మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలిరెడ్డి సత్యారావు త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకొనే అవకాశం ఉంది. పార్టీ సమన్వయకర్తల నియామకం కోసం వైకాపా స్థానిక నేతల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలిరెడ్డికి పార్టీ తీర్థం ఇప్పించేందుకు ఆ పార్టీనేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వారం రోజుల వ్యవధిలో బలిరెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు ఆయన వర్గీయులు అంటున్నారు. వాస్తవానికి వచ్చే నెల ఉగాది తర్వాత మంచి ముహూర్తం నిర్ణయించి జిల్లాకేంద్రంలోగాని, చోడవరంలోగాని బహిరంగ సభ ఏర్పాటుచేసి, తన వర్గీయులతో ఆ పార్టీ రాష్ట్ర నేతల సమక్షంలో వైకాపాలో చేరాలని భావించారు. అయితే బలిరెడ్డి సత్యారావుతో మంత్రి గంటా మాట్లాడారని, ఆయన పార్టీ మారే అవకాశం లేదని, కాంగ్రెస్‌లోనే ఉంటారని కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైకాపా అధిష్ఠానం, చోడవరం నియోజకవర్గాన్ని పెండింగ్‌లో ఉంచింది. బలిరెడ్డి కోసమే ప్రకటన వాయిదా పడినట్టు ప్రచారం జరుగుతున్నా, ఇదే సమయంలో తమనే సమన్వయకర్తలుగా నియమించాలంటూ పార్టీలో నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి పెంచడంతో ఈ సమస్యను వెంటనే పరిష్కారించాలనే నిర్ణయానికి వైకాపా నేతలు అంటున్నారు. బలిరెడ్డి చేరేవరకూ సమన్వయకర్తల నియామకం పెండింగ్‌లో పెడితే, గ్రూపులు పెరిగి వివాదాలు రేగే అవకాశం ఉన్నందున ఆయన చేరిక తంతును వెంటనే ముగించాలన్న భావనకు పార్టీ అధినేతలు వచ్చినట్టు తెలుస్తున్నది. బలిరెడ్డికి సమన్వయకర్తగా ప్రకటిస్తే తమ సంగతి ఏమిటంటూ ఇప్పటికే కొందరు నేతలు అధిష్ఠానం ఎదుట నిరసనను తెలిపినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బలిరెడ్డి వైకాపా ప్రవేశం ముందుకు వచ్చిందని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more