Tips to stop hair loss for men

tips to stop hair loss for men, hair loss for men, baldness, tips to control baldness, baldness for men, baldness for women, health tips, food tips, tips for hair gain, tips to stop hair loss, beauty tips

tips to stop hair loss for men, hair loss for men, baldness, tips to control baldness, baldness for men, baldness for women, health tips, food tips, tips for hair gain, tips to stop hair loss, beauty tips

బట్టతలను నివారించే చిట్కాలు

Posted: 03/06/2014 11:37 AM IST
Tips to stop hair loss for men

పురుషులలో సాధారణంగా జుట్టు రాలే సమస్య అత్యధికంగా వుంటుంది. ఇలా రాలడం వల్ల వాళ్లలో ఏదో ఒక కొరతాగా, లోపంగా వున్నట్లు, రకరకాల భావాలు వారి మనసులో రేకెత్తుతుంటాయి. దీంతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతారు. 

బట్టతల అనేది జన్యపరంగాను లేదా వంశపారంపర్యంగా వచ్చే సమస్య. కొందరికైతే ఈ సమస్య చాలా త్వరగా వస్తుంది... మరికొందరికైతే వృద్ధాప్య దశలో వస్తుంది. వయస్సు పెరుగుతున్నకొద్దీ హార్మోన్ల లోపం వల్ల ఈ సమస్య ఏర్పడడం సహజమే అంటున్నారు నిపుణులు. 

శాస్త్రీయపరంగా చెప్పుకోవాలంటే.. పురుషులలో వుండే ‘‘టెస్టోస్టిరాన్’’ హార్మోన్ వల్ల బట్టతల ఎక్కువగా సంభవిస్తుంది. జన్యుపరమైన కారణాలవల్ల ఈ హార్మోన్ తలమీద వున్న చర్మంలో ‘‘డీ హైడ్రో టెస్టోస్టిరాన్’’గా మారుతూ.. వేకంగా జుట్టు రాలడానికి కారణం అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఈ బట్టతలను నివారించడానికి కొన్ని చిట్కాలను మనకు నిపుణులు అందిస్తున్నారు. అవి... 

ఒక గిన్నెలో గుడ్డుపచ్చసొన, తేనె మిక్స్ చేసిన ఒక మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి మసాజ్ చేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో స్నానం చేసుకోవాలి. 

నీటిలో నానబెట్టిన మెంతులను మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు బాగా పట్టించి, చన్నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా తరుచుగా చేస్తే.. ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. 

ముఖ్యంగా బట్టతల రావడానికి కారణం ‘‘ఆహారంలో సమతుల్యత లేకపోవడం’’ అంటున్నారు నిపుణులు. అందుకే సాధ్యమైనంతవరకు కాల్షియ, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా వున్న ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు. అలాగే జుట్టు తడిగా వున్నప్పుడు దువ్వకూడదు అంటున్నారు. 

ఒక కప్పు ఆవ నూనె (మస్టర్డ్ నూనె)లో నాలుగు చెంచాల గోరింటాకులను వేసి, గోరువెచ్చగా కాచుకొని నిల్వవుంచుకోవాలి. దీనిని తరుచుగా తలకు పట్టించి, మసాజ్ చేసుకుంటే.. కొన్ని వారాలలో ఫలితం లభిస్తుందని చెబుతున్నారు. 

బట్టతల ఏర్పడుతున్న ప్రదేశంలో ఉల్లిపాయ పేస్ట్ లో కొంచెం తేనె కలుపుకుని మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత స్నానం చేసుకోవాలి. ఇది రెగ్యులర్ గా చేసుకుంటే మంచింది. 

హోంమేడ్ షాంపు.. ఇది రెండు చెంచాల పెరుగు, రెండు చెంచాల శెనగపిండి, ఒక చెంచా నిమ్మరసంతో కలిపి చేసుకునే మిశ్రమం. దీన్ని తలకు బాగా పట్టించి, గంటన్నర తరువాత స్నానం చేసుకోవాలి. ఇది ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

ఆమ్లా, శీకాకాయ్, రీలా మొదలైనవాటిని ఒక గిన్నెలో వేసి, రెండు లీటర్ల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. దీనిని కొబ్బరినూనె లేదా అలోవేరా జెల్ తో మిక్స్ చేసి తలకు పట్టించి, మసాజ్ చేసుకోవాలి. ఇలా నాలుగుసార్లు చేస్తే మంచి ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more