Daggubati Rana Planning For Solo Hero Movie With Dance Master Prem Rakshit | Bahubali Part 2 | Rana Bhallaladeva

Daggubati rana planning for solo hero movie with dance master prem rakshit

rana solo hero movie, rana movie updates, bhallaladeva rana, bahubali second part, bahubali movie updates, bahubali movie news, bahubali rana updates, rana solo hero movies, dance master prem rakshit

Daggubati Rana Planning For Solo Hero Movie With Dance Master Prem Rakshit : Daggubati Rana Planning For Solo Hero Movie To Get Huge Hit. This Movie Will Go Floors After Bahubali Part 2 Shooting Complete.

సోలో హీరోగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న రానా

Posted: 10/15/2015 03:15 PM IST
Daggubati rana planning for solo hero movie with dance master prem rakshit

‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నెగెటివ్ రోల్ లో నటించిన దగ్గుబాటి రానా.. ఇప్పుడు మళ్లీ హీరోగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు. నిజానికి రానా ‘లీడర్’ సినిమాతో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత సరైన హిట్ దక్కలేదు. హీరోగా ఇతను నటించిన సినిమాలన్ని దాదాపుగా ఫ్లాప్ అయినవే వున్నాయి. 2012లో రిలీజ్ అయిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమా తరువాత సోలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయని రానా.. ఇతర ఇండస్ట్రీల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి’ చిత్రం ఇతని కెరీర్ ని మలుపు తిప్పేసింది. భల్లాలదేవ పాత్ర ఇతనికి నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతోపాటు ఎందరో ప్రేక్షకాభిమానులను తెచ్చిపెట్టింది. దీంతో.. ఇదే కరెక్ట్ సమయం అని భావించిన రానా.. ఈసారి సోలోగా సెక్స్ సాధించేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాడు.

ప్రస్తుతం బెంగళూర్ డేస్ రీమేక్ లో నటిస్తున్న ఈ ఆరడుగుల ఆజానుభావుడు.. ఆ సినిమా పూర్తవ్వగానే ‘బాహుబలి-2’ షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ రెండు సినిమాలు మల్టీ స్టారర్ లే కావటంతో తరువాత సినిమా సోలోగానే చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం కథ కూడా ఫిక్స్ చేసుకోవడంతోపాటు ఆ చిత్రానికి కొత్త దర్శకుడిని కూడా సిద్ధం చేసుకున్నాడని సమాచారం. లాంగ్ గ్యాప్ తరువాత రానా సోలో హీరోగా తెరకెక్కనున్న సినిమాను కొరియోగ్రాఫర్ గా సూపర్ హిట్లు సాధించిన ప్రేమ్ రక్షిత్ మాస్టర్ డైరెక్ట్ చేయనున్నాడు. రానా బాడీ లాంగ్వేజ్కు తగ్గ యాక్షన్ ఎలిమెంట్స్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతమున్న ట్రెండ్ కు తగ్గట్టు భారీ యాక్షన్ సీన్లతోపాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా వుండేలా రానా కేర్ తీసుకుంటున్నాడట. తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకోవాలంటే సోలో హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాల్సిందేనని రానా ఫిక్స్ అయినట్లు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more

Today on Telugu Wishesh