Lack of hygiene facilities for ttd workers free laddu prasadam

Lack of Hygiene Facilities for TTD Workers, Free Laddu Prasadam, Devotees in Tirupati came on Foot, Lack of Hygiene Facilities

Lack of Hygiene Facilities for TTD Workers Free Laddu Prasadam

శ్రీవారి సన్నిధిలో కార్మికుల కష్టాలు-ఉచితంగా లడ్డూ

Posted: 10/03/2013 02:22 PM IST
Lack of hygiene facilities for ttd workers free laddu prasadam

శ్రీవారి సాక్షిగా కొందరు తీవ్రవేదనకు గురవుతున్నారు. యానమాన్య నిర్లక్ష్యం వెంకన్న సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం టిటిడి అతిథి గృహాలను నిర్మించింది. వీటిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను 'అల్ సర్వీస్ గ్లోబల్' ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించింది. వాటి నిర్వహణ కోసం టిటిడి కోట్ల రూపాయలను ఆ కంపెనీకి అప్పగిస్తోంది. కానీ అతిథి గృహాల్లో బాత్‌రూమ్‌లను శుభ్రం చేసేందుకు ప్రమాదకరమైన యాసిడ్‌ను ఇస్తున్నారు. దీనితో శుభ్రం చేసే సమయంలో కార్మికులు తప్పనిసరిగా చేతులకు గ్లౌసులు వాడాలి. వాటిని సంబంధిత కంపెనీయే అందుబాటులో ఉంచాలి. ముఖానికి మాస్కులు, గోడలు శుభ్రం చేసేందుకు స్క్రబ్బర్లను సరఫరా చేయాలి. అయితే యాజమాన్యం ఇవేవీ లేకుండానే కార్మికులతో పనులు చేయిస్తోంది.

 

అనారోగ్యానికి గురవుతున్న కార్మికులు

కార్మికులతో ఇంతగా పనిచేయించుకుంటున్నా వీరికి ఇచ్చే జీతాలు నాలుగైదు వేలకు మించడం లేదు. పరిరక్షణ చర్యలు లేకుండా శుభ్రం చేయడం మూలంగా కార్మికుల చేతులకు, కాళ్లకు పుండ్లు పడుతున్నాయి. వీరు అనారోగ్యానికి గురైతే యాజమాన్యం పనిలోంచి తొలగిస్తోంది. కలియుగానికే దైవంగా భావించే శ్రీవారి చెంతనే కార్మిక చట్టాలు ఈ విధంగా అమలవ్వడం దారుణం. ఒక్కోసారి యాసిడ్‌ ఘాటును పీల్చి శ్వాసకోశ వ్యాధులకు గురవుతున్నామని కార్మికులు వాపోతున్నారు. కార్మికులకు కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించలేదని వారు ఆవేదన చెందుతున్నారు. ఎంత తీవ్రమైన సమస్య వచ్చినా ఆస్పత్రులకు వెళ్ళే పరిస్థితి లేదని చెబుతున్నారు. తమకొచ్చే అతి తక్కువ వేతనాలతో కుటుంబం గడవడమే కష్టంగా ఉందని అంటున్నారు. అయితే కార్మికులకు అండగా ఉంటున్న సిఐటియు నాయకులు యాజమాన్యాన్ని నిలదీస్తే కార్మికులను పనిలో నుంచి తొలగిస్తోంది. ధర్మో రక్షతి రక్షితః అని మొత్తుకుంటున్న టిటిడికి ఈ అధర్మం కన్పించడం లేదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

 

కాలినడక భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం

తిరుమలకు కాలినడకన వస్తూ దివ్యదర్శనం టోకెన్లు పొంది శ్రీవారిని దర్శించుకునే భక్తులకు.. ఒక్కో లడ్డూ ప్రసాదం ఉచితంగా అందజేయనున్నారు. జరిగిన టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో దీన్ని తీర్మానించారు. ఈ ఉచిత లడ్డూ అందజేసే తీర్మానాన్ని బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి అమలులో పెట్టాలని నిర్ణయించారు. కనుమూరి బాపిరాజు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఎం కిరణ్ చేతల మీదుగా రూ.70 కోట్లతో నిర్మించే శ్రీవారి సేవాసదన్ సముదాయం, రూ.20 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో మండలి సభ్యులు రేపాల శ్రీనివాస్, పాముల రాజేశ్వరి, ఎల్ ఆర్ శివప్రసాద్, లక్ష్యణ్ రావు, పదవిరీత్యా సభ్యులు ముక్తేశ్వరరావు పాల్గొన్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles