The Mythological Story Of Pulomudu Who Lust On Beautiful Married Woman Puloma | Telugu Mythological Stories

Mythological story of pulomudu loved beautiful girl puloma

mythological stories, telugu mythological stories, pulomudu mythological story, pulomudu loves puloma story, pulomudu puloma love story, hindu gos mythological stories

Mythological Story Of Pulomudu Loved Beautiful Girl Puloma : The Mythological Story Of Pulomudu Who Lust On Beautiful Married Woman Puloma And Also Pregnant.

గర్భిణిని కామించిన పులోముడి గాధ

Posted: 10/07/2015 05:46 PM IST
Mythological story of pulomudu loved beautiful girl puloma

పూర్వం ‘పులోమ’ అనే అతిలోక సౌందర్యవతి వుండేది. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడైన ‘పులోముడు’ అనే దైత్యుడు.. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా అనుకున్న వెంటనే తన మనోరథాన్ని పులోమ తండ్రికి తెలిపాడు. అయితే.. పులోముడు రాక్షసప్రవృత్తికి చెందినవాడు కావడంతో అతనికిచ్చి వివాహం చెయ్యడానికి ఆమె తండ్రి నిరాకరించాడు. అప్పటి నుండి అతనికి పులోమ మీద వ్యామోహం అలాగే వుండిపోయింది. అయితే.. ఈ వ్యవహారాలేవీ పులోమకు తెలియవు. కొన్నాళ్ల తర్వాత పులోమ వివాహం భృగు మహర్షితో జరిగిపోయింది. అన్యోన్యంగా జీవితం కొనసాగించిన తమ దాంపత్య సంసార మథనంలో పులోమ గర్భవతి అయింది.

ఒకరోజు.. నిత్యకర్మానుష్టానానికి భృగువు మహర్షి నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ విషయాన్ని గ్రహించిన పులోముడు.. ఎలాగైనా పులోమను అపహరించి తీసుకుపోవాలనే ఆలోచనతో ఆశ్రమానికి వచ్చాడు. ఒంటరిగా వున్న పులోమను తీసుకెళ్లేందుకు అతగాడు ఆమెవైపు అడుగులు వేయగా.. అగ్నిహోత్ర గృహంలో ఉన్న అగ్నిదేవుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. అది చూసిన పులోముడు ఏమాత్రం భయపడకుండా.. ‘అగ్నిదేవా, నేను మనసుపడ్డ ఈ పులోమ నీ సంరక్షణలో వుందని అర్థమైంది. అయినా నాకు భయం లేదు. నీవు పాపరహితుడవు అనే ఉద్దేశ్యంతో నిన్నో ధర్మ సందేహం అడుగుతాను. తీరుస్తావా ’ అని ప్రశ్నించగా.. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. అప్పుడు పులోముడు మాట్లాడుతూ.. ‘నేను ఈ పులోమను నా మనస్సాక్షిగా వరించాను. కానీ ఈమె తండ్రి నాకు విరుద్ధంగా ఆమెను భృగువుకిచ్చి వివాహం చేసాడు. ఇప్పుడు చెప్పు.. ఈ పులోమ నా భార్యా? భృగువు భార్యా?’ అని గద్దించాడు. అప్పుడు అగ్నిదేవుడు అతనికి సమాధానం చెబుతూ.. ‘నీవు మనసుపడ్డ పులోమ ఈమెయే. కానీ.. నువ్వు విధి పూర్వకంగా ఈమెను వివాహమాడలేదు. వేదోక్త క్రియాకలాపంతో, శాస్త్ర పూర్వకంగా నేను సాక్షీభూతుడనై ఉండగా భృగువు ఈ పులోమను వివాహం చేసుకున్నాడు. ఈమె భృగువుకు ధర్మబద్ధమైన ధర్మపత్ని. పైగా పూర్ణ గర్భవతి. ఈమెను కామ దృష్టితో చూడడం మహా పాపం. బలముందనే గర్వంతో అధర్మానికి సిద్ధపడితే అంతమైపోతావు’ అని హెచ్చరించాడు.

అగ్నదేవుడు హెచ్చరికకు ఏమాత్రం భయపడని పులోముడు.. వెంటనే భీకర వరాహరూపం ధరించి, పులోమను ఎత్తుకుని ఆకాశానికి ఎగిరాడు. ఆ వేగానికి పులోమ గర్భంలోనున్న శిశువు తన యోగబలం చేత తల్లి ఉదరం నుంచి జారి (చ్యుతమై) వెలుపలికి వచ్చి కోపంగా పులోముని వంక చూసాడు. శతకోటి సూర్యకిరణ సమానమైన ఆ పసివాని చూపులకు పులోముడు, మండి బూడిదగా మారి నేల మీద పడ్డాడు. అతని చెరనుంచి తప్పించుకున్న పులోమ.. తన బిడ్డను ఎత్తుకుని తనకు జరిగిన అవమానానికి విలపిస్తూ బ్రహ్మలోకానికి బయలుదేరింది. ఆమె కన్నీరు మహా ప్రవాహంగా మారి.. ఆమె వెనుకే బ్రహ్మలోకం దాకా వచ్చింది. విలపిస్తున్న తన కోడలు పులోమను బ్రహ్మ చూసి.. ఆమె వెనుకే వచ్చిన నదిని చూశాడు. జరిగిందంతా బ్రహ్మ తెలుసుకుని.. పులోమను ఓదార్చి, ఆమె కన్నీరు నుంచి పుట్టిన ఆ నదికి ‘వధూసర’  అని పేరు పెట్టాడు. తర్వాత ఆమెను భృగువుకు అప్పగించాడు. ఇలా భృగువు, పులోమకు పుట్టినవాడే ‘చ్యవనుడు’. తల్లి గర్భం నుంచి జారి (చ్యుతుడై) జన్మించాడు కనుక అతనికి చ్యవనుడు అని పేరు పెట్టారు భృగుదంపతులు. పులోమ, భృగువులు తపోమయ వానప్రస్థ జీవితాన్ని అనుభవిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(3 votes)
Tags : telugu mythological stories  pulomudu puloma love story  

Other Articles

  • Hathiram math historical story who played dice game with lord venkateswara

    దేవుడైన వెంకటేశ్వరునితోనే పాచికలు ఆడిన భక్తుడు

    Nov 18 | పూర్వం భక్తులు తమతమ ఇష్టదైవాలను ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే.. సాక్షాత్తూ దేవుళ్ళే స్వయంగా భువికి దిగివచ్చి వారి కోర్కెల్ని నెరవేర్చేవారు. అలా తన భక్తితో వెంకటేశ్వరుడు మెప్పించిన అపరభక్తుడు బావాజీ.. ఆయనతో కలిసి... Read more

  • Mythological story of chyanava wife sukanya who is beautiful princess

    పతివ్రతతో పరిహాసాలాడిన అశ్వినీదేవతలు

    Nov 06 | పూర్వం.. చ్యవనుడు అనే మహర్షికి సుకన్య అనే రాజకుమార్తెతో వివాహం అయ్యింది. చ్యవనుడు అంధుడు మాత్రమే కాకుండా చాలా ముసలివాడు అయినప్పటికీ.. కుందనపుబొమ్మలా వుండే సుకన్య తన యవ్వనాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా పతివ్రతా నియమంతో... Read more

  • Khandava vanam mythological story krishnarjuna history indrudu special story

    ఇంద్రుని అహంకారాన్ని అణిచిన కృష్ణార్జునులు

    Nov 02 | స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రునికి అహంకారం ఎక్కువ. భువిపై వున్న మానవులందరూ తన ద‌యాదాక్షిణ్యాల మీదే ఆధార‌ప‌డి ఉన్నార‌నీ, త‌న‌ని భ‌య‌భ‌క్తుల‌తో కొలిస్తే కానీ వారికి మ‌నుగ‌డ వుండదని  విర్రవీగుతుంటాడు. అయితే.. కృష్ణుడు అతని... Read more

  • Lord krishna gold hill donation game between arjuna and karna ramayan stories

    కృష్ణుడు ఆడిన ‘దాన’ నాటకం..!

    Sep 22 | మహాభారతంలో కీలకపాత్రుడైన కర్ణుడు.. ఆనాడు దాకకర్ణుడనని ప్రసిద్ధి. తనకు తోచించి ఇతరులకు దానం చేయడంలో ఇతను దిట్ట. బంగారమైనా, మరేమైనా సరే.. దానం చేయడంలో కర్ణుడిని మించినవాడు ఎవడూ లేడు. పైగా.. కృష్ణుడు సైతం... Read more

  • The story of vali

    తమ్ముడి భార్యనే అపహరించిన వాలి కథ

    Jul 03 | రామాయణంలో వున్న ఒక్కొక్క పాత్రకు ఒక్కొక్క కథామిషూ వుంటుంది. వారు మంచివారయినా కావొచ్చు... లేదా ధర్మానికి విరుద్ధంగా నడుచుకునే హీనులైనా అయి వుండొచ్చు. అటువంటి పాత్రలలోనే ‘‘వాలి’’ కథ కూడా ఒకటి. పూర్వం వాలి,... Read more

Today on Telugu Wishesh