రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ రెండుమూడు రోజుల్లో పూర్తికానుంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ సోమవారంనాటికి పూర్తయింది. కోసాంధ్ర, రాయలసీమల నుంచి రెండుమూడు రోజుల్లో వెళ్లిపోతాయని వాతావరణశాఖ అంచనావేస్తోంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 నైరుతి రుతుపవనాల సీజన్. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలోకి మూడు రోజులు ఆలస్యంగా మే 23న, కేరళలోకి అయిదు రోజులు ఆలస్యంగా జూన్ 5న ప్రవేశించాయి. అయితే నాలుగు రోజులు ముందుగా జూలై 11నాటికి దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించాయి. ఉపసంహరణ ఆలస్యంగా ప్రారంభమైంది. పశ్చిమ రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ 1న ఉపసంహరణ ప్రారంభంకావాల్సి ఉండగా మూడు వారాల ఆలస్యంగా సెప్టెంబర్ 24న ఉపసంహరణ ప్రారంభమైంది. అయితే రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం నుంచి నిర్ధిష్ట సమయానికే అక్టోబర్ 15నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ పూర్తయింది.
కాగా, నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశవ్యాపితంగా 92శాతం వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. వాయువ్య ప్రాంతంలో 93, మధ్య భారతంలో 96, దక్షిణ ప్రాంతంలో 90, ఈశాన్య ప్రాంతంలో 89శాతం వర్షపాతం నమోదైంది. ఏడాది వర్షపాతంలో 70శాతం వర్షాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు దేశ ప్రజల జీవన తరంగాలు. నైరుతి సఫలత దేశ ఆర్థిక రంగానికి అత్యంత కీలకం. ఖరీఫ్ సాగుకి నైరుతి వర్షాలే ఆధారం. నైరుతి సఫలమైతేనే జలాశయాలు కళకళలాడతాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు వెలుగులు నింపుతాయి. దేశవ్యాపితంగా జూన్‌లో 72, జూలైలో 87, ఆగస్టులో 101, సెప్టెంబర్‌లో 111 శాతం వర్షపాతం రికార్డయింది. నైరుతి సీజన్ ముగిసిన తరువాత అక్టోబర్‌లో కూడా రాష్ట్రంలో మంచి వర్షాలు నమోదయ్యాయి. సెప్టెంబర్ చివరివారంలో ఏర్పడిన అల్పపీడనం నాలుగు రోజులపాటు కొనసాగడంతో అక్టోబర్‌లో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిశాయి.
రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది నైరుతి ప్రత్యేకం. జూన్ 8న రాష్ట్రాన్ని తాకిన రుతుపవనాలు 17నాటికి రాష్ట్రమంతటికీ విస్తరించినా జూన్, జూలైతోపాటు ఆగస్టు మూడో వారం వరకూ పెద్దగా వర్షాల్లేవు. దీంతో అనేక జిల్లాల్లో వర్షాభావం తీవ్రంగా కనిపించింది. ఆగస్టు మూడోవారం తరువాత పరిస్థితిలో మార్పు వచ్చి సెప్టెంబర్ వరకూ వర్షాలు కురవడంతో రాష్ట్రంలో వర్షపాతం సాధారణ స్థాయికి చేరింది. నైరుతి సీజన్‌లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 624 మిల్లీమీటర్లుకాగా 631 మిల్లీమీటర్లు నమోదైంది. అంటే సాధారణంకంటే స్వల్పంగా ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో 40శాతం అత్యధిక వర్షపాతం కురిసింది. కడప జిల్లాలో 26శాతం లోటు వర్షపాతం రికార్డయింది.
నైరుతి రుతుపవనాల సీజన్‌లో పది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అయితే ఇవేవీ బలపడి వాయుగుండాలుగా మారకపోవడం చెప్పుకోదగ్గది. సాధారణంగా నైరుతి సీజన్‌లో నాలుగు నుంచి ఆరు వాయుగుండాలు ఏర్పడతాయి. ఈ ఏడాది ఒక్క అల్పపీడనం కూడా బలపడి వాయుగుండంగా మారలేదు. ఈ నైరుతిలో ఏర్పడిన పది అల్పపీడనాల్లో.. జూలైలో మూడు, ఆగస్టులో ఐదు, సెప్టెంబర్‌లో రెండు ఏర్పడ్డాయి. జూన్‌లో ఒక్క అల్పపీడనం ఏర్పడలేదు. 1981 నుంచి 2012 మధ్య కాలంలో జూన్‌లో ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడని సంవత్సరం ఇదేనని భారత వాతావరణశాఖ పేర్కొంది. నైరుతిలో ఏర్పడిన అల్పపీడనాలన్నీ బంగాళాఖాతంలోనే ఏర్పడ్డాయి. అరేబియా సముద్రంలో ఒక్క అల్పపీడనం కూడా ఏర్పడలేదు.
మొత్తంగా ఈ ఏడాది రాష్ట్రంతోపాటు దేశవ్యాపితంగా నైరుతి వల్ల సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది నైరుతి, ఈశాన్య రుతుపవనాలు రెండూ విఫలమయ్యాయని ఆంధ్రా యూనివర్సిటీ ఓషనోగ్రఫీ విభాగం గౌరవ ఆచార్యులు ఓఎస్‌ఆర్‌యు భానుకుమార్ ప్రజాశక్తికి చెప్పారు. ఈ ఏడాది నైరుతి ఉపసంహరణ ఆలస్యంగా ప్రారంభంకావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు. నైరుతికి సంబంధించి భారత వాతావరణశాఖ అంచనాలు కూడా దాదాపుగా కరెక్టయ్యాయి. ఇవీ ఈ సీజన్ వాతావరణ విశేషాలు.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్‌లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more