Police strict vigil on harassment on ladies

delhi gang rape, police strict vigil, harassment on ladies, eve teasing, college girls raging, ladies problems in buses, ladies in public places, gang raps, delhi gang rape, on harassment on ladies

police strict vigil on harassment on ladies

9.gif

Posted: 01/12/2013 12:32 PM IST
Police strict vigil on harassment on ladies

aaa

        ఇక... ఆడవాళ్లపై కన్నెత్తి చూడాలన్నా భయపడాల్సిందే! 'చీకటి మాటున చేశా. నన్ను ఎవరు పట్టుకుంటారులే' అనే భ్రమల్లోంచి నేరగాళ్లు బయటికి రావాల్సిందే! లైంగిక వేధింపులు, అత్యాచార కేసుల్లో నిందితులు తప్పించుకోకుండా 'ఆధారాల ఉచ్చు' బిగిస్తున్నారు. రేప్ చేసిన వాడెవడైనా సరే... జైలుకు వెళ్లేలా 35 అంశాలతో కూడిన ఓ జాబితా రూపొందించి దానిని పోలీసు స్టేషన్లకు పంపించనున్నారు. గత కొన్నేళ్లుగా మహిళలపై అత్యాచారాల సంఖ్య పెరుగుతున్నా... శిక్షల శాతం బాగా తగ్గుతోంది. నేరాల రుజువు మన రాష్ట్రంలో జాతీయ సగటుకన్నా 14 శాతం తక్కువగా ఉంది. దర్యాప్తులో లోపాలవల్లే శిక్షలు సరిగా పడటంలేదని అధికారుల పరిశీలనలో తేలింది.
       ‘ఉద్దేశపూర్వకంగాకానీ, పొరపాటునకానీ ఏ అంశాన్నీ వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఫలితంగా ప్రాసిక్యూషన్‌కు బలం చేకూరి బాధితురాలికి న్యాయం జరుగుతుంది. నేరం చేసిన వారికి శిక్ష పడుతుంది.  రేప్ కేసుల్లో శిక్షల శాతం పెరిగేలా జాగ్రత్తలు తీసుకున్నాం. మార్చి 31లోపు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకూ కంప్యూటర్లు అందిస్తాం. 31లోపు 98 శాతం ఠాణాలను సీసీటీఎన్ఎస్‌కు అనుసంధానిస్తాం. ఎక్కడ నేరం జరిగినా కంప్యూటర్ నుంచి సదరు ప్రొఫార్మా ప్రింట్ తీసుకొని నేరస్థలానికి వెళితే... కానిస్టేబుల్ కూడా సమగ్రంగా వివరాలను సేకరించే అవకాశం ఉంటుంది’ అని పోలీసు శాఖ టెక్నికల్ సర్వీసెస్ ఐజీ అంజనీ కుమార్ తెలిపారు.
         ప్రస్తుతానికి మహిళలకు సంబంధించిన అన్ని కేసుల్లోనూ (అత్యాచారం, గృహహింస, ఆత్మహత్య, దాడి) ప్రొఫార్మా సిద్ధం చేశామని, త్వరలోనే ఇతర నేరాలపైనా ఇలాంటి జాబితా సిద్ధం చేస్తామని వివరించారు. ఈ ప్రొఫార్మాలోని అంశాలను పూరిస్తే కేసు 90శాతం నిలబడుతుందన్నారు. దేశంలో మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ విధానం అమలులోకి వస్తోందని ఆయన చెప్పారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Visaka airport records in passenger traffic
Festivals and events in araku valley  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Workers strike at visakhapatnam port

    ఏజెన్సీలో చలి పులి- విశాఖ పోర్టులో మోగిన సమ్మె సైరన్

    Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more

  • Minister balaraju fire on t bill

    టి-బిల్లును-దిగ్విజయ్ ను అడ్డుకుంటాం :మంత్రి బాలరాజు

    Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more

  • Student jac egg attacks on purandeswari

    కోడిగుడ్ల దాడి- బాధాకరం- పురంధేశ్వరి

    Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more

  • Lehar cyclone effect to coastal ap

    విశాఖ తీరం వద్ద లెహర్ తీరం దాటే అవకాశం

    Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more

  • Kishore chandra deo wants vizag to be seemandhra capital

    ఆంధ్ర రాజదాని పై కిషోర్ చంద్రదేవ్ పోరాటం

    Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more