Cold war between ttd eo and mla

TTD EO, MLA, Bhumana karnakar reddy

Cold war between TTD EO and MLA

Cold war between TTD EO and MLA.png

Posted: 12/19/2012 06:43 PM IST
Cold war between ttd eo and mla

స్వామి కార్యం కన్నా స్వకార్యం మిన్న అన్నట్లు... ఇప్పటికే రాజకీయ, సినిమా నటుల సేవలో టిటిడి అధికారులు తరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే తాజాగా  సర్కారి హారతి విషయంలో స్ధానిక ఎమ్మెల్యే కరుణాకర్‌ రెడ్డి, టిటిడి ఈఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విఐపి విరామదర్శనంలో స్వామివారి సేవలో తిరుపతి ఎమ్మేల్యే తన అనుచరులతో వెంకన్నను దర్శించుకున్నారు. ఏడుకొండలవాడికి సాయంత్రం నైవేద్యం సమయంలో ముందుగా సర్కారు హరతిని ఇస్తారు. ఈహారతిని ప్రభుత్వం, భక్తుల పక్షాన ఈఓ తీసుకోవడం ఆనవాయితీ. ఐతే సర్కారు హరతిని గతంలో  టిటిడిలో పనిచేసిన ఉన్నతస్థాయి ఉద్యోగులకు కల్పించేవారని ప్రస్తుతం ఈఓ ఏకాంతంగా దాదాపు పదినిమిషాలపాటు సర్కారు హారతి తీసుకున్నారని స్థానిక ఎమ్మేల్యే, మాజీ టిటిడి బోర్డు ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మేల్యే కరుణాకర్‌రెడ్డి చేసిన ఆరోపణలను టిటిడి ఈఓ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

తాను సర్కారు హరతిని భాద్యతగానే తీసుకుంటున్నానని, ఇది తనకు ఈఓ కావడంవలనే సంప్రాప్తించిందన్నారు. తన తరువాత ఎవరు ఈఓగా వచ్చినా వారు సర్కారు హరతిని తీసుకుంటారని చెప్పారు. స్థానిక ఎమ్మేల్యే వెంట వచ్చిన కార్యకర్తలకు ఆర్హత లేకపోయినా బ్రేక్ దర్శనంలో ప్రధాన్యత కల్పించామని, ఈ విషయాన్ని కూడా కరుణాకర్ రెడ్డి ప్రస్తావించి ఉంటే బాగుండేదన్నారు. స్వామివారి సన్నిధిలో సత్యాలు మాట్లాడాలని హితువు పలికారు. ఏది ఏమైనా  24 గంటలూ అధికారులు, నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా.. ఆ సమయాన్ని భక్తుల సౌకర్యాల విషయంలో దృష్టి పెడితే సమస్యలు వాటంతటవే సమసిపోతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yatra sadan 4 started in thirupati
Vijay mallya offers 3 kg gold to lord venkateswara  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles