Tirupati revenue department vs acb officers

tirupati, tirupati revenue department, acb raids, sub-register office, acb, tirupati sub register office,

tirupati revenue department vs acb officers

tirupati-revenue.gif

Posted: 04/04/2013 10:44 AM IST
Tirupati revenue department vs acb officers

tirupati revenue department vs acb officers

అవినీతి నిరోధకశాఖ దెబ్బకు తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోని పీఠాలు కదిలాయి. సబ్ రిజిస్ట్రార్ స్థాయి నుంచి అటెండర్ వరకు మూకుమ్మడిగా బదిలీ చేస్తూ కర్నూలు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. వారి స్థానంలో గురువారం నుంచి కొత్త ఉద్యోగులు విధులు నిర్వర్తించనున్నారు. తిరుపతి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై గతేడాది డిసెంబర్ 15వ తేదీన ఏసీబీ అధికారు లు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా కీలక రికార్డులు, రూ.2.2 లక్షల నగదు, ఒక వెండి పళ్లెం స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడి అవినీతి వ్య వహారంపై సబ్ రిజిస్ట్రార్, డాక్యుమెంట్ రైటర్లు, కొందరు సిబ్బందిపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక పంపారు. ఆ నివేదిక ఆధారంగా ఉద్యోగుల ను ఉన్నపళంగా ప్రభుత్వం బదిలీ చే సింది. ఎవరూ కూడా డాక్యుమెంట్ రైటర్లు, దళారుల ప్రమేయంతో అక్కడ ఉద్యోగం చేయకూడదని, రిజిస్ట్రేషన్‌దారులకు ఇబ్బందుల్లేకుండా వెంటనే పనులు చేసి పెట్టాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  దీంతో రాష్ట్రంలోనే తొలి సారిగా తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఈ బదిలీలకు శ్రీ కారం చుట్టారు. తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ రాజగోపాల్‌ను కర్నూలుకు బదిలీ చేసి, ఆయన స్థానంలో ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మోహన్‌బాబును ఇన్‌చార్జిగా నియ మించారు. సీనియర్ అసిస్టెంట్ వై.సుబ్రహ్మణ్యంను కూడా బదిలీ చేశారు. తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కా ర్యాలయంపై ఇటీవల ఏసీబీ అధికారు లు దాడులచేసి రూ.2 లక్షల నగదు, కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నా రు. వీరిపైనా ప్రభుత్వానికి నివేదిక పంపారు. దీనిపై పరిశీలించిన ప్రభు త్వం తిరుపతి అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తరహాలో రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సబ్ రిజిస్ట్రార్‌తోపాటు అటెండర్ వరకు ప్రక్షాళన చేసి కొత్త వారిని నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shop owners strike in tirupati
Goa governor bharat vir wanchoo visit tirupati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles