ఇంటికో ఇంజినీర్ ఉన్న రోజులివి... డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా వివిధ రంగాల వైపు చూస్తున్న ప్రస్తుత తరుణంలో వ్యవసాయం, పాడి పరిశ్రమపై కూడా కొందరు యువకులు మొగ్గుచూపు తుండడం విశేషం. తనను నమ్ముకున్న వారిని గోమాత కరుణించి అక్కున చేర్చుకుంటోంది. నిత్యం గోసేవలో తరిస్తున్న ఈ యువ రైతులు మంచి ఆదాయంతో లాభాల బాట పడుతున్నారు. పెందుర్తి మండలం రాంపురానికి చెందిన రెడ్డి అర్జునరావు గత ఏడాది జిల్లా ఉత్తమ పాడి రైతుగా ఎంపిక కావడం ఈ రంగానికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. మండలంలో ప్రస్తుతం 5 మినీ, ఒక మధ్యతరహా డెయిరీలున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 1500 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. మినీ డెయిరీల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సబ్సిడీ ద్వారా పశువులను అందిస్తామంటున్నారు పశు సంవర్థక శాఖ అధికారులు. రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకంలో రెండు పశువుల యూనిట్‌కు రూ.70 వేలు, మినీ డెయిరీలకు (5 నుంచి పది పశువులు) రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకూ, మధ్యతరహా డెయిరీ (20 పశువులు)కి రూ.2.5 లక్షల సబ్సిడీ అందిస్తున్నారు. వీటితో పాటు గొర్రెలు, మేకల పెంపకానికి కూడా 25 శాతం, పశువుల మేతకు అవసరమయ్యే గడ్డి పెంపకానికి యూనిట్‌కు రూ.60 శాతం వరకూ, పాలు పితికే యంత్రా (మిల్కింగ్ మెషీన్)నికి దాదాపు 50 శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more