Scam found in sale of darshan tickets in ttd

Special Darshan Ticket Scam in TTD, Scam Found in Sale of Darshan Tickets in TTD, Three arrested in Tirumala darshan tickets fraud, Darshan at Sri Venkateswara Temple, Tirumala Tirupati Devasthanam (TTD), Special Darshan Ticket Scam in TTD 19 October

Special Darshan Ticket Scam in TTD, Scam Found in Sale of Darshan Tickets in TTD, Three arrested in Tirumala darshan tickets fraud

బయటపడిన దర్శన కుంభకోణం

Posted: 10/19/2013 09:11 PM IST
Scam found in sale of darshan tickets in ttd

తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం టిక్కెట్లకు సంబంధించిన మరో కుంభకోణం వెలుగు చూసింది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అరెస్ద్ చేశారు. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రొటేషన్ చేస్తూ సీసీ కెమెరా ఆపరేటర్ చైతన్యకుమార్ అడ్డంగా దొరికిపోయాడు.ఈ కుంభకోణం గత పదిరోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం.

 

ఈ కుంభకోణం గత పదిరోజులుగా కొనసాగుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించి విజిలెన్స్ అధికారులు ...చైతన్యకుమార్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుల నుండి 46 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. జనవరిలో ఇదే తరహా కుంభకోణంలో నలుగురు బ్యాంకు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

 

ఇలాంటి కుంభకోణాలు తిరుపతిలో చాలా జరిగాయి. మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉన్నాయి. అలా ఎందుకు జరుగుతున్నాయో ఎవరికి అర్థం కావటంలేదు. అసలు లోపం ఎవరి ఉంది? అదికారుల్లో ఉందా? లేక వ్యవస్థలోనే ఉందా? టిటిడి ఇలాంటి వాటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘనకార్యల వలన .. తిరుమల పవిత్రత దెబ్బతింటుందని భక్తులు అంటున్నారు. ఇలాంటి కుంభకోణాల్లో ఎక్కువుగా..టిటిడి ఉద్యోగులే ఉండటంతో.. భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఇకనైన ఇలాంటి వారికి పై కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles