కాంగ్రెస్‌లో తన పార్టీ నిమజ్జనానికి నజరానాగా చిరంజీవికి సమర్పించేందుకే భవానీ ద్వీపం ప్రైవేటీకరణకు చకచకా ఏర్పాట్లు చేసినట్లు రుజువైంది. ఈ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఇరిగేషన్ శాఖ సిద్ధమైంది. నదీ పరిరక్షణ చట్టానికి తాము ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదని, లీజుకు సంబంధించిన సమాచారమే అందలేదని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. భవానీద్వీపం ప్రయివేటీకరణపై ఇరిగేషన్ శాఖ అడ్డం తిరిగింది. 1886 నదీపరిరక్షణ చట్టానికి తాము ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ శాఖ మంత్రి సుదర్శనరెడ్డి స్వయంగా ప్రకటన చేయడంతో భవానీద్వీపం ప్రయివేటీకరణ అంశం మలుపుతిరిగింది. ఈ ద్వీపాన్ని పర్యాటకశాఖకు బదిలీ చేసే సమయంలో ఇరిగేషన్‌శాఖ విధించిన నిబంధనలను పాటించాల్సి ఉంది. కొన్ని నిబంధనల్ని సడలించాలని పర్యాటక శాఖ ఆ తరువాత కోరినా తాము మార్చలేదని ఇరిగేషన్‌శాఖ స్పష్టం చేస్తోంది.మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష అసోసియేట్స్‌కు భవానీ ద్వీపాన్ని తాము లీజుకు ఇవ్వలేదని, దానికి సంబంధించిన సమాచారం కూడా తమవద్ద లేదని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ ఎస్.ఇ. ఆ శాఖ మంత్రి సుదర్శనరెడ్డికి నివేదిక పంపారు. నదీ పరీవాహక చట్టానికి ఎటువంటి మినహాయింపులూ ఇవ్వలేదని, భవిష్యత్‌లో ఆ చట్టాన్ని పరిరక్షిస్తామని ఆ నివేదికలో పేర్కొన్నారు. రెవెన్యూ శాఖకు ఇరిగేషన్ అధికారులు భవానీ ద్వీపాన్ని బదలాయించే సమయంలో నదీపరిరక్షణ చట్టానికి అనుగుణంగా కొన్ని నిబంధనలను పొందుపరిచారు. దీనికి అనుగుణంగానే అందులో కార్యక్రమాలు జరగాలని పేర్కొన్నారు. ఇందులో రెండు నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని మార్చాలని స్వయంగా ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్) వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి 2009, 2010, 2011ల్లో ఇరిగేషన్ అధికారులకు లేఖలు రాశారు. నదీపరిరక్షణ చట్టాన్ని మార్చే అధికారం లేకపోవడంతో ఈ లేఖలకు ఇరిగేషన్ శాఖ స్పందించలేదు. దీంతో అధికారులు 2002 మార్చిలో 138 జీవో ఒకటి ఈ నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిందని, అది ఇప్పుడే కనిపించిందని (ట్రేస్డ్) పేర్కొంటూ భవానీ ద్వీపాన్ని ప్రయివేటుపరం చేసేందుకు పావులు కదిపారు.
అసలు నదీపరిరక్షణ చట్టంలో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ జీవో జారీచేయడం ఏమిటని ఇరిగేషన్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని మార్చాలంటే శాసనసభలో సవరణ చేయాలని, లేనిపక్షంలో ఆర్డినెన్స్ తీసుకురావాలేతప్ప జీవోలతో చట్టాలు మార్చటం వీలు కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. నదుల పరిరక్షణకు సంబంధించి 1886లో బ్రిటిష్ హయాంలో ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ఆధారంగానే అమరావతి - పోపూరు ర్యాంపునకు అనుమతి రద్దుచేస్తూ కలెక్టర్ రిజ్వీ తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు సైతం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ చట్టానికి భిన్నంగా భవానీ ద్వీపాన్ని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడం ఎంతవరకు సమంజసమన్నది ఇక్కడ ప్రశ్న. ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుడు సాయికృష్ణ ఆజాద్ లోకాయుక్తలో కేసు వేశారు. పర్యాటకశాఖ ఉద్యోగులు కూడా ఈ నెల 14న వెలువడనున్న లోకాయుక్త తీర్పును పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.
(And get your daily news straight to your inbox)
Dec 17 | విశాఖ ఏజెన్సీలో పడిపోయిన కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉన్నాయి. సోమవారం కూడా లంబసింగిలో 2, చింతపల్లిలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. లంబసింగి, జీకే వీధి, చింతపల్లి ప్రజలు 24... Read more
Dec 14 | అసెంబ్లీకి తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే అడ్డుకుంటామని మంత్రి బాలరాజు స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం జిల్లాలోని చైతన్య స్కూల్లో నిర్వహించిన నల్లసూరీడు నెల్సన్ మండేలా సంతాప సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా... Read more
Dec 07 | రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం అనుసరించిన తీరుపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాసినట్లు కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు ఆమె మాట్లాడారు. విభజన తప్పదని తెలిసిన తర్వాత సీమాంధ్ర... Read more
Nov 25 | అండమాన్‌లో తుఫాన్ ఏర్పడిన నేపథ్యంలో కోస్తాలోని అన్ని ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్టు విశాఖ తుపాను హెచ్చరిక కేంద్రంఅధికారి ఒకరు తెలిపారు. అన్ని పోర్టుల్లోనూ రెండో ప్రమాద హెచ్చరికలు జారీ... Read more
Nov 18 | రాష్ట్ర విభజనకు సంబంధి రాష్ట్రానికి కేంద్రమంత్రులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు ముందు నుంచి మద్దతు పలుకుతున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగ చేయాలని కేంద్ర మంత్రుల బృందానికి... Read more