the historical story of lord shiva's somnath temple which is located at gujarat | lord shiva mythological stories

Somanth temple historical story lord shiva mythological backgrounds

somnath temple history, somnath temple mythological story, lord shiva somnath temple, lord shiva temples, temples in india, india hindu temples, telugu mythological stories, lord shiva special stories

somanth temple historical story lord shiva mythological backgrounds : the historical story of lord shiva's somnath temple which is located at gujarat.

మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు

Posted: 11/21/2015 04:23 PM IST
Somanth temple historical story lord shiva mythological backgrounds

సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని భావిస్తారు. సోముడు అంటే.. చంద్రుడు అని అర్ధం. సోముడు కట్టించాడు కనుక సోమనాధీశ్వరుడుగా కొలుస్తారు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు. గతంలో ఆరుసార్లు ధ్వంసం చేయబడి తిరిగి పునర్మించబడినందు వల్ల.. ఈ ఆలయాన్ని అక్షరమైన ఆలయంగా వర్ణిస్తారు. జునాగర్ భారతదేశంలో విలీనమైన సందర్భంలో ఇక్కడకు విచ్చేసిన సర్దార్ వల్లభాయి పటేల్ ఈ ఆలయాన్ని దర్శించడంతో పాటు ఈ ఆలయాభివృద్ధికి ప్రణాళికను ప్రతిపాదించారు. ఆయన మరణానంతరం మంత్రి కెఎమ్ మున్షి ఆధ్వర్యంలో ఈ పునర్నిర్మాణపు కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి.

స్థలపురాణం :

దక్షుడి కుమార్తెలు 27 మందిని చంద్రుడు వివాహం చేసుకోగా.. వారిలో రోహిణి మీదే అతను ఎక్కువగా అభిమానం చూపుతుండేవాడు. దీంతో ఆగ్రహించిన మిగిలిన భార్యలు.. తమ తండ్రి దక్షునితో విన్నవించుకుంటారు. చంద్రుడు తమ మీద ఎటువంటి అభిమానం చూపడం లేదని, రోహిణి మీదే ప్రేమ చూపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దక్షుడు.. తన అల్లుడైన చంద్రుడిని శపించాడుట. అతని వాపంతో చంద్రుడు క్షయ వ్యాధి బారిన పడతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు.. తనకు ప్రాప్తించిన వ్యాధి నివారణ కోసం ఇక్కడ శివలింగాన్ని స్తాపించి, శివునిని నిత్యం పూజించేవాడు. ఇతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై.. అతనిని శాప విమోచనం చేశాడు.  అతడు శాపవిమోచనం పొందిన ప్రదేశమే ఈ ప్రభాసతీర్దం. అనంతరం.. శివుని ఆజ్ఞమేరకు చంద్రుడు అందరినీ సమానంగా చూసుకునే వాడని చరిత్ర కథనం. చంద్రుడు స్తాపించిన లింగంలో తానూ కొలువై వుంటానని శివుడు మాట ఇచ్చాడుట. అందుకే ఇక్కడి శివుడిని సోమనాధుడు అని పిలుస్తారు.

ఈ ఆలయాన్ని చంద్రుడు బంగారంతో నిర్మించాడని, తరువాత రావణుడు వెండితో కట్టించాడని పురాణ కథనాల్లో తెలుపబడి వుంది. అనంతరం ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుడు కొయ్యతోను, భీముడు రాతితోను తిరిగి నిర్మించారని చరిత్ర కధనాలు చెబుతున్నాయి. సోమనాథ్ ఆలయం అనేక సార్లు ధ్వంసం చేయబడి పునర్నిర్మించ బడింది. ఈ ఆలయంలో అపారమైన సంపద వున్న కారణంగా దానిని కొల్లగొట్టేందుకు 1024లో ఘజని మహమ్మద్ ఇక్కడికి  చేరుకొని, దండయాత్ర చేసి మొత్తం సంపదను దోచుకోవడమే కాకుండా ఆలయాన్ని ధ్వంసం చేశాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది. అయితే 1308లో అల్లాయుద్దీన్ ఖిల్జీ సైన్యంచే మళ్ళీ నాశనమయింది. ఔరంగజేబుతో సహా ముస్లిం రాజులచే ఈ ఆలయం అనేక మార్లు ధ్వంసం అయింది. ఈ ఆలయం చరిత్రలో  దండయాత్రలకి గురవుతూ.. తిరిగి నిర్మింపబడుతూ వచ్చింది. ప్రస్తుతమున్న ఈ ఆలయం భారత స్వాత్రంత్ర్యానంతరం  1950 తరువాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చే నిర్మితమైంది. సౌరాష్ట్రాలో అరేబియన్ సముద్ర తీరాన వెలసిన ఈ ఆలయం ఎంతో సుందరమైనది. ఆలయం లోపల అంతా సువర్ణమయమై, అందమైన శిల్ప కుడ్యాలతో అలరారుతూ వుంది.

ఆలయ నిర్మాణం :

ఆలయం లోపల విశాలమైన మంటపం, ఎత్తైన, అందమైన గుండ్రటి గోపురం అందంగా కనిపిస్తుంది. గర్భగుడిలో శివలింగం చాలా పెద్దది. శివలింగం వెనుక పార్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది. ద్వారానికి కుడిపక్క వినాయకుడి విగ్రహం, ఎడమ పక్క ఆంజనేయ విగ్రహం వున్నాయి. ఆలయంలో విశాలమైన గర్భగుడి, బంగారు గోడలు, తలుపులు, వివిధ రకాలుగా అందమైన అలంకరణలో శివుడు, సుగంధ పరిమళాల మధ్య  ధూప దీప కాంతులతో  హారతుల మధ్య, శివనామ స్మరణం తో మారుమ్రోగే ఆలయ ప్రాంగణం,  ఆలయాని తాకే సాగర కెరటాలు, ఆ వాతావరణమే ఎంతో అద్భుతం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : somnath temple history  lord shiva history  telugu mythological stories  

Other Articles

  • Special story on tadbund hanuman temple

    స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు

    May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి.  ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more

  • Vemulawada is a paradise

    భూతల స్వర్గం... వేములవాడ

    Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more

  • Inavolu mallikarjuna swamy temple history indian hindu gods lord shiva mythology

    అత్యంత పురాతనమైన మల్లికార్జున ఆలయ విశేషాలు

    Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more

  • Mattewada bhogeswara swamy temple historical story kakatiya dynasty

    మట్టెవాడలో కొలువైవున్న ‘భోగేశ్వరాలయం’ విశేషాలు

    Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more

  • Prayaga madhaveshwari devi temple historical story goddess parvathi

    అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ‘మాధవేశ్వరీ దేవి ఆలయం’

    Nov 03 | పూర్వం... దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే.. ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు.... Read more