Golden chariot to be out for trial run to venkatesh

Golden chariot to be out for trial run to venkatesh, Golden chariot to be out for trial run, Tirumala Tirupati Devasthanam, golden chariot, Trial run of golden chariot

Golden chariot to be out for trial run to venkatesh

శ్రీవారి స్వర్ణరథం ఊరేగింపులో అపశ్రుతి

Posted: 09/30/2013 12:57 PM IST
Golden chariot to be out for trial run to venkatesh

శ్రీవారికి నూతనంగా తయారు చేసిన స్వర్ణరథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఈ రోజు ప్రయోగాత్మకంగా వూరేగించనుంది. ఉదయం 9.05 గంటలకు పురావస్తు ప్రదర్శనశాల ప్రాంగణం నుంచి ఆనంద నిలయం భవనం ముందుభాగం మీదుగా పడమర మాడ వీధికి రథం చేరుకుంటుంది. అక్కడి నుంచి ఉత్తర , తూర్పుమాడ వీది మీదుగా వైభవత్సవ మండపం ఎదుట కొత్తగా నిర్మించిన మండపంలోకి తీసుకురానున్నారు.

 

సుమారు రూ. 25 కోట్ల వ్యయంతో శ్రీవారి రథాన్ని స్వరాంగ సుందరంగా తయారు చేసింది. తిరువీదుల్లో వూరేగించిన అనంతరం స్వర్ణరథాన్ని మండపంలో భద్రపరుస్తారు. అయితే బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 10న నూతన స్వర్ణరథం పై తిరుమలేశుడు వూరేగనున్నాడు.

 

అపశ్రుతి

శ్రీవారికి నూతనంగా తయారుచేసిన స్వర్ణరథాన్ని అధికారులు ప్రయోగాత్మకంగా వూరేగించారు. అయితే ఈ స సందర్భంలో అపశ్రుతి దొర్లింది. ట్రయిల్ రన్ నిర్వహిస్తుండగా స్వర్ణరథ చక్రాలు భూమిలోకి కుంగిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు శ్రీవారి రథాన్ని క్రేన్ సాయంతో పైకి లేపారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles