Jagapathi Babu Remembered Shubhalagnam Movie Days After Success Of Srimanthudu | Shruti Hassan | Mahesh

Jagapathi babu remembered shubhalagnam movie days after success of srimanthudu

jagapathi babu, srimanthudu press meet, shruti hassan, mahesh babu, srimanthudu movie, jagapathi babu movies, shubhalagnam movies, koratala siva, rajendra prasad

Jagapathi Babu Remembered Shubhalagnam Movie Days After Success Of Srimanthudu : Jagapathi Babu Remembered Shubhalagnam Movie Days After Success Of Srimanthudu.

‘శుభలగ్నం’ రోజుల్ని గుర్తుచేసుకున్న జగపతి

Posted: 08/13/2015 07:05 PM IST
Jagapathi babu remembered shubhalagnam movie days after success of srimanthudu

హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సాధించిన జగపతి బాబు.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ‘లెజెండ్’ సినిమాలో విలన్ గా నటించిన ఈయనకు ఒక్కసారిగా భారీ క్రేజ్ వచ్చిపడింది. ఆ సినిమాలో ఈయన నటనకు మంచి మార్కులు పడటంతోపాటు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఇక అప్పటినుంచి ఈయనకు వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అటు తమిళనాడు నుంచి కూడా ఈయనకు అవకాశాలు వస్తున్నాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు ఈయన నటించిన పలు సినిమాల్లో ఆయన పాత్రలు యాడెడ్ అడ్వాంటేజ్ గా నిలిచాయి. ఇక తాజాగా వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమాలోనూ మహేష్ కి తండ్రిగా నటించిన జగపతికి ప్రశంసల వెల్లువ కురుస్తోంది.

తండ్రి-కొడుకుల బంధం ఓ బలమైన సబ్‌ప్లాట్‌లో ఉన్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో జగపతి బాబు పాత్ర బాగా ఆకట్టుకుంటుందని, ఆయన క్యారెక్టర్ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ తీసుకొచ్చిందని సినీవర్గాల్లో చెప్పుకుంటున్నారు. తనకు ఈ విధంగా మంచి కాంప్లిమెంట్స్ రావడంతో జగపతి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఇంతపెద్ద విజయం సాధించడం పట్ల చాలా తనకు చాలా సంతోషంగా వుందని ఆయన తెలిపారు. తాను హీరోగా నటించిన ‘శుభలగ్నం’ సినిమాకు వర్షాకాలంలోనూ ఫ్యామిలో ఆడియన్స్ బ్రహ్మ్రరథం పట్టారని, ఈ సినిమాకు అంతకుమించి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు రావడం చూశాక ఆ రోజులు గుర్తొస్తున్నాయని తెలిపారు. ఈ సినిమాలో మహేష్ కు తండ్రిగా నటించినందుకు తనకు ఆనందంగా వుందని ఆయన పేర్కొన్నారు.

ఇక సినిమా విషయానికి వస్తే.. మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో జగపతి బాబు పాల్గొని తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jagapathi babu  srimanthudu press meet  

Other Articles

  • Harish shankar on allu arjun dj

    డీజే బన్నీకి ఓ గబ్బర్ సింగ్

    Jun 17 | రవితేజ తో మొదటి సినిమా తీసి ‘షాక్’ తగిలించుకున్న వర్మ శిష్యుడు హరీష్ శంకర్. రెండో మూవీ గబ్బర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ను అందుకోవటమే కాదు.. దాదాపు పదేళ్లుగా పవన్ అభిమానులు... Read more

  • Naga shourya very happy for his movie abbayitho ammayi hit

    అమ్మాయిల హార్ట్ చోరీ చేసిన "అబ్బాయి"

    Jan 06 | "పక్కింటి కుర్రాడే" అనిపించే లుక్స్... "మనలాగే ఆలోచిస్తున్నాడే" అని ప్రతీ అబ్బాయి రిలేట్ చేసుకునేలా పెర్ఫార్మెన్స్... వరుస సినిమాలు, వరుస హిట్లు, సినిమా సినిమా కీ వేరియేషన్, పాత్ర - పాత్ర కీ వెరైటీ...... Read more

  • Star music director devi sri prasad talks about his film offers as hero

    ‘హీరోగా సెట్ అయ్యే కథ ఇంకా దొరకలేదు’

    Nov 24 | దక్షిణాది సినీపరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దేవీశ్రీప్రసాద్.. కథానాయకుడిగా పరిచయం కానున్నాడనే వార్తలు గతంలో బాగానే చక్కర్లు కొట్టాయి. ఇప్పటికీ ఆయా సందర్భాల్లో ఆ వార్తలు వినిపిస్తూనే వున్నాయి.... Read more

  • Music director ghibran to compose songs to venkatesh maruthi combination movie

    క్రేజీ కాంబినేషన్ చిత్రానికి గిబ్రాన్ బ్యాండ్ బాజా

    Nov 20 | ప్రస్తుతరోజుల్లో ప్రేక్షకులు సినిమాల్లో కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కేవలం కథ మాత్రమే కాదు.. మ్యూజిక్ లో కొత్త బీట్స్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అవే డప్పులు, అదే పాత స్టైల్లో వుండే పాటలు కాకుండా.. నేటి... Read more

  • Junior ntr planning to remake ajiths vedalam movie to get huge success in tollywood

    ఆ సినిమా రీమేక్ పై కన్నేసిన యంగ్ టైగర్

    Nov 19 | కోలీవుడ్, బాలీవుడ్ లలో భారీ హిట్లు సాధించిన సినిమాలను రీమేక్ చేయడంపై తెలుగు హీరోలు ఇటీవల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కెరీర్ కాస్త గాడిలో పడిన స్టార్ హీరోలే ఈ తరహా ఆలోచనలు... Read more