మెగాస్టార్ చిరంజీవికి రాజకీయ భవిష్యత్ ప్రసాదించింది తిరుమల వేంకటేసుని సన్నిధి తిరుపతి. అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే చిరంజీవికి తాజాగా కేంద్రమంత్రి పదవి దక్కడంతో తిరుపతి పరిసరాల్లో పర్యాటక రంగం ప్రగతి సాధిస్తుందనే ఆశలు చిగురిస్తున్నాయి. తిరుపతి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసినా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చిన సంగతి విదితమే.
ఫలితంగా, కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవి చిత్తశుద్ధితో సేవలందిస్తే జిల్లాలో టూరిజం కారిడార్ కల నెరవేరడం ఖాయం. తిరుపతి - శ్రీకాళహస్తి మధ్యన రూ.350 కోట్ల అంచనాతో మెగా టూరిజం హబ్ నిర్మించాలనే ప్రతిపాదన కార్యరూపం దాల్చవచ్చు. ప్రముఖ ఆలయాలను అనుసంధానం చేయొచ్చు. జిల్లాలోని పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంలో భాగంగా టూరిజం కారిడార్ పేరుతో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు.
గుడిమల్లం, తొండమనాడు, బొక్కసంపాళెం, సురుటుపల్లె, నాగలాపురం, నారాయణవనం, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, చంద్రగిరి, మొగిలీశ్వరాలయం వంటి పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడానికి ఐదేళ్ల కిందట సుమారు రూ.48 కోట్లు కేటాయించారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ ఆలయాలను దర్శించుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. అయితే కొన్ని పనులు కార్యరూపం దాల్చినప్పటికీ నిధుల కొరతతో చాలా పనులు ఇంతవరకు ప్రారంభం కాలేదు.
శ్రీకాళహస్తి-తిరుపతి ప్రధాన ఆలయాలలో తొండమనాడుకు వెళ్లే మార్గాల్లో రెండుచోట్ల ఒక్కోఆర్చి రూ.20లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. అతిథిగృహాలు, ఆర్చిలు వంటి పనులు చేపట్టినా... ప్రధాన ఆలయ అభివృద్ధి పనులు మాత్రం చేపట్టలేదు. తొండమనాడులోని శ్రీకల్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ధ్వజస్తంభం కూలిపోయి 50 ఏళ్లు దాటింది. ఈ ధ్వజస్తంభం ఏర్పాటు చేయడానికి అవసరమైన నిధులు కేటాయించలేదు. ధ్వజస్తంభం లేకపోవడంతో ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఆగిపోయాయి. ఈ పురాతన ఆలయం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఆలయ గోడలపై మొక్కలు పెరిగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులు తలదాచుకోవడానికి కనీసం నీడ కూడా లేదు. ప్రాంగణంలో బండలు పరిపించాలని చాలాకాలంగా భక్తులు కోరుతున్నప్పటికీ పట్టించుకునే వారే కరువయ్యారు. ఇంకా.. జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం ఆలయాలను అనుసంధానం చేస్తూ రైలు మార్గం నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. గతంలో నేతలు కూడా హామీ ఇచ్చారు. ఇలా చేయడం వలన భక్తులకు ఇక్కట్లు తప్పుతాయి. అంతేగాకుండా ఈ ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి. కేంద్రమంత్రి చిరంజీవి దృష్టి సారిస్తే అనుసంధాన రైలు మార్గం వచ్చే అవకాశం ఉంది.
ఇవిలా ఉంటే, తిరుపతి-శ్రీకాళహస్తి మధ్యన రూ.350 కోట్ల అంచనాతో మెగా టూరిజం హబ్ ఏర్పాటు చేయనున్నట్లు నిన్న ఏపీ టూరిజం డైరెక్టర్ సురేంద్రరెడ్డి తెలిపారు. కేంద్ర పర్యాటకశాఖ సహాయమంత్రి చిరంజీవి సహాయంతో జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని సురేందర్ రెడ్డి అంటోన్న మాటలు ఏమేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
...avnk
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more