Girl gang raped at vijayawada railway station

girl gang-raped at Vijayawada railway station, Woman gang-raped, gang raped in railway

girl gang-raped at Vijayawada railway station

బెజవాడ రైలులో గ్యాంగ్‌రేప్‌

Posted: 11/06/2013 02:46 PM IST
Girl gang raped at vijayawada railway station

విజయవాడలో ఒక వివాహిత యువతిపై ముగ్గురు అగంతకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న బోగీల క్లీనింగ్‌ యార్డులో ఈరోజు వేకువజామున ఈ సంఘటన జరిగింది. రైలు బోగీలోనే నిందితులు యువతిని బెదరించి అత్యాచారానికి తెగబడ్డారు.

 

విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లాల్సిన రైలులో 27సంవత్సరాల యువతి ఎక్కింది. అయితే ఆ రైలు క్లీనింగ్‌ యార్డుకు వెళ్తుందన్న విషయాన్ని యువతి గ్రహించకపోవడం తో కామాంధుల పాలిట పడింది. మొత్తం నలుగురు నిందితులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని, మరొకడు బోగీ వెలుపల కాపలాగా ఉన్నాడని సంఘటన అనంతరం బాధితురాలు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 

ఈ కేసుని రైల్వే ఎస్పీ డాక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ స్వయంగా ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. రైల్వే పోలీసు విభాగంలో మహిళా సీఐ స్థాయి అధికారి లేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి నుంచి అనుమతి తీసుకుని నగర పోలీసు కమిషనర్‌ బి శ్రీనివాసులుతో రైల్వే ఎస్పీ మాట్లాడాక ఈ కేసు దర్యాప్తును విజయవాడ నగర పోలీసులకు అప్పగించామని ఎస్పీ డాక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌ కెఎన్‌ఎన్‌ ప్రతినిధికి తెలిపారు.

 

విజయవాడ నగర పోలీసులు నిర్భయ చట్టం కింద నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిసింది.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more