Makara Sankranti History and Importance in Telugu

Makara sankranti history and importance in telugu

Makara Sankranti, Sankranti, Sankranti Festival, Sankranti History in Telugu, Sankranthi Festival in Telugu, Importance of Sankranti

Know the Makara Sankranti History and Importance in Telugu. Makar Sankranti is an Indian festival celebrated in almost all parts of India and Nepal in lots of cultural forms.

సంబరాల సంక్రాంతి పండుగ

Posted: 01/14/2016 01:18 PM IST
Makara sankranti history and importance in telugu

ఉత్తరాయణ పుణ్యకాలంలో మార్గశిర, పుష్యమాసాల్లో సంక్రాంతి వస్తుంది. సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలోనికి వస్తూ మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం లేదా మకర సంక్రాంతి అంటారు. మన పూర్వులు సూర్యుని సంచారాన్ని రెండు భాగాలుగా విభజించారు. సూర్యుడు భూమధ్యరేఖకు ఉత్తర దిశలో ఉన్నప్పుడు ఉత్తరాయణమనీ, దక్షిణ దిశలో ఉన్నప్పుడు దక్షిణాయణమనీ అన్నారు. సంక్రమణ అంటే ఒకచోటి నుంచి మరో చోటికి జరిగే మార్పు అని అర్థం. సూర్యుడు తన నిరంతర కాల ప్రయాణంలో ధనూరాశిని వీడి మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటారు.

సంక్రాంతి అనగానే అందరి కళ్ళల్లో కాంతి. ముఖ్యంగా పల్లెటూళ్ళల్లో, తెలిమంచు తొలుగుతుండగా, హరిదాసుల శ్రావ్యమైన కీర్తనలు వినిపిస్తూ ఉంటె, పల్లెపడుచులు వేసే ముత్యాల ముగ్గులకు మరింత అందం ఒచ్చినట్టుగా ఉంటుంది. వాటి మధ్య పూలతో అలంకరించిన గొబ్బెమ్మలు, ఆ ముగ్గులకే అందాన్ని ఇస్తాయి. ఇక కొత్త అల్లుళ్ళ హడావుడి, మరదళ్లస రసాలు, పిండి వంటల ఘుమఘుమలు, కొత్త బట్టల కాంతి, పంట ఇంటికొచ్చిన వేళ రైతన్న కళ్ళల్లో కమ్మని తృప్తి, ఆరుగాలం కష్టపడ్డ పశువులకు, సంక్రాంతి పుణ్యమా అని దొరికే విశ్రాంతి నిజంగా పెద్దపండుగ కాదా సంక్రాంతి.

రైతన్నకు పంట చేతికొచ్చే సమయం కూడా ఇదే కావడంతో, సంక్రాంతి పచ్చని పండుగే మరి. సాధారణంగా మనపండుగాలన్నే తిధులను అనుసరించే ఒస్తాయి. కానీ సంక్రాంతి మాత్రం, గ్రెగొరియన్, అదే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారం, ముందుకు వెళ్తాం. మనకు లోతుగా తెలియని ఎన్నో వింతల్లో, ఇది కూడా ఒకటేగా మరి?

సంక్రాంతి ఇంత ప్రాముఖ్యం కనుకనే, పట్టాణాలకు వల సఒచ్చినవారు కూడా, పండక్కి వారి ఊరుప్రయాణం అవుతుంటారు. నలుగురిని ఏకం చేసే పండుగ... ప్రకృతిని మనం కొలవగలిగే పండుగ. సంక్రాంతి మనపండుగ...  

ముగ్గుల్లో సైన్స్!

ఈ రోజుల్లో తెలుగు వాకిళ్లలో కళాకాంతులు నింపే ముగ్గులు ఆత్మనివేదన రూపాలని భావిస్తారు. దీనిలో ఆరోగ్య, ఖగోళ, జ్యోతిష విజ్ఞాన రహస్యాలెన్నో దాగి ఉన్నాయి. ఈ నెల రోజుల పాటు వాకిట్లో వేయాల్సిన ముగ్గులను గురించి పురాణాలు వర్ణించాయి. ఈ ముగ్గుల సంకేతాలలో సైన్స్ దాగివుందని అర్చనా శాస్త్రి అనే రచయిత్రి తన పరిశోధనలో నిరూపించారు. ఈ ముగ్గులలో పాము ముగ్గులు, చుక్కల ముగ్గులని ముఖ్యంగా రెండు రకాలుంటాయి. కేరళలో పాముల ముగ్గులకు పాశస్త్యం ఎక్కువ. తెలుగువాళ్లు చుక్కల ముగ్గులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. చుక్కని సంస్కృతంలో బిందువు అంటారు. బిందువు అనేది రూపం కావొచ్చు, నాదం కావొచ్చు. అది కూడా సృష్టికి సంకేతమే. ముగ్గు వేయడం ఒక కళాత్మక విజ్ఞానమని దానిలో ప్రకృతి పరిశీలన, ఆత్మ నివేదన ఉన్నాయని తాత్తికులు అంటారు.

సంక్రాంతిలో “సం” అంటే మిక్కిలి “క్రాంతి” అంటే అభ్యుదయం. మంచి అభ్యుదయాన్ని ఇచ్చు క్రాంతి కనుక దీనిని “సంక్రాంతి” గా పెద్దలు వివరణ చెబుతూ “మకరం” అంటే! మొసలి. ఇది పట్టుకుంటే వదలదు అని మనకు తెలుసు. కాని మానవుని యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అడుగడుగునా అడ్డుతగులుతూ, మొక్షమార్గానికి అనర్హుని చేయుటలో ఇది అందవేసినచేయి! అందువల్ల ఈ “మకర సంక్రమణం” పుణ్యదినాలలో దీని బారినుండి తప్పించుకునేందుకు ఒకటేమార్గం అది ఎవరికి వారు యధాశక్తి ‘లేదు’ అనకుండా దానధర్మాలు చేయుటయే మంచిదని, శాస్త్రకోవిదులు చెబుతూ ఉంటారు. ఈ రోజున స్వర్గ వాకిళ్లు తెరుస్తారని హిందువుల నమ్మకం. బెల్లం, గుమ్మడి కాయలు "దానమి"స్తారు. పితృదేవతలకు "తర్పణాలు" వదులుతారు.

దేశవ్యాప్తంగా సంక్రాంతి...

-మహారాష్ట్రలో తీల్‌గూల్ అనే పేరుతో నువ్వులతో హల్వా చేసి, ఇంటింటికీ పంచుతారు. నువ్వులు, బెల్లం, చక్కెర కలిపి ఆల్‌గుడ్, ఆల్‌లడ్డూలు అని చేస్తారు. వీటిని ఆల్‌గుళ్‌ఘ్యా, గోడ్ గోడ్ బోలా అని ఒకరికొకరు చెప్పుకుంటూ పంచుకుంటారు. పాత కోపాలు మరిచిపోయి స్నేహంగా ఉండాలని దీని అర్థం. పెళ్లయిన ఆడవాళ్లకు ఒక కొత్త పాత్రను బహుమతిగా ఇస్తారు. ఈ వేడుకను హల్డీ కుంకుమ్ అంటారు. మన దగ్గర పసుపుబొట్ల లాగ అన్నమాట.
-గుజరాతీలు కూడా నువ్వులు, మిఠాయిలు పంచిపెడతారు. పండుగ నాడు పెద్దలందరూ చిన్నవాళ్లకు బహుమతులు ఇవ్వడం ఇక్కడి ఆచారం. అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం కూడా జరుగుతుంది. రాత్రిపూట తుకల్ అనే దీపాల గాలిపటాలను ఎగరేస్తారు.
-పంజాబ్‌లో ఈరోజున మిఠాయిలతో గోపాల వ్రతం చేస్తారు. మకర సంక్రాంతికి ముందురోజున లోడి అనే ఉత్సవం జరుపుతారు. ఈరోజున వారు హోలి పండుగ లాగా ప్రతీచోట మంటలను వేసి, వాటిలో కాలుతున్న కట్టెలను నేలపై బాదుతూ ఆనందిస్తారు. భోగి పండుగను లోహరిగా జరుపుకొంటారు. పెద్ద పెద్ద మంటలు వేసి, వాటిలోకి మిఠాయిలు, చెరుకు గడలు, బియ్యం విసిరేస్తారు. అక్కడ మకర సంక్రాంతి ఉత్సవాన్ని మాఘీ అంటారు. చిన్నా పెద్దా అందరూ కలిసి భాగ్రా నృత్యం చేసి, విందు చేసుకుంటారు.
-ఉత్తర్ ప్రదేశ్‌లో సంక్రాంతిని పుణ్యదినంగా భావిస్తారు. గంగ, యమున, సరస్వతి నదులు కలిసే ప్ర యాగలో స్నానం చేయడం అక్కడి ఆచారం. అలా చేయకపోతే వచ్చే జన్మలో గాడిదగా పుడతారని నమ్ముతారు. అక్కడి సంక్రాంతిని కిచెరి అంటారు.
-ఒరిస్సాలోని గిరిజనులకు సంక్రాంతితో కొత్త ఏడాది మొదలవుతుంది. పెద్ద పెద్ద మంటలు వేసి, కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతారు.
-గంగానది సముద్రంలో కలిసే ప్రాంతమైన గంగాసాగర్‌లో స్నానం చేయడం బెంగాల్ వాళ్ల ఆచారం. సగరుని కొడుకులను బూడిదగా మార్చిన కపిల మహర్షి ఆశ్రమం ఇక్కడికి దగ్గర్లోనే ఉంది. అందుకనే ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.
-తమిళనాడులో సంక్రాంతిని పొంగల్ పేరుతో నాలుగు రోజుల పాటు జరుపుకొంటారు. భోగి రోజున కొత్త బియ్యం, పాలతో పాయసం చేసి, ఇంద్రునికి నైవేద్యం పెడతారు. మరుసటి రోజు సూర్య పొంగల రోజున సూర్యుడిని పూజిస్తారు. మట్టు పొంగల్ నాడు పశువులను అలంకరిస్తే కన్యా పొంగల రోజున పొంగల్ నైవేద్యం ముద్దలను పక్షులకు ఆహారంగా పెడతారు. సంక్రాంతి రోజున ఎడ్ల కొమ్ములను డబ్బులు కట్టి పరిగెత్తించి, వాటిని విప్పుకుని వచ్చే పోటీలు పెడుతారు.

దేశ ప్రజలందరికీ తెలుగు విశేష్ తరపున మకర సంక్రాంతి (పొంగల్) పండగ శుభాకాంక్షలు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sankranti Festival  Makara Sankranti  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more