ప్రతిఒక్కరికి ఇంటిని నిర్మించుకోవాలనే కల వుంటుంది. ఇంటికి కావాల్సిన ముందు జాగ్రత్తలు, దాని ఆకారం, అందులో వుండాల్సిన గదులు ఏ ప్లేస్ లో బాగుంటుంది, ఇంటి వైశాల్యం ఎంత, దానికయ్యే ఖర్చెంత అంటూ అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటారు.
అయితే మన హిందూ, వాస్తు శాస్త్రాలప్రకారం ఇళ్లను చతురస్ర లేదా దీర్ఘచతురస్ర ఆకారాలోనే మన ఇళ్లనుగాని, అపార్ట్ మెంట్లనుగాని నిర్మించాలని చెబుతున్నాయి. అలా కాని పక్షంలో ఆ గృహాలపై విషవాయువుల ప్రభావం వుంటుందని నిపుణులు గట్టి నమ్మకంతో పేర్కొంటున్నారు.
పరిమితంలేని విధంగా గృహనిర్మాణాలను చేపట్టడం వల్ల అనేక దుష్ఫలితాలు ఎదురవుతాయని శాస్త్రనిపుణులు చెబుతున్నారు. ఇంట్లో జరగాల్సిన శుభకార్యాలు సరిగ్గా జరగవని, తలపెట్టిన కార్యక్రమాలు సరియైన లాభాలు చేకూర్చవని, వచ్చే ఆదాయంలో నష్టం మాత్రమే మిగులుతుందని, కుటుంబసభ్యుల మధ్య మనస్పర్థలు ఏర్పడుతాయని వారు బల్లగుద్దిమరీ ప్రకటిస్తున్నారు. ఇంకోకోణంలో వారు హద్దుదాటి నిర్మించిన ఇళ్లు, సీత గీత దాటిన విధంగా పేర్కొంటున్నారు.
కాబట్టి వాస్తుశాస్త్రజ్ఞులు గృహాలను నిర్మించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా వారు మనకు సూచిస్తున్నారు.
అదెలా అంటే.. ఒకవేళ మీ ఇళ్లు ‘ఎల్’ ఆకారంలో వుందనుకుంటే.. అందులో వున్న గదులు అదే ఆకారంలో నిర్మించడం అంత మంచిది కాదు. ఎందుకంటే.. రెండు ఎల్ షేప్ లు కలవడంతో దీర్ఘచతురస్రాకారం ఏర్పడుతుంది.
అయితే ఇలా కేవలం ఎల్ ఆకారం మాత్రమే అసంపూర్ణత చిహ్నంగా వాస్తుశాస్త్రంలో నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి ఆకారాలలో ఇళ్లను నిర్మించుకోవడంతో.. మన గృహాలకు సమయానికి అందించే ప్రకృతి సిద్ధమైన శక్తులు దూరం అవుతున్నాయని వాస్తుశాస్త్రాల్లో వున్నట్టు వారు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ మీ ఇళ్లు ఇప్పటికే ఎల్ ఆకారంలో వుంటే దానిని దీర్ఘచతురస్రం వచ్చేలా స్థలానికి ఒక మూల మొక్కను లేదా ఏదైనా ఒక పోల్ ను నిర్మించుకోవడం చాలా మంచిది. ఇలా చేస్తే కొంతవరకు దుష్ర్పభావాలు చాలావరకు దూరమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
కాబట్టి కొత్తగా ఇంటినిర్మాణం చేపట్టినవారు చతురస్రం లేదా దీర్ఘచతురస్రం ఆకారం కలిగి వుండేలా చూసుకుంటే చాలా మంచిది.
(And get your daily news straight to your inbox)
Jun 11 | గృహాలంకరణలో భాగంగా రంగులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇంటిలోపల, బయట అనుకూలమైన రంగులు వేయిస్తే... ఆ ఇల్లు ఎంతో అందంగా, ఆకర్షణీయంగా, ఉత్సాహకరంగా కనిపిస్తుంది. ప్రస్తుతకాలంలో ఎన్నో కొత్తరకాల రంగులు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.... Read more
May 13 | సాధారణంగా కొత్త ఇంటి నిర్మాణాలను చేపట్టేముందు ప్రతిఒక్కరు తమకు అనుగుణంగా అన్ని కార్యక్రమాలను ముగించుకుంటారు. ఆధ్యాత్మిక సలహాలను కూడా పండితులు లేదా జ్యోతిష్య నిపుణుల నుంచి తీసుకుంటారు. కానీ కొన్ని సందర్భాలలో వాటి అమరికను... Read more
May 01 | ప్రతిరోజు అందరు ఉదయాన్నే లేవగానే రోజువారీ కార్యక్రమాలు ముగించుకున్న తరువాత స్నానాలు చేసుకుంటారు. ప్రతిరోజు స్నానాలు చేయడంతో ఆరోగ్యంగా వుండటమే కాకుండా.. మన అందాన్ని మరింత పెంపొందించుకోవచ్చు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు... Read more
Apr 28 | సాధారణంగా ప్రతిఒక్కరికి కలలు రావడం సహజమే. కానీ అందులో కొన్ని కలలు శుభం కలిగిస్తాయని, మరికొన్ని కలలు అశుభ కలిగిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్య నిపుణులు. ఇవి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరికి వస్తుంటాయి.... Read more
Apr 25 | ప్రస్తుతకాలంలో ప్రతిఒక్కరు ప్రతి చిన్న విషయంలో కూడా మానిసక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఆర్థికపరంగా సమ్యలు, ఉద్యోగాలు దొరకకపోవడం, విద్యార్థులు సరిగ్గా చదవకపోవడం, నిర్వహించిన పనులు సరిగ్గా జరగకపోవడం, శుభకార్యాలు అస్మాత్తుగా నిలిచిపోవడం, ఆస్తులకు సంబంధించిన... Read more