Brahmotsavam celebrations in tirupati

Brahmotsavam Celebrations in Tirupati, Tirupati Brahmotsavam Festival, irumala tirupati venkateswara, balaji, venkatadri, tirupati, Samaikyandhra sega to Chennai

Brahmotsavam Celebrations in Tirupati, Tirupati Brahmotsavam Festival, Samaikyandhra sega to Chennai

వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు-చెన్నైని తాకిన సమైక్య సెగ

Posted: 10/07/2013 09:08 PM IST
Brahmotsavam celebrations in tirupati

తిరుమలలో వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామివారు సింహ వాహనంపై ఊరేగింపుగా తరలివస్తుండగా, సాయంత్రం ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.కన్నుల పండువగా సాగే బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాల శోభతో తిరుమల క్షేత్రం భూలోక వైకుంఠాన్ని తలపిస్తోంది. రెండోరోజు ఉత్సవాల్లో భాగంగా మలయప్ప స్వామివారు చదువుల తల్లి సరస్వతి దేవి అవతారంలో వీణాపాణి అయి హంసవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

 

 

వేదగానాలు, మంగళవాయిద్యాల మధ్య ఏడుకొండలవారు కదలివచ్చారు. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ వాహన సేవ 11 గంటల వరకు నయనానందకరంగా సాగింది. పురాణ ఇతిహాసాల్లో హంసను.. పాలను, నీళ్లను వేరు చేసే గుణం కలదిగా చెప్పుకుంటారు. ఈ రీతిలోనే సమాజంలో నెలకొన్న మంచి చెడులను వేరు చేయాలని భక్త జనావళికి బోధిస్తూ స్వామివారు హంసవాహనంపై ఎక్కి వస్తారని భక్తులు నమ్ముతారు. అంతేకాదు సృష్టికర్త బ్రహ్మ వాహనం కూడా హంస అని, ఆ వాహనంపై దేవదేవుడిని కనులారా చూసిన అశేష భక్తజనం భక్తి సాగరంలో మునిగిపోతారు. ఏడాదికి ఒకసారి వచ్చే ఈ బ్రహ్మోత్సవాల్లో తరిస్తే ఇక్కట్లు తొలుగుతాయని భక్తులు నమ్ముతారు. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా టిటిడి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భజనలు, కోలాటలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

 

తమిళనాడును తాకిన సమైక్య సెగ

 

రాష్ట్రంలో జరుగుతున్న సమైక్య ఉద్యమ సెగ తమిళనాడును తాకింది. తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీటి తరలింపును సమైక్యవాదులు ఈరోజు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి కల్లిపూడి వద్ద కాలువ షటర్లను ఆందోళన కారులు మూసివేసేందుకు ప్రయత్నించారు. సమైక్యవాదులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అభివృద్థి పథంలో పయనిస్తున్న రాష్ట్రాన్ని కేంద్ర మంత్రి చిదంబరం తన స్వార్థ కోసం విభజించారంటూ సమైక్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిదంబరానికి వ్యతిరేకంగా సమైక్యవాదులు నినాదాలు చేశారు. తాము తమిళనాడు ప్రజలకు వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజనకు బీజం చేసింది చిదంబరమేనని సమైక్యవాదులు మండిపడ్డారు.

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles