Contract workers staged dharna in tirumala

contract workers staged dharna in tirumala, lord venkateswra, contract workers, citu, bhrahmotsavam gift, tirumala for bhrahmotsavam gift, TTD contract worker

contract workers staged dharna in tirumala

తిరుమల అన్నమయ్య భవన్ ఎదుట పారిశుద్య కాంట్రాక్టు కార్మికులు ధర్నా

Posted: 05/15/2013 03:36 PM IST
Contract workers staged dharna in tirumala

తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల కార్మికులకు ధర్నాకు దిగారు. బ్రహ్మోత్సవాల బహుమతిని అందించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుమల అన్నమయ్య భవన్ ఎదుట పారిశుద్య కాంట్రాక్టు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సిఐటియు నాయకులు మాట్లాడుతూ... టిటిడి గతంలో కాంట్రాక్టు కార్మికులకు బ్రహ్మోత్సవాల సందర్భంగా కానుకను అందిస్తామని చెప్పిందన్నారు. హామీ ఇచ్చి 5 నెలలు గడుస్తున్నా అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తునన్నారని అన్నారు. కాగా, దేవస్థానంలో 1100 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు.

20 సంత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా కార్మికులకు ప్రత్యేక విశ్రాంతి గదులను, వారంతపు సెలవులను ఇవ్వాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు ఇఎస్ ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దేవాలయ ఈఓ వారితో సంప్రదింపులు జరిపారు. కార్మికులు కోరిన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయినా కార్మికులు ఆందోళన కొనసాగించారు. దీంతో టిడిపి ఛైర్మన్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో వారు తమ ఆందోళనను విరమించారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles