Political mla praveen kumar reddy comment on cm kiran

mla praveen kumar reddy comment on cm kiran, tdp mla praveen kumar reddy, cm kiran kumar reddy, tamballapalle, piluru, ys rajasekara reddy, ysrcp leaders,

mla praveen kumar reddy comment on cm kiran

సీఎం చుట్టూ తిరిగినా ?

Posted: 05/01/2013 07:34 PM IST
Political mla praveen kumar reddy comment on cm kiran

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హామీలు నీటి బుడగలేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. ఆయన బి.కొత్తకోటలో మాట్లాడుతూ గతంలో తాము నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై పలుమార్లు కాళ్లరిగేలా సీఎం చుట్టూ తిరిగినా నిధులను మంజూరు చేయలేదన్నారు. మూడేళ్లుగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో పర్యటించని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అభివృద్ధి విషయంలో తనకు పీలేరు వేరు కాదు, తంబళ్లపల్లె వేరు కాదని బహిరంగసభలో ప్రకటించిన సీఎం కిరణ్ ప్రస్తుతం పీలేరులో రూ.10వేలకోట్లతో అభివృద్ధి పనులు జరుగుతుంటే అందులో ఐదు శాతం కూడా నిధులు తంబళ్లపల్లెలో అభివృద్ధి పనులకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

రాజశేఖర్‌రెడ్డి హయాంలో 70శాతం నిధులు ఖర్చుచేస్తే నాలుగేళ్లలో మిగిలిన 30శాతం నిధులు కూడా ఖర్చు చేయని దుస్థితిలో కిరణ్ ప్రభుత్వముందన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఆర్టీసీ డిపో కోసం నిరీక్షిస్తుంటే బస్టాండుకు మాత్రం రూ.కోటి నిధులు ఇవ్వడమేంటన్నారు. రోడ్ల అభివృద్ధికి రూ.10కోట్లు, బీవోటీ నిధులను ఖర్చు చేయనున్నట్లు సీఎం ప్రకటించారని, వీటితో నిధులు మంజూరు కాకనే పనులెలా జరుగుతాయన్నారు. అంతకు మును స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles