వేసవి ప్రారంభమవుతూనే మన్యంలోకి వ్యాధులను తీసుకొచ్చింది. మలేరియాకన్నా ముందు డయారియాను వెంటబెట్టుకు వచ్చింది. వారం రోజులుగా మన్యంలో చాపకింద నీరులా ఈ మహమ్మారి వ్యాపిస్తోంది. నాలుగు మండలాల్లో సుమారు పది గ్రామాల్లో ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి విరుచుకు పడడంతో మండలంలో మారుమూల ప్రాంతమైన అల్లంపుట్టు విలవిలలాడుతోంది. బుధవారం ఒక్కరోజే ముగ్గురు గిరిజనులు వాంతులు, విరేచనాలతో బాధపడుతూ చనిపోవడంతో గ్రామమంతటా విషాదం అలుముకుంది. గ్రామస్తులు తాగుతున్న కలుషిత జలమే కాలకూట విషమై కాటేసింది. పంట పొలాల మధ్యననున్న ఊట వద్ద సేకరించిన కలుషిత జలాల కారణంగా ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
అన్నెంపున్నెం ఎరుగని ఏడేళ్ల చిన్నారి విజయశాంతితోపాటు కొర్రా చిన్నమ్మ(45) అనే మహిళ, బడ్నాయిని బుచ్చన్న(40)లను డయేరియా కబళించింది. 130 మంది ఉన్న ఈ కుగ్రామంలో ఇప్పుడు అనారోగ్యం స్వైర విహారం చేస్తోంది. సకాలంలో వైద్య సాయం అందక ముగ్గురిని కబళించడంతోపాటు మరెందరినో పట్టి పీడిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more