Experts Suggesting To Take Super Healthy Foods Which Prevent Different Types Of Diseases | Home Remedies | Best healthy Fruits

Super healthy foods which prevent different types of diseases home remedies

healthy fruits, fruits remedies, fruits home tips, healthy home remedies, healthy diseases remedies, best fruits tips, fruit juices benefits, fruits health benefits

Super Healthy Foods Which Prevent Different Types Of Diseases Home Remedies : Experts Suggesting To Take Super Healthy Foods Which Helps to Prevent Different Types Of Diseases

ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ తో కలిగే ప్రయోజనాలు

Posted: 10/03/2015 04:02 PM IST
Super healthy foods which prevent different types of diseases home remedies

పోషకాహారలోపం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల్ని అధిగమంచాలంటే.. ప్రకృతి సహజంగా లభించే ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకుంటే ఎంతో శ్రేయస్కరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందులో వుండే పోషక విలువలు వ్యాధుల్ని నిర్మూలించడంతోపాటు నిత్యం ఆరోగ్యంగా వుంచుతాయి. మరి.. ఆయా ఫ్రూట్స్ లో వుండే పోషకాలేంటో.. వాటితో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..

* కొలెస్ట్రాల్‌ను తగ్గించగల పీచుపదార్థం గంగ రేగు పళ్ళలో, యాపిల్స్‌లో ఎక్కువగా లభించగలవు. రోజుకు అవసరమైన పీచులో నలభై శాతం ఈ పండ్ల నుంచి లభిస్తుంది. పీచుపదార్థాలు ఎక్కువగా తినేవారిలో కొలెస్ట్రాల్ స్థాయి తక్కువగా ఉంటాయి.
* బొప్పాయిలోని పపెయిన్ ఎంజైమ్ జీర్ణశక్తికి బాగా సహకరిస్తుంది. ఒక కప్పు జామపండు ముక్కల్లో లభించే విటమిన్ సి రోజువారీ అవసరానికంటే ఐదు రెట్లు ఎక్కువ వుంటుంది. మధ్యస్తంగా ఉండే కమలాపండులో కంటే ఇది ఎక్కువగా ఉంటుంది.
* విటమిన్ సి అధికంగా వుండే పండ్లు తినే మహిళల్లో చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు మిగతావారికంటే తక్కువగా వుంటాయి. బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తి కూడా లభిస్తుంది.
* బొప్పాయి, పుచ్చపండ్లలో బీటా క్రిపొక్సాంథిన్ గుణాలు ఎక్కువగా వుంటాయి. ఇవి లంగ్ క్యాన్సర్ నుంచి కాపాడతాయి. ఇతర రకాల క్యాన్సర్ల నుంచి కాపాడే లికోపెన్లు లభిస్తాయి.
* గుండెను పరిరక్షించుకోవాలంటే.. ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ద్రాక్ష, లిచీ పండ్లలో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పాలిపినాల్స్ అధికంగా ఉంటాయి.
* బ్రెస్ట్ క్యాన్సర్‌కు చెక్ పెట్టాలంటే లిచీలు ఉపయుక్తమైనవి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది.
* క్యాన్సర్ వంటి వ్యాధులను అరికట్టడంలో పాలిఫినాల్స్ బాగా పనిచేస్తాయి.
* రక్తపోటును తగ్గించగల పొటాషియం అత్తి, అరటిపండ్లలో లభిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : healthy fruits  super healthy foods  cancer remedies  heart home tips  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more