Dollar seshadri support on samaikyandhra movement

dollar seshadri support on samaikyandhra movement, Chittoor Samaikyandhra , samaikyandhra sega in ttd,

dollar seshadri support on samaikyandhra movement

డాలర్ శేషాద్రి ఆద్వర్యంలో భారీ ర్యాలీ

Posted: 08/30/2013 07:01 PM IST
Dollar seshadri support on samaikyandhra movement

రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉద్యోగులు రోడ్డెక్కారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ఎప్పుడూ సాధారణంగా బయటకు రాని డాలర్ శేషాద్రి కూడా విభజనను వ్యతిరేకిస్తూ డప్పు కొట్టారు. తిరుమలకు విఐపీలు వస్తే, వారిని కలుసుకుని దగ్గరుండి శ్రీవారి దర్శనం చేయిస్తూ ఉంటారు. అలాంటిది ఆయన ఈరోజు డప్పు కొట్టడంతో అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. కాగా తిరుపతిని 48 గంటల పాటు దిగ్బం«ధించే కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు కూడా నగరాన్ని సమైక్య వాదులు ర్యాలీలు, ఆందోళనలు, రాస్తారోకోలతో దిగ్బంధించారు. టీటీడీ యూనియన్ నేతలతో కలిసి సమైక్య వాదులు దేవస్థానం పరిపాలన భవనాన్ని దిగ్బంధించారు. లోపల విధులు నిర్వహిస్తున్న కొంత మంది ఉద్యోగులను బలవంతంగా బయటకు పంపారు. బయట ప్రాంతాల నుంచి తిరుపతిలోకి ఎటువంటి వాహనాలనూ ప్రవేశించకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles