ఆరోగ్య పరిరక్షణ, వ్యాధుల నిర్మూలన తదితర వైద్య సంబంధ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ జి.సమరం సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ వాసవ్య నర్సింగ్ హోంలో పెర్మనెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. రేపటి నుంచి ఈ ఆరోగ్య ప్రదర్శన ప్రారంభం కానుంది. మూఢ నమ్మకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు విశేష కృషిచేసిన డాక్టర్ జి.సమరం, ఆరోగ్యసమాజం ఏర్పడడానికి విశేష కృషి సల్పారు.
యువత ఆరాధ్య వైద్యునిలా పేరొందిన ఈ ధన్వంతరి వారసులు ఇప్పుడు మరో మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు ఆరోగ్యంపట్ల అవగాహన పెంపొందించడానికి విజయవాడలో శాశ్వత ప్రాతిపదికన మెడికల్ అండ్ హెల్త్ ఎగ్జిబషన్ను ఏర్పాటు చేస్తున్నారు. వ్యాధులు ఎందుకు వస్తాయి, వ్యాధులు రాకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను కళ్లకు కట్టినట్టు, సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నామని డాక్టర్ సమరం తెలిపారు.
ఆరోగ్యం, అలవాట్లు గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తే వ్యాధుల వ్యాప్తిని అరికట్టవచ్చని, ఆరోగ్యకర సమాజం నిర్మించ వచ్చని ఆయన చెప్పారు. శాస్త్రీయ విజ్ఞానంతోపాటు, శాస్త్రీయ దృక్పదాన్ని పెంపొందించి గుడ్ హెల్త్ సొసైటీ నిర్మాణానికి కృషి చేస్తామని డాక్టర్ సమరం వివరించారు. ఈ ఎగ్జిబిషన్లో 300 మంది ప్రముఖ శాస్త్రవేత్తల చిత్రపటాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యకర జీవితానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రజలందరూ ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించి, ఆరోగ్యకర జీవితానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలని డాక్టర్ సమరం కోరారు.
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్‌లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్‌కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్‌బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more