మానవ శరీరంలో వుండే అత్యంత ముఖ్యమైన భాగం ‘‘గుండె’’. ఇది శరీరంలో వుండే చెడు రక్తాన్ని మంచిగా మార్చి, నరాలలోకి పంపింగ్ చేస్తుంది. ఇది నిరంతరం ఒక యంత్రంలా పనిచేస్తుంది. సాధారణంగా ప్రతిఒక్కరిలో ఇది నిముషానికి 72 సార్లు కొట్టుకుంటుంటుంది.
శాస్త్రీయ పరిశోధనల ప్రకారం గుండెపోటు రావడానికి కొన్ని ముఖ్యమైన కారణాలను శాస్త్రజ్ఞులు వెల్లడించారు. అవేమింటే... ఎక్కువగా పొగత్రాగడం, మధుమేహవ్యాధి, గుండెలో వుండే రక్తనాళాలలో కొలెస్టిరాల్ స్థాయి పెరగడం, అధిక రక్తపోటు జరగడం.
గుండెపోటు ఆడ, మగ, పిల్లలు, వయస్సు వంటి తేడా ఏమీలేకుండా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరకంగా సంభవిస్తుంది. ముఖ్యంగా మధ్యవయస్కులవారికి ఈ గుండెపోటు సంభవించవచ్చునని పరిశోధనల ద్వారా వెల్లడైంది.
ఎక్కువగా మానసిక స్థితికి గురయినప్పుడు, ఒత్తిడి వున్న పనులను నిర్వహించడం ద్వారా ఈ వ్యాధి వచ్చే అవకాశం వుంది. మనిషి ఎల్లప్పుడూ దిగులుగా వున్నప్పుడు రక్తపోటు ఎక్కువగా జరుగుతుంది. అటువంటి సమయాల్లో గుండెపోటు సంభవించవచ్చు.
కొంతమంది తమ నోటిలో వుండే దుర్వాసనను తొలగించడానికి, చిగుళ్లను పోగొట్టుకోవడానికి ప్రతిరోజు ‘‘మౌత్ వాష్’’ చేసుకుంటుంటారు. కానీ ఇది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే.. ఇందులో అధిక మోతాదులో వుండే క్లోరోహైక్సిడైన్ రసాయనం శరీరంలో వుండే మంచి సూక్ష్మక్రిములను నిర్మూలిస్తుందని లండన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో వెల్లడించారు. అంతేకాదు.. ఆ రసాయనం గుండెకు కూడా హాని కలిగిస్తుందని వారు తెలిపారు.
ప్రతి నలుగురు మగాళ్లలో ఒక్కరికి, ప్రతి పదిమంది మహిళలలో ఒక్కరికి రాత్రివేళ నిద్రపోయే సమయంలో గురక పెట్టే అలవాటు వుంటుంది. దీంతో కూడా గుండెపోటు సంభవించవచ్చునని పరిశోధకులు అంటున్నారు.
గుండెపోటు నుంచి నివారణ పొందే కొన్ని అంశాలు :
సహజంగా మానవులు నిరంతరం నవ్వుడూ వుండడం వల్ల అతనిలో వుండే మానసిక ఒత్తిడి, దిగులు వంటివి దూరం అవుతాయి. అటువంటి సమయాల్లో శరీరంలో రక్తప్రసరణ సరైన స్థాయిలో ప్రసరిస్తుంది. అంతేకాదు... నవ్వుతూ వుండటం వల్ల శరీరంలో బాధను నివారించే ఎండోర్ ఫిన్ అనే పోషకం విడుదల అవుతుంది. దీంతో చాలావరకు గుండెపోటు నుంచి బయటపడవచ్చునని శాస్త్రీయరంగంలోనే కాకుండా వైద్యరంగంలో కూడా రుజువైంది. కాబట్టి ప్రతిరోజు నవ్వుతూ, ఎటువంటి ఒత్తిడి లేకుండా వుండేందుకు ప్రయత్నించండి.
ప్రతిరోజు తీసుకునే ఆహారంలో నూనె స్థాయి తక్కువగా వుండేటట్లు చూసుకోవాలి. నూనెలో వుండే కొలెస్టిరాల్.. గుండెలో వుండే రక్తనాళాలలో పేరుకుపోయి, రక్తప్రసరణ పద్ధతి ఆగిపోతుంది. వీలైనంతవరకు కొలెస్టిరాల్ తక్కువగా వున్న నూనె, ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెపోటు సంభవించకుండా జాగ్రత్త పడవచ్చు.
విటమిన్ ‘సి’ ఎక్కువగా వుండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. గుండెపోటుకు సంబంధించిన తగిన వ్యాయామలు కూడా వున్నాయి. ప్రతిరోజు లేవగానే వ్యాయామం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా ఆహ్లాదకరమైన కార్యకలాపాలలో పాల్గొనడానికి ముందుండాలి.
ప్రతిరోజు సాధ్యమైనంతవరకు 2 వేల అడుగుల దూరం వరకు నడిస్తే.. శరీరంలో రక్తప్రసరణ సులభతరం అవ్వడమే కాకుండా, ఎంతో ఆరోగ్యంగా వుండొచ్చు. దీంతో గుండెపోటును నివారించగలుగుతాం.
ఆహార పదార్థాలలో బొప్పాయి పండు తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం. ఇందులో కేలరీలు చాలా తక్కువ స్థాయిలో వుంటాయి.. పోషకాలు అధిక మోతాదులో వుంటాయి. ఇందులో వుండే ఎంజైమును గుండెకు హానికలిగించే కొవ్వు పదార్థాలను తొలగించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. శరీరానికి ఒక ఔషదంలా పనిచేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more
Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more
Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more
Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more
Dec 20 | ఎనర్జీ డ్రింకులు అధికంగా తాగడం వల్ల బ్రెయిన్ హెమరేజ్ (మెదులో రక్తస్రావం) బారిన పడే అవకాశం ఉందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అంతేకాకుండా హృద్రోగాలు, రక్తనాళాల పనితీరు మందగించడం వంటి ఆరోగ్య... Read more