Ruya hospital employee strike

ruya hospital employee strike, hospital staff , tirupati ruya hospital

ruya hospital employee strike

మూడు గంటలపాటు దిగ్బంధనం రోగులు ఉక్కిరిబిక్కిరి

Posted: 04/27/2013 05:31 PM IST
Ruya hospital employee strike

11 రోజుల పాటు శాంతియుతంగా రిలేనిరాహారదీక్షలు చేసిన నాల్గోతరగతి ఉద్యోగులు 12వ రోజు ఉద్యమ బాట పట్టారు. రుయా ఆసుపత్రి ప్రధాన భవనానికి తాళాలు వేశారు. రాకపోకలు జరగకుండా ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా దీక్షా శిబిరాన్ని వేశారు. రుయా యాజమాన్యం, పోలీసులు కలుగజేసుకున్నా ఉద్యోగులు పట్టించుకోలేదు. 3 గంటలపాటు పూర్తి స్తాయిలో వైద్య సేవలను నిలిపివేశారు. దీంతో రోగులు, వారి బంధువులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. కేవలం 3 గంటలపాటు ఉద్యమిస్తే ఏం జరుగుతుందో ¸ యజమాన్యానికి రుచి చూపించారు. వఖాళీగా వున్న పోస్టులను భర్తీచేసి,ఉద్యోగులపై ఉన్న అధిక పనిభారాన్ని తగ్గించాలన్న డిమాండుతో గత 12 రోజులుగా రిలే నిరాహారదీక్ష చేస్తున్నారు.

అయనా కూడా రుయా యాజమాన్యం స్పందించటంలేదన్న తలంపుతో 12వ రోజు రుయాను దిగ్బందించారు. ఉదయం 8 గంటలకే ప్రధాన ద్వారానికి తాళాలు వేసి దీక్షా శిబిరాన్ని వేశారు. దాదాపు 3 గంటలపాటు రాకపోకలు నిలిపివేశారు. ఇది తెలిసి అలిపిరి పోలీసులు రుయా పరిపాలనాధికారి జె. వీరాస్వామి ఉద్యోగులకు, .ఎన్‌.టి.యు.సి జిల్లా నాయకులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. రుయా యాజమాన్యానికి ఏంచేయాలో దిక్కుదోచలేదు. అయితే 11 గంటల సమయంలో ఉద్యోగులు ధర్నాను విరమించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కేవలం 3 గంటలపాటు ఉద్యమిస్తే ఏం జరుగుతుందో యాజమాన్యానికి తెలియజేశారు. ఇకపై రోజుకు 3 గంటల పాటు ఇలాగే ధర్నాను నిర్వహిస్తామని హెచ్చరికలు జారీచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles