Grand celebrations of rathasapthami in tirumala

Rathasapthami, Rathasapthami Celebrations, Tirumala Temple

Grand Celebrations of Rathasapthami in Tirumala Temple.

Grand Celebrations of Rathasapthami.png

Posted: 02/18/2013 08:23 PM IST
Grand celebrations of rathasapthami in tirumala

rathasapthamiసూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు వివిధ వాహనాలపై, కమనీయ రూపాలతో భక్తులకు శ్రీనివాసుడు దర్శనమిచ్చాడు. స్వామివారి వాహన సేవల్ని తిలకించి భక్తులు తరించారు.తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ శ్రీవారు భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి వాహన వైభవాన్ని వీక్షించేందుకు ఎన్నడూలేని విధంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులతో నిండిపోయాయి. ఏటా మాఘశుద్ధ సప్తమి రోజున తిరుమలలో రథసప్తమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీ.

సూర్య జయంతిగా పిలిచే ఈ ఉత్సవంలో తొలుతగా ఆదివారం వేకువజామున ఉత్సవర్లు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో  పయనిస్తూ వాయువ్యదిశలోకి వేంచేశారు.ఉదయం 6.35 గంటలకు ఉదయించే సూర్యభగవానుడి కిరణాల కోసం వేచి ఉన్నారు.  7.15 గంటలకు భానుడి కిరణాలు ఉత్సవర్లను తాకగానే అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్త కార్యక్రమాలు పూర్తిచేశారు. ఉత్తర మాడవీధిలోని వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగాయి. ఆ వెంటనే మలయప్పస్వామి ఊరేగింపు ప్రారంభమైంది.వరుసగా చిన్నశేష, గరుడ, మధ్యాహ్నం హనుమ, చక్రస్నానం, సాయంత్రం కల్పవృక్షం, సర్వభూపాల, రాత్రి చంద్రప్రభ వాహనాల్లో మలయప్పస్వామి నాలుగు మాడవీధుల్లో విహరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jayaprada visits tirumala
Ratha saptami celebrations in tirumala  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles