Ruya hospital employees strike in tirupati

ruya hospital employees strike in tirupati, ruya hospital, employees strike, ruya hospital tirupathi

ruya hospital employees strike in tirupati

రుయా బంద్‌ : ఎమ్మెల్యే

Posted: 04/20/2013 03:58 PM IST
Ruya hospital employees strike in tirupati

ఖాళీగావున్న పోస్టులను భర్తీ చేయడం, ఉద్యోగులపై పనిభారం తగ్గించడం, జీతాలను పెంచడం వంటి పలు సమస్యల పరిష్కారం కోసం నాల్గవ తరగతి ఉద్యోగులు ఈ నెల 15వ తేదినుంచి రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. ఇందుకోసం నెలరోజుల ముందే ఆసుపత్రి యాజమాన్యానికి నోటీసులు కూడా జారీచేశారు. అయినా ఆసుపత్రి ఉన్నతాధికారులు, ఉద్యోగులు సమస్యలను అటు ప్రభుత్వం వద్దకు తీసుకుని వెళ్ళలేదంటూ పలువురు సంఘం సభ్యులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఏదైతేనేం.. ఉద్యోగులు రిలే దీక్షను పూర్తి స్థాయి నిరసన దీక్షగా చేపట్టనన్నారు. రాయలసీమ జిల్లాలలో నిరుపేదలు, మధ్య, ఎగువ మధ్య తరగతుల ప్రజలకు దశాబ్ధాల తరబడి ఆరోగ్య సేవలందిస్తున్న శ్రీరామనారాయణ రుయా ఆసుపత్రి నేటినుంచి పూర్తిగా స్థంభించనుంది. తమ సమస్యల పరి ష్కారం కోసం గత వారం రోజులుగా నాల్గవతరగతి ఉద్యోగుల రిలే నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అధికారులలో ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేకపోయేటప్పటికి వారు రిలే నిరాహారదీక్షను పూర్తిస్థాయి నిరసన దీక్షగా చేపట్టనున్నారు. పూర్తిస్థాయిలో విధులను బహిష్కరించనున్నారు. వారికి మద్దతుగా అనుమతిలోని మిగతా సంఘాలు కూడా నిరసనను తెలపనున్నాయి. 400 మందికి పైగా నాల్గవతరగతి ఉద్యోగులు చేపట్టాల్సిన విధులను కేవలం 90 మంది చేస్తున్నారు. దాంతో పనిభారం, ఒత్తిడి, మానసిక క్షోభకు గురవుతున్న నేపథ్యంలో ఈ సమ్మెను విజయవంతం చేయాలని వారు గట్టిగా పట్టుబడుతున్నారు. అంతేకాకుండా వారికి మద్దతుగా ఆసుపత్రిలోని మిగతా ఉద్యోగుల సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విధులను బహిష్కరించనున్నట్లు సమాచారం. దీంతో రోగులకు మరిన్ని నష్టాలు కలగనున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు కలుగజేసుకుని సమస్యలు పరిష్కారం చూపకపోతే రుయా ప్రతిష్ట దిగజారి పోతుంది. నేడు రుయా ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి సందర్శించి మద్దతు ప్రకటించనున్నారు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles