Bakrid is well known muslim festival

Bakrid is one of the most important muslim festivals

Bakrid, Muslims, Festival, Bakrid greeting, Bakrid news, Bakrid wishes

Bakrid is one of the most important Muslim festivals. Bakr-id, to be rightly called Id-ul-Azha, is one of the most important Muslim festivals. This festival is observed and celebrated as a Festival of Sacrifice by Muslims all over the world. It falls on the 10th of Dhul-Hagg, the last month of the lunar year. Bakrid is celebrated in commemoration of Abraham's willingness to offer his only son as a sacrifice at God's command. On this day, goats are sacrificed as an offering. Bakrid is celebrated with great enthusiasm and vigor among Muslims.

నిజమైన త్యాగానికి ప్రతీకే బక్రీద్

Posted: 09/25/2015 09:04 AM IST
Bakrid is one of the most important muslim festivals

ఇస్లాం ధర్మంలో రెండు పండగలకు గుర్తింపు ఉంది. ఒకటి రంజాన్. దీనిని ఈదుల్ ఫితర్ అంటరు. రెండవది బక్రీద్. దీనిని ఈదుల ఆదా అంటరు. దీనికే ఈదుల్ జుహా అని మరో పేరు కూడా ఉంది. ఈ పండగను త్యాగానికి ప్రతీకగా జరుపుకుంటరు. సత్యం, ధర్మాలను కాపాడటానికి దైవాజ్ఞలను నిర్విఘ్నంగా నెరవేర్చడానికి బక్రీద్ పండగలో ఖుర్బానీ ప్రక్రియ భక్తులకు బోధిస్తుంది. ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్‌లో బక్రీద్ విషిష్టతలను వివరించారు. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అంటే జంతువు, ఈద్ అంటే పండగ. జంతువు కుర్బానీ ఇచ్చే పండగ కనుక, దీనిని ఈదుల్ ఖుర్బానీ అంటరు. బక్రీద్ నాడు సాధ్యమైనంత వరకు ప్రతి ముస్లిం ఖుర్బానీ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఖుర్బానీ అంటే జంతువు మాంసాన్ని దానం చేయడం.

త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశం. ఎన్నో త్యాగాలు, ఇంకెన్నో బలిదానాలు, ఒక మనిషి సహనానికి పరాకాష్ట అనదగ్గ పలు పరీక్షలు.. వీటన్నింటినీ తట్టుకుని నిలిచిన అపూర్వ వ్యక్తిత్వం. సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే ఇందుకు చక్కని చారిత్రక ఉదాహరణ. సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం అనేక పరీక్షలు ఎర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మ వ్యాపారం చేయొద్దన్న కారణంగా ఆయనను తండ్రి ఇంటి నుంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజమూ కన్నెర్రజేసింది. అధికారాన్ని, దైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహమూ చవిచూశారు. కనుల ముందు అగ్గి రాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే కీలల్లో పడేసినా ప్రాణ త్యాగానికే సిద్ధమయ్యారు సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం. కానీ రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించేందుకు ససేమిరా అన్నారు. చివరికి దేశ బహిష్కారం చేసినా సంచార జీవనాన్ని కొనసాగించారు కాని రాజు ఆధిపత్యాన్ని అంగీకరించలేదు.

కట్టుకున్న భార్యను, కన్న కొడుకు ఇస్మాయిల్-ను జనసంచారం లేని ఎడారిలో వదిలేయమని సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీంను సాక్షాత్తూ దైవమే ఆజ్ఞాపించాడు. ఎందుకు అని ప్రశ్నించకుండా దైవాజ్ఞను పాటించారు. కనీసం నాలుక తడుపుకోవడానికి కూడా గుక్కెడు నీళ్ళు లేని ఆ ఎడారిలో చిన్నారి పసికందు ఇస్మాయిల్ దాహంతో గుక్కపట్టి ఏడుస్తూ కాళ్ళ మడమతో రాసిన చోటల్లా అల్లాహ్ మహిమతో బ్రహ్మాండమైన నీటి ఊట ఉబికింది. ‘జమ్ జమ్’ అనే పేరు గల ఆ పవిత్ర జలంతో తల్లీ బిడ్డలు దాహం తీర్చుకున్నారు. ఆ రోజు రెండు ప్రాణాల కోసం ఉబికిన ఆ నీరే ఇప్పుడు లక్షలాది మంది అవసరాలు తీరుస్తూ తన మట్టాన్ని యథాతథంగా ఉంచుకోవడం దేవుని ప్రత్యక్ష మహిమకు నిదర్శనం.

సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందాన్ని అనుభవించక ముందే సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం మరో కఠిన పరీక్షను ఎదర్కోవాల్సి వచ్చింది. దైవాజ్ఞ మేరకు ఆయన ప్రాణ సమానమైన పుత్రుడ్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి వచ్చింది. సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం దానికీ సిద్ధపడ్డారు. భార్యను, కుమారుడ్ని ఈ విషయమై సంప్రతించారు. లేక లేక అల్లాహ్ అనుగ్రహించిన వరం ఇస్మాయిల్ అని, ఆ వరాన్ని తిరిగి ఆయనే కోరుకుంటున్నప్పుడు సమర్పించచడమే మన ధర్మం. అంతా దైవ లీల అని ఆయన భార్య హాజరా సలహా ఇచ్చారు. ఈ క్రమంలో ‘దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండి నాన్నా! దైవచిత్తమైతే నన్ను మీరు సహనవంతునిగా చూస్తారు’ అని చిన్నారి ఇస్మాయిల్ అన్నారు. ఆ సమయంలో తండ్రీ కుమారుల మధ్య జరిగిన సంభాషణ విన్న సృష్టిలోని అణువణువూ అవాక్కయిపోయింది. ప్రకృతి ఒక్కసారిగా స్తంభించిపోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ.. అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తి పెట్టి జుబహ్ చేయడానికి  సయ్యద్ హజ్రత్ ఇబ్రాహీం సిద్ధమయ్యారు. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దైవం పతాక స్థాయిలో ప్రసన్నుడయ్యారు. వారి త్యాగాన్ని స్వీకరించారు. చిన్నారి ఇస్మాయిల్ స్థానంలో జుబహ్ చేయడానికి ఒక స్వర్గలోకపు పొ్ట్టేలును ప్రత్యక్ష పరిచారు. నాటి త్యాగానికి సంబంధించిన సంక్షిప్త గాధ ఇది. ఈ కథలో ఓ మంచి ఆదర్శం ఉంది. మంచి కోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ముస్లిం సమాజం ఇప్పుడు జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే ప్రేరణ.

ఈ బక్రీద్ సందర్భంగా మీకు, మీ కుటుంబానికి అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం. ఆ అల్లా మీకు మంచి కలిగేలా ఆశిస్సునివ్వాలని.. తెలియక చేసిన తప్పులను క్షమించాలని తెలుగువిశేష్ (http://www.teluguwishesh.com/ )మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bakrid  Muslims  Festival  Bakrid greeting  Bakrid news  Bakrid wishes  

Other Articles

  • Vilambi nama samvasthara ugadi special story

    ఉగాది పండగ విశిష్టత.. కథలు తెలుసా.?

    Mar 17 | భారతీయ జీవన విధానంలో పండుగలకు ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత నెలకొని వుంది. మరీ ముఖ్యంగా హైందవ మతాచారం ప్రకారం పండుగలకు ఎనలేని విశిష్టత ఉంటుంది. ఇక ముఖ్యంగా అందరూ అచరించే న్యూఇయర్ సంబరాలకు. తెలుగు... Read more

  • Kanuma festival special

    కనుమ పండుగ విశిష్టత

    Jan 13 | సంక్రాంతి వేడుకల్లో చివరి రోజు పండుగ కనుమ. దీనిని ద్వాపరయుగం నుండి జరుపుకుంటునట్లు మన గ్రంథాల ద్వార తెలుస్తుంది.శ్రీ కృష్ణుడు ఒక ఆచారంగా వస్తున్న ఇంధ్రుడ్ని పూజించడం తగదని మనం మన గోవులు సుఖసంతోషాలతో జీవించడానికి... Read more

  • Bhogi festival special

    భోగభాగ్యాల భోగి పండుగ

    Jan 13 | సంక్రాంతి పండగ హడావుడి అంతా ఒకరోజు ముందుగా వచ్చే భోగి మంటలతోనే మొదలవుతుంది. ముచ్చటైన మూడు రోజుల పెద్ద పండగలో మొట్టమొదటి సందడి భోగిది. తెల్లారు జామునే లేచి.. ఊరంతా మంచుతెరలు కట్టినట్టుండే దృశ్యంలో-... Read more

  • Bathukamma the floral festival of telangana

    తెలంగాణ పెద్ద పండుగ సద్దుల బతుకమ్మ

    Oct 08 | ప్రకృతితో మనిషిని మమేకం చేయటమే బతుకమ్మ పండుగ ప్రధాన ఉద్దేశం. ప్రతి మనిషి జీవితంకి పకృతితో విడదీయ్యని సంబంధం ఉంటుంది. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తుంది దానితో మనిషి పకృతిలో కలిసిపోయి... Read more

  • Dasara navarathri special article

    దసరా శరన్నవరాత్రులు

    Oct 01 | దసరా(విజయదశమి) చెడుపై మంచి సాధించిన విజయానికి జరుపుకునే పండుగగా ప్రసిద్ధి. అయితే ఈ పండగ విషయంలో దేశ వ్యాప్తంగా భిన్న అభిప్రాయాలు(పురాణాల ప్రకారం వేరు వేరు కథలు) ఉన్నాయి. దీంతో దేశమంతా వివిధ రూపాలలో... Read more