కొందరు స్థూలకాయంతో బాధపడుతుంటారు. క్రమక్రమంగా బరువు పెరుగుతుండటంతో వారి శరీరాకృతి పూర్తిగా మారిపోవడంతోపాటు అందం విహీనంగా తయారవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బరువును తగ్గించుకోవడానికి మందులు వేసుకోవడం, వ్యాయామాలు చేసుకోవడం కంటే.. డైట్ ప్లాన్ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ‘7 డేస్ డైట్ ప్లాన్’ తూ.చ.తప్పకుండా పాటిస్తే.. 3-4 కిలోల బరువు తగ్గవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పోషకాలతో నిండిన ఆహారాల్ని ఓ వారం రోజులపాటు తీసుకుంటే బరువు తగ్గడం ఖాయమని వారంటున్నారు. మరి.. ఆ డైట్ ప్లాన్ ఎలా పాటించాలి? ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి? అన్న విషయాలు తెలుసుకుందామా..
డే-1 : శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపాలంటే పళ్ళతో విందు ఆరగించడం మంచి మార్గం. పళ్ళ డైట్ అంటే బోలెడన్ని పళ్ళు తినేయడం కాదు.. రోజు మొత్తం మీద నాలుగు ఆపిల్స్, నాలుగు ఆరంజ్‌లు, రెండు దానిమ్మ, ఒక వాటర్ మెలన్ పండు తదితర ఫ్రూట్స్ మాత్రమే తీసుకోవాలి. జ్యూస్ తయారుచేసుకుని అస్సలు తీసుకోకూడదు. ఈ పళ్లు తీసుకున్న తర్వాత పది గ్లాసుల నీరు తాగాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలుపుకుని త్రాగాలి.
డే-2 : రెండో రోజులో కేవలం కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. వాటిని నేరుగా పచ్చిగాగానీ, లేదా సలాడ్స్ రూపంలోగానీ, అలా కుదరకపోతే ఉడకబెట్టిగానీ తీసుకోవచ్చు. అవి చప్పగా వుంటాయి కాబట్టి.. తినేటప్పుడు వాటి మీద చిటికెడు ఉప్పు కొద్దిగా మిరియాల పొడి చల్లుకుని తీసుకుంటే రుచిగా వుంటుంది. ఉదయమే గ్లాసు గోరువెచ్చని నీరుతాగిన తరువాత ఉడికించిన బంగాళాదుంప తీసుకోవాలి. అదే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుంది. లంచ్, డిన్నర్‌కి పచ్చి లేదా ఉడికించిన కూరగాయలు తినాలి.
డే-3 : మూడో రోజు ఆహారంగా పది అరటిపండ్లు, మూడు గ్లాసుల పాలు, గిన్నెడు డైట్ సూప్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఈ కొద్దిపాటి ఆహారంతో ఆకలి తీరలేదని అనిపిస్తే.. అప్పుడు చాలా తక్కువ మొత్తంలో అన్నం తీసుకుంటే ఫర్వాలేదు. అన్నానికి బదులు గోధుమ లేదా జొన్న రొట్టె తీసుకుంటే ఇంకా మంచిది. వీటితోపాటు నీరు తాగే శాతాన్ని కొద్దిగా పెంచండి. పది గ్లాసులు కాకుండా పన్నెండు గ్లాసుల నీరు తాగితే మంచిది. రోజంతా కేవలం ఈ ఆహారం మాత్రమే తినాలి.
డే-4 : నాలుగో రోజు ఆహారంగా పళ్ళు, కూరగాయలు తీసుకోవాల్సి వుంటుంది. కూరగాయలను వెన్న లేదా నూనె వేసి తయారు చేసినవి ఎట్టిపరిస్థితుల్లోనూ తినకూడదు. పచ్చివి తింటే మరీ మంచిది. అలా కాకుండా ఉడకబెట్టినవి కూడా తీసుకోవచ్చు. ఈ నాలుగోరోజులో పన్నెండు గ్లాసుల నీరు తప్పకుండా తాగాల్సి వుంటుంది. వీటితోపాటు పళ్ళు, కూరగాయలు కలిపి తయారు చేసుకున్న సలాడ్‌ను తీసుకోవచ్చు. కానీ.. పళ్ళ జ్యూస్‌ల నుంచి దూరంగా వుండాలి.
డే-5 : ఐదోరోజు ఆహారంగా పళ్ళు, కూరగాయలతోపాటు చిన్న గిన్నెడు బ్రౌన్‌రైస్, చిన్న కప్పు పప్పు, గ్లాసు పలుచని మజ్జిగా తీసుకోవాలి. ఈ రోజు కనీసం ఆరు టమోటాలు, రెండు ఆపిల్స్, రెండు ఆరంజ్ పళ్ళు తీసుకుంటే.. ఎంతో శ్రేయస్కరం. వీటితోపాటు ప్రతిరోజూలాగే సలాడ్‌ను తీసుకోవచ్చు. ఈ రోజు తాగే నీటి కోటాను ఇంకా కొద్దిగా పెంచండి. మరో రెండుగ్లాసుల నీరు అదనంగా అంటే మొత్తం పద్నాలుగు గ్లాసుల నీరు తాగాలి. ఆకలిగా అనిపించినా ఇతర ఆహారాలు తీసుకోకూడదు.
డే-6 : ఈ ఆరవరోజున ఇదివరకు రోజుల్లో పాటించిన డైట్ ప్లాన్లలో ఏదో ఒకదానిని పాటిస్తే సరిపోతుంది. అయితే.. తాగే నీరు కోటా తగ్గకుండా కాస్త పెరిగేలా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అవసరమైతే.. అదనంగా ఓ కప్పు గ్రీన్ టీని చేర్చుకోవచ్చు. కానీ.. కాఫీ, టీ వంటివాటికి మాత్రం దూరంగా వుండాల్సి వుంటుంది. ఇక సలాడ్స్ షరామామూలే. ఆకలి ఎక్కువగా అనిపించినా.. ఇతర చిరుతిండ్లు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోకూడదు. లేకపోతే ప్రయోజనం వుండదు.
డే-7 : డైట్ ప్లాన్ లో ఈ చివరిరోజున ఇష్టమైన కూరగాయలను, చిన్ని గిన్నె పప్పు, బ్రౌన్‌రైస్‌తో కలిపి ఉడికించుకుని తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. వీటితోపాటు గ్లాసు పలుచని పాలు, చిన్న గిన్నె సలాడ్‌ను కూడా తీసుకోండి. ఈ రోజు మాత్రం ఓ గ్లాసు తాజా పళ్ళరసాన్ని చక్కెర లేకుండా తాగండి. ఇలా ఈ విధంగా ఈ ఏడురోజుల డైట్ ప్లాన్ ని తూ.చ.తప్పకుండా పాటిస్తే.. ఖచ్చితంగా 3-4 కిలోల బరువు తగ్గించుకోవచ్చు.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more