Devotees hair in ttd

Devotees hair in TTD.png

Posted: 10/05/2012 12:12 AM IST
Devotees hair in ttd

Devotees-hair-in-TTD1

భక్తుల తలనీలాలు తీసే విషయంలో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న టీటీడీకి ఉచిత సేవ చేసే క్షురకుల వల్ల భారం తగ్గింది. శ్రీవారిసేవ కింద క్షురకులతో భక్తులకు తలనీలాలు తీసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దీంతో భక్తులు తలనీ లాల సమర్పణకు వేచి ఉండే సమయం గంట కు మించటం లేదు. తిరుమలకు వచ్చే భక్తుల్లో రోజుకు 20 నుంచి 30 వేల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తున్నారు. ఏడాదికి 1.10 కోట్ల మంది గుండ్లు గీయించుకోవడం, మూడు కత్తెర్ల మొక్కు చెల్లిస్తున్నారు.

తిరుమల లో ప్రస్తుతం ప్రధాన కల్యాణకట్ట, మరో 19 చిన్న కల్యాణకట్టలు ఉన్నాయి. ఇక్కడ 281 మంది శాశ్వత ఉద్యోగులు, 320 మంది పీస్‌రేటు (గుండుకు రూ.7, కత్తెర్లకు రూ.3 చొప్పు) కార్మికులు పనిచేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులు గంటకు 60 గుండ్లు, పీస్‌రేటు కార్మికులు 80 దాకా గుండ్లు, కత్తెర్లతో భక్తులకు సేవలందిస్తున్నారు.అయితే సరిపడ సిబ్బంది లేకతలనీలాలు సమర్పించేందుకు కనీసం ఆరేడు గంటలు వేచి ఉంటున్నారు.. రద్దీ రోజుల్లో ఈ సమయం మరింత పెరుగుతుండటంతో భక్తు లు ఆందోళనకు దిగిన సందర్భాలు కూడా ఉ న్నాయి. తిరుమలకు వచ్చే భక్తులకు సేవలందించే ఉద్దేశంతో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో 2000 నవంబరు 21వ తేదీ శ్రీవారిసేవను ప్రారంభించారు. తొలుత 200 మంది సేవకులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నేడు 3 వేల మందికి పెరిగింది. అన్నదా నం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, సమాచార కేం ద్రాలు, క్యూలైన్లు, ఉద్యానవనం వంటి అనేక విభాగాల్లో సేవకులు స్వచ్ఛందంగా సేవలంది స్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Balaji gives darshan on simha vahanam
Ghantasala venkateshwara rao events  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles