అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ, ఇంతని మనసులో ఉన్న అపరాధ భావం రవ్వంతైనా తగ్గలేదు... ఇదే క్రమంలో ఈనాడు కరీంనగర్ జిల్లా గా మనం అంటున్న ప్రాంతానికి చేరుకున్నాడు... కుంటంలో స్నానం చేస్తుండగా, నరేంద్రుడికి ఒక శివ లింగం లభించింది... ఆ లింగానికి ఎంతో భక్తీ శ్రద్ధలతో పూజలు చేసి, సాక్ష్యాత్తు ఆ భోళా శంకరుడి అనుగ్రహం పొంది, తన అపరాధ భావాన్ని తొలగించుకున్నాడు... ఈ శివ లింగాన్ని ప్రతీష్టించాడు... ఆ తరువాత, చాళుఖ్య రాజుల వారి పరిపాలనలో ఆలయం నిర్మించి, రాజరాజేశ్వరీ స్వామిగా నామకరణం చేసి, ఇంతటి మహిమగల దైవ స్వరూపానికి, మరింత పేరునీ తీసుకొచ్చారు...
అయితే భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం, "శివ శివ" అని పిలిచినంతనే, వెయ్యి జన్మల పుణ్యం ప్రసాదించే స్వామి మహిమ మాత్రం, భక్తులు స్వయంగా అనుభవించారు... అందుకే ఈ ఆలయానికి అంతటి ప్రాముఖ్యత... వందల - వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, అత్యంత మహిమాన్వితమైన స్వామిని, కరీంనగర్ జిల్లా వేములవాడలో ఉన్న స్వామిని, "రాజరాజేశ్వర స్వామి" గా మనం కొలుస్తున్నాం...
దక్షిణ కాశీ గా పేరొందింది, వేములవాడ... స్వామిని దర్శించుకునేందుకు ప్రయాణం అయినప్పుడు, మార్గ మద్యం నుండే, మనం అత్యంత ప్రశాంతతని అనుభవించచ్చు... వేములవాడ మనకు స్వాగతం పలుకగానే, దారికి ఇరువైపులా విచ్చుకున్న పొద్దుతిరుగుడు పువ్వులు, మన ముఖాన మరింత చిరునవ్వుని చేకూర్చుతాయి... వేములవాడ చేరుకోగానే, స్వామిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటామా అన్న ఆత్రుత, మనలో పెరిగిపోతూ ఉంటుంది... స్వామిని సేవిన్చుకోదలిచే భక్తుల కోసం ఎన్నో ప్రత్యేకమైన సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి... ఈ సేవలు, మనల్ని భక్తిమార్గం యొక్క మాధుర్యానికి మరింత చేరువ చెయ్యడమే కాదు, గర్భగుడిలో కొలువయి ఉన్న స్వామిని, ఆయన పక్కనే చిరునవ్వుతో మనకు దర్శనం ఇచ్చే రాజరాజేశ్వరీ దేవిని, భక్తిశ్రద్ధలతో తాకి, పూజించుకునేలా చేస్తాయి... ముఖ్య ఆలయం బయట, ఆలయం ప్రాంగణంలోనే కొలువయ్యి ఉన్న జగన్మాత సమేత స్వామి స్వరూపాలను దర్శించినంత మాత్రమునే, ఆ ప్రాంగణంలో కాసేపు కూర్చుని, కళ్ళు మూసుకొని, ధ్యానం చేసినంతమాత్రమునే, ఆ సృష్టికర్త వొడిలో సేద తీరుతున్న అనుభూతి మన సొంతంఅవుతుంది ...
ఈ ఆలయ ప్రాంగణంలో ఇంకో అద్భుతం మనకు కనిపిస్తుంది... నాకు తెలిసీ, బహుసా ఈ అద్భుతం, ఇంక ఏ ఆలయంలో ఉండదేమో... మతాలు వేరైనా, దైవం ఒక్కటే అని సాక్ష్యాత్తు ఆ స్వామే చెప్పాడు అన్నందుకు ఋజువుగా, స్వామి ఆలయం ఎదుటే కొలువయ్యి ఉన్న దర్గా... ఒకింత ఆశ్చర్యంగా, ఆ వెంటనే మనకు కనువిప్పు కలిగించేలా ఉంటుంది ఈ దృశ్యం...
సంతానం కావాలనుకునే వారి ఆశ నెరవేరేలా అనుగ్రహించే స్వామికి, ఆలయ ప్రాంగణం బయటే లభ్యం అయ్యే, మనకు అందుబాటు ధరల్లో ఉండే పువ్వుల - వెండి ఉయ్యాలలు, మన స్థితి మేరకు కొనుగోలు చేసి, మనల్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుంటూ, వెండి ఉయ్యాల అయితే హుండీ లో వేసి, పువ్వుల ఉయ్యాల అయితే, గర్భగుడి ముఖ ద్వారం గుమ్మం పైన కట్టి, సంతానం కలిగితే, ఆ సంతానం ఎత్తు బెల్లం అయినా లేక మన స్థితి మేరకు కొనుగోలు చెయ్యగలిగే బెల్లం అయినా, ఆ ప్రాంగణంలోనే కొనుగోలు చేసి, దానం చేస్తాం అని మొక్కుకోవాలి... తప్పక ఆ స్వామి మన ఆశ నెరవేరుస్తాడు...
స్వామికి తల నీలాలు సమర్పించే ఆచారం కూడా ఉంది... అయితే, వంశపార్యంపర్యం గా, తిరుపతి వెంకన్న కు తలనీలాలు సమర్పించే ఆచారం మనదైతే, ఇదే విషయం వేములవాడ రాజరాజేశ్వర స్వామికి స్పష్టం గా చెప్పి రావాలి... లేదా, మూడు కత్తెరలైనా, రెండోసారి తల నీలాలు సమర్పిస్తామని అయినా, మనం మొక్కుకోవచ్చు...
ఇక ఆలయ ప్రాంగణంలో అమ్మవారికోసం లభ్యం అయ్యే చీరలు - గాజులు, ఆమెకు నివేదన చేసి, మనం తీసుకున్నా, లేక వేరొకరికి పంచినా, సుమంగళిగా వర్ధిల్లుతాం అన్నది ప్రతీతి...
ఇక స్వామిని అలంకటించే ఒక్క అరగంట మినహా, ఆ స్వామి కోవెల మనం దర్శనం చేసుకోవడం కోసం, ఉదయం నుండీ రాత్రి వరకూ తెరిచే ఉంటుంది...
ఇట్లాంటి ఎన్నో అద్భుతాల చిరునామా, వేములవాడ...
వేములవాడ... దక్షిణ కాశీ మాత్రమే కాదు... భూతల స్వర్గం కూడా...
(And get your daily news straight to your inbox)
May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి. ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more
Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more
Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more
Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more
Nov 03 | పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు.... Read more