింగ్‌ ట్రాక్‌ సిద్ధమైందని, దీన్ని త్వరలోనే ప్రారంభించనున్నామని వుడా వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.యువరాజ్‌ చెప్పారు. హరిత ప్రాజెక్టుకు సంబంధించి పది ప్యాకేజీలకుగానూ మూడు ప్యాకేజీలకు టెండర్లు ఖరారుచేశారు. మిగతా ఏడు ప్యాకేజీలకు సింగిల్‌ టెండర్లు రావడంతో తిరిగి టెండర్లు పిలిచినట్టు విసి చెప్పారు. ఏడు ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలుచేయడానికి ఈ నెల 27 చివరితేదీ. టెండర్లు ఖరారుకాగానే పనులు వెంటనే ప్రారంభిస్తామని తెలిపారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more