Ak 47 guns to tirumala tirupati devastanam

ak 47 guns to tirumala tirupati devastanam, tirumala tirupati devastanam, ttd, tirumala safety, tirumala security, tirupathi urban sp rajasekhara babu, police training in tirupathi

AK 47 Guns to Tirumala Tirupati Devastanam

తిరుమలలో ఏకే-47 సందడి

Posted: 07/12/2013 03:52 PM IST
Ak 47 guns to tirumala tirupati devastanam

తిరుమలలో ఏకే -47 సందడి?.. భక్తుల రక్షణ కోరకు, తిరుమల భద్రతకు ఇక ఏకే-47 రైఫిళ్లను వాడనున్నారు. మొత్తం పది ఆయుధాలను రెండు రోజుల్లో ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు డబుల్ బ్యారెల్‌గన్లను వాడుతున్న ఎస్పీఎఫ్ సిబ్బందికి వీటిని అందిస్తారు. తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందనే ఇంటెలిజెన్సు వర్గాల హెచ్చరికలు, ఇటీవల బుద్ధగయలో జరిగిన బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఏకే-47 రైఫిళ్ల వాడకంపై ఎస్పీఎఫ్ సిబ్బందికి శిక్షణ విషయమై ఎస్పీఎఫ్ డీఎస్పీ నాగమల్లేశ్వరరావు, రెడ్డినాయక్ తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబును కలిశారు. తిరుపతిలోని రిజర్వుపరేడ్ మైదానాన్ని శిక్షణకు కేటాయించాలని విజ్ఞప్తి చేయగా ఆయన సానుకూలంగా స్పందించారు. తిరుమలలోని 300 మంది ఎస్పీఎఫ్ సిబ్బందికి ఇక్కడ విడతలవారీగా శిక్షణ ఇస్తారు. డబుల్ బ్యారల్ గన్‌ల కంటే ఈ ఏకే- 47 రైఫిళ్లను ఒకచోట నుంచి మరోచోటుకు తీసుకెళ్లడం సులభమని రిజర్వు పోలీసు అధికారి ఒకరు చెప్పారు. ఈ ఏకే-47 రైఫిల్ కి నిమిషానికి 650 రౌండ్లు కాల్చే సామర్థ్యం ఉంటుంది 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles