Perni nani resigns from mla post

machilipatnam mla perni nani, mla perni nani, perni nani resigns from mla post, congress party, ysrcp,

perni nani resigns from mla post

perni-nani.gif

Posted: 03/08/2013 06:59 PM IST
Perni nani resigns from mla post

perni nani resigns from mla post

ప్రభుత్వ విప్ పదవి నుంచి పేర్ని వెంకట్రామయ్య (నాని)ను తొలగిస్తూ ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే పేర్నినాని జనవరి 24న హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డితో ములాఖత్ అయిన విషయం తెలిసిందే. ములాఖత్ అనంతరం కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు అదే రోజు పేర్ని ప్రకటించారు. దానిపై ఎట్టకేలకు నెలా 15 రోజులకు ప్రభుత్వం స్పందించింది. జనవరి 30 నుం చి అమల్లోకి వచ్చే విధంగా విప్ పదవిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా ప్రకటన అనంతరం పేర్ని ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. వైసీపీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. గత నెలలో హైదరాబాద్‌లో వైఎస్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరై వచ్చారు. సహకార ఎన్నికల్లో ఆ పార్టీ ని భుజాన వేసుకుని 11 సొసైటీలను కైవసం చేసుకున్నారు.  2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచిన పేర్ని తొలుత మంత్రి పదవిని ఆశించారు. చివరకు కిరణ్‌కుమార్ రెడ్డి సర్కార్‌లో విప్ పదవి లభించింది. అయిష్టంగానే ఆ పదవిని అందుకున్న నాని ఏడాది తిరగకుండానే రాజీనామా చేశారు. 2014 వరకు కాంగ్రెస్ ‌లో కొనసాగుతానని చెప్పిన పేర్ని వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయానికి తట్టుకోలేక వచ్చేశానని వివరణ కూడా ఇచ్చారు. అధికారికంగా వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. షర్మిల పాదయాత్ర జిల్లా కొచ్చే సందర్భంలో భారీ ఎత్తున జన సమీకరణతో ఆ పార్టీలో చేరేందుకు కసరత్తు జరుగుతోంది. ఇక చేసే ది లేక విప్ పదవికి ఆయన చేసిన రాజీనామాను ఆమోదించాల్సి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandrababu speech at gudivada
Ysrcp comments on chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Vangaveeti radha get emotional at vijayawada

    ఘనంగా వంగవీటి రంగ వర్థంతి

    Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more

  • Who is the samaikyandhra hero

    వీరిలో సమైక్య హీరో ఎవరు ?

    Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more

  • Vijayawada municipality fails to pay employees their salaries

    ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ-వేతనాలివ్వండి మహాప్రభో.

    Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more

  • Cm kiran fire on congress high command

    ఒక్కసారి చదువుకోండి:సిఎం కిరణ్

    Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more

  • Ashok babu fire on seemandhra leaders

    చేతకానితనం వల్లే ఇలా జరిగింది?

    Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్‌జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్‌జీవోల భవన్‌లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more