Healthy Home Foods For Stomach Ulcer | Ulcer Remedies | Stomach Problems Tips

Healthy home foods stomach ulcer remedies best medicines

ulcer remedies, stomach ulcer tips, stomach uler foods, ulcer healthy foods, ulcer foods items, healthy foods for ulcer, stomach problems remedies, ulcer home foods, ulcer home remedies

Healthy Home Foods Stomach Ulcer Remedies Best Medicines : Experts Giving Some Healthy Home Foods To Get Rid From Stomach Ulcer.

ఆరోగ్యకరమైన ఆహారంతో అల్సర్ కు చెక్

Posted: 08/27/2015 12:23 PM IST
Healthy home foods stomach ulcer remedies best medicines

కడుపులో నొప్పి, తీవ్రమైన మంట, ఇంకా ఇతర కడుపు సంబంధిత వ్యాధులు వస్తే వాటిని ‘అల్సర్’గా గుర్తిస్తారు. సమయానికి భోజనం తినకపోవడం వల్లే ఈ సమస్య బారిన పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఎక్కువ కారంగా వుండే పదార్థాలు తినడం వలన కూడా అల్సర్ ఏర్పడుతుందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ వ్యాధి వచ్చినప్పుడుల్లా తీవ్ర నొప్పిని భరించాల్సి వస్తుంది. ఎంతో బాధ కలిగించే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే.. ఆరోగ్యకరమైన ఆహారమే మంచి మందు అని నిపుణులు అంటున్నారు. మరి.. ఆ ఆహారాలేంటో తెలుసుకుందామా...

అరటి పండ్లు కడుపులోని అల్సర్లకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ పదార్థం కడుపులో వచ్చే పుండ్లు పెరగకుండా చేస్తుంది. విటమిన్ పుష్టిగా దొరికే బాధం, చేపలు వంటివి కూడా అల్సర్లను దరిచేరనీయ్యవు. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలుండే కొబ్బరి నూనె వాడడం వల్ల కడుపులో వచ్చే పుండ్లు మానతాయి. అందుకే వెజిటబుల్ ఆయిల్స్‌కి బదులుగా కొబ్బరి నూనె వాడడం మంచిది. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్ల రసాలను తాగడం ద్వారా అల్సర్ల నొప్పి నుంచి బయటపడొచ్చు. వెల్లుల్లి తినడం వల్ల ఉపశమనాన్ని పొందవచ్చు. వెల్లుల్లికి కడుపు మంటని తగ్గించే గుణం ఉంటుంది. భోజన సమయంలో కొంచెం వెల్లుల్లి తింటే కూడా అల్సర్ తగ్గుతుంది.

ఒక కప్పు మెంతికూర ఆకులను నీళ్లలో బాగా ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు చేర్చి... ఆ నీటిని గోరు వెచ్చగా చేసి ప్రతి రోజూ రెండు సార్లు తాగాలి. ఇలా చేస్తే ఎటువంటి అల్సర్ అయినా మటుమాయమవుతుంది. ఈ విధంగానే క్యాబేజీ రసం తాగడం వల్ల కూడా కడుపులోని అల్సర్లు త్వరగా తగ్గిపోతాయి. అయితే ఈ రసాన్ని పడుకోబోయే ముందు తాగాలి. అలాగే ప్రతి రోజూ పొద్దున్నే అల్పాహారంతోపాటు ఒక చెంచా తేనె తాగితే.. ఈ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : stomach ulcer tips  home remedies  healthy foods  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more