The Health Benefits Of Munaga Leaves and Drumsticks | Health Home Remedies | Health Tips

Munaga leaves drumsticks health benefits home remedies

munaga leaves, drumsticks, drumsticks health benefits, drumsticks nutrients, drumsticks recipes, drumsticks healthy foods, healthy food items, health tips, munaga leaves health benefits, munaga leaves health tips

Munaga Leaves Drumsticks Health Benefits Home Remedies : The Health Benefits Of Munaga Leaves and Drumsticks which contains more number of nutrients.

మునక్కాయా మజాకా..?

Posted: 06/22/2015 03:27 PM IST
Munaga leaves drumsticks health benefits home remedies

సాధారణంగా ప్రతిఒక్కరి నిత్యజీవితంలో అనేక వ్యాధులు సంభవిస్తుంటాయి. దగ్గు, జలుబు, నొప్పులు.. ఇలా ఎన్నోరకాల చిరువ్యాధులు నిత్యం వెంటాడుతూనే వుంటాయి. ఇటువంటి సమస్యల నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే ప్రతీసారి ‘క్లినిక్’కి వెళ్ళాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే.. అటువంటి వ్యాధులను నయం చేసే శక్తి ‘మునక్కాయ’లో వుందని వారంటున్నారు. కొన్ని వందల శారీరక రుగ్మతలు ‘మునగ’వల్ల నయమవుతాయని కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. అందుకే.. నిత్యం ఆరోగ్యంగా వుండాలంటే ‘మునగ’ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్నిరకాల పోషక పదార్థాలు ‘మునగ’లో పుష్కలంగా వున్నాయి. విటమిన్‌ ఎ, సి, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు ఇందులో ఎక్కువ మోతాదులో నిల్వవుంటాయి. అవి వివిధ రకాల వ్యాధులతో పోరాడి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తాయి. కేవలం మునక్కాయలోనే కాదు.. మునగ ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలు వుంటాయి. అందుకే.. వాటిని వంటల్లో వినియోగిస్తారు. పచ్చటి ఆకులే కాక కొంచెం నీడలో ఎండబెట్టి, పొడిచేసి నిలువ కూడా వుంచుకోవచ్చు. అవసరమైనపుడు సంవత్సరం పొడవునా అందుబాటులో వుంటుంది. అయితే.. ఇలా పొడిచేసిన ఆకుల్లో సి విటమిన్‌ తప్ప మిగిలిన పోషకాలేవీ నశించవు.. తగ్గవు. వందగ్రాముల ఆకుల్లో కాల్షియం - 440 మిల్లీ గ్రాములు, ఇనుము- 0.85 మి.గ్రా, బీటా కెరోటీన్లు అధికంగా వుంటాయి.

మునక్కాయ ఎముకల్ని బలంగా ఉంచుతుంది. ఇందులో ఐరన్, క్యాల్షియం ఎముకల్ని బలపరుస్తుంది. పిల్లల పెరుగుదలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా చక్కెర స్థాయిల్ని స్థిరంగా ఉంచుతుంది. తద్వారా డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. వీటిలోని విటమిన్ సి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. లైంగిక వ్యాధులను దూరం చేయడంతోపాటు లైంగిక సామర్థ్యాన్ని మునక్కాయ పెంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి.. రెగ్యులర్ డైట్ లో మునగను చేర్చుకుంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : drumsticks  munaga leaves  health tips  healthy home remedies  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more