The materials are more likely to eat chilli is good for health | Spicy Food Items | Health Tips

Spicy foods good for health china survey home remedies

spicy foods, health tips, home remedies, best remedies, longer life tips, long life remedies, tips for health, healthy home remedies, best tips for health, spicy food recipes, spicy recipes for health

Spicy Foods Good For Health China Survey Home Remedies : According to the china survey it has been cleared that by eating materials are more likely to eat chilli is good for health.

కారం పదార్థాలు తింటే.. ఆరోగ్యానికి మహాభాగ్యం!

Posted: 09/04/2015 01:57 PM IST
Spicy foods good for health china survey home remedies

కారం ఎక్కువగా వుండే పదార్థాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తుంటారు. ఎందుకంటే.. కారం తింటే కడుపుమంట, పేగు పుండుపడటం, గుండె మండటం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తదితర సమస్యలు వస్తాయి. అందుకే.. వంటకాల్లో కారం మోతాదును చాలావరకు తగ్గించి, తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ.. కారం ఎక్కువ వుండే పదార్థాలు ఓ మోతాదులో రెగ్యులర్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మహాభాగ్యం కలుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చప్పగా వుండే తిండిని తివేవారికంటే.. కారం తినేవారే కాస్త ఎక్కువ రోజులు బతుకుతున్నారని ఆ నివేదికల్లో వెల్లడైంది. నిజానికి కారం కాస్త ఇబ్బంది కలిగించినా.. లైఫ్ కి మాత్రం అది ఆసరాగా వుంటుందని అంటున్నారు.

ఈ విషయంపై చైనాలో జరిపిన సర్వేపై బిఎంజే జర్నల్ విశ్లేషణ చేసింది. చైనాలో 30 నుంచి 79 యేళ్ళ వయస్సున్న ఐదు లక్షల మందిపై పరిశోధన చేశారట. 2004 నుంచి 2008 మధ్యలో ఉన్న వారిపై ఈ అధ్యయనం చేస్తే 4.90 లక్షల మందిని పరిశీలిస్తే 20, 000 మాత్రమే మరణించారట. కారం, మిరియాలు వంటివి ఎక్కవగా తిన్న వారిలో మరణాల సంఖ్య తక్కువగా ఉందట. ‘ఏం కారం తినేవారు చచ్చిపోరా’ అంటే అలా కాదు. అలాగని రోజూ గొడ్డుకారం తినమని ఎక్కడా చెప్పలేదు. తగిన మోతాదులు సాధారణంగా తీసుకుని, కారం గురించే ప్రస్తావించారు. మరణాల సంఖ్య కారం తినని వారితో పోల్చితే కారం తినే వారిలో తక్కువగా ఉందని స్టడీలో తేలింది.

వారానికి రెండుసార్లు మాత్రమే కారం తినేవారితో పోల్చినప్పుడు.. రోజూ కారం తినేవారిలో 10 శాతం మరణించే అవకాశం తగ్గిందని తేల్చారు. ఇందులో ఆడ, మగ అనే భేదం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అదే సమయంలో ఎండుకారం కంటే పచ్చిమిరప మరింత మేలు చేస్తుందని వెల్లడయ్యింది. అయితే ప్రపంచ శాస్త్రవేత్తలు మాత్రం చైనాలోని పరిసరాలు, ప్రాంతాలు, అక్కడి సాంప్రదాయ వంటల వలన అలా జరిగి ఉండవచ్చునేమోగానీ అన్ని చోట్ల దాని ఫలితాలను నమ్మడానికి లేదని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spicy foods  health tips  home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more