Aravind Swamy Given Green Signal To Act As Villain In Ram Charans Thani Oruvan Remake Movie | Thani Oruvan Remake | Surender Reddy

Aravind swamy to act villain role in ram charans thani oruvan remake movie

Aravind Swamy news, Aravind Swamy movies, Aravind Swamy thani oruvan, Aravind Swamy thani oruvan latest news, Aravind Swamy updates, ram charan latest news, thani oruvan telugu remake, director surender reddy

Aravind Swamy To Act Villain Role In Ram Charans Thani Oruvan Remake Movie : After Many Actors Finally Aravind Swamy Name Came On News That He Given Green Signal To Act As Villain In Ram Charans Thani Oruvan Remake Movie On Director Surender Reddy's Pressure.

చరణ్ పాలిట విలన్ గా మారనున్న మన్మథుడు

Posted: 10/13/2015 01:37 PM IST
Aravind swamy to act villain role in ram charans thani oruvan remake movie

అరవింద్ స్వామి.. తమిళనాడులో ఒకప్పుడు మన్మథుడిగా పేరుగాంచిన డీసెంట్ హీరో. ‘రోజా’, ‘బాంబే’ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు పొందిన ఈ హీరో హవా అప్పట్లో బాగానే కొనసాగింది. కానీ.. కాలక్రమంలో కొత్త హీరోలు ఒక్కొక్కరుగా ఎంట్రీ ఇవ్వడంతో ఈయన ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. ఒకానొక దశలో ఈయన ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు. ఇక సినిమాల్లో తిరిగి నటించకపోవచ్చుననే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ.. ఇంతలోనే ఈయన ఎవరూ ఊహించని రీతిలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. తమిళంలో ఇటీవల తెరకెక్కిన్ ‘తని ఒరువన్’ చిత్రంలో హ్యాండ్సమ్ విలన్ గా నటించి.. అందరికీ షాకిచ్చాడు. ఆ చిత్రంలో విలన్ గా తన ప్రతిభ కనబరిచి.. అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు తెలుగు రీమేక్ లోనూ ఈయనే రామ్ చరణ్ పాలిట విలన్ గా మారనున్నారని సమాచారం.

తమిళంలో భారీ విజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని రామ్ చరణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే! ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో విలన్ పాత్రకుగాను మంచి ఇమేజ్ వున్న నటుడి కోసం యూనిట్ గాలించింది. తొలుత ఈ సినిమాలో టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున విలన్ గా నటించే అవకాశం వుందని ఆమధ్య ప్రచారాలు చక్కర్లు కొట్టినా.. అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఆ తర్వాత తెరమీదకు రానా పేరొచ్చింది. ఆరడుగుల ఆజానుభావుడైన రానా అయితేనే ఈ చిత్రంలో విలన్ గా సూటవుతాడని, దాదాపు అతడే కన్ఫర్మ్ అయ్యాడని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే.. ఇంతలోనే మాధవన్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం మాధవన్ హీరోగా కాకుండా నటనకు ఎక్కువ ప్రాధాన్యత కలగిన ప్రత్యేక పాత్రల్లోనే నటిస్తూ.. దూసుకుపోతున్నాడు. దీంతో.. ఈ చిత్రంలో అతనిని విలన్ గా నటింపజేస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించి.. అతనిని సంప్రదించినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇంతలోనే ఏమైందో తెలీదు కానీ తాజాగా అరవింద్ స్వామి పేరు వెలుగులోకి వచ్చింది.

తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. తెలుగు రీమేక్ కోసం రామ్ చరణ్ కి విలన్ గా అరవింద్ స్వామినే దర్శకనిర్మాతలు ఒప్పించినట్టు తెలుస్తోంది. తొలుత తెలుగు రీమేక్ లో విలన్ గా నటించేందుకు అరవింద్ నిరాకరించినప్పటికీ.. దర్శకుడు సురేందర్ రెడ్డి ఒత్తిడి మేరకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళంలోలాగే తెలుగులో అదే గుడ్ ఫీల్ రావాలంటే ఆ విలన్ పాత్రలో అరవింద్ నటిస్తేనే బాగుంటుందని నిర్ణయానికి వచ్చిన క్రమంలో దర్శకనిర్మాతలు అతనిని భారీ పారితోషికం ముట్టజెప్పి ఒప్పించి వుంటారని చెప్పుకుంటున్నారు. అయితే.. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అందమైన హీరోగా మాత్రమే ఆయన్ను చూసిన తెలుగు ప్రేక్షకులు... విలన్ గా ఎలా రిసీవ్ చేస్తారో వేచిచూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aravind Swamy  director surender reddy  thani oruvan remake  ram charan  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more